Vande Bharat Express: త్వరలో పూణే – సికింద్రాబాద్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్
ఈ కొత్త రైలు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వచ్చే సికింద్రాబాద్ రైల్వే డివిజన్‌కు చెందినది. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్థానంలో వందే భారత్ రైళ్లను ఏర్పాటు చేయాలని రైల్వే ఇప్పటికే నిర్ణయించింది. రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ఒకటి సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య, మరొకటి సికింద్రాబాద్-తిరుపతి మధ్య ఇప్పటికే నడుస్తున్నాయి. అయితే, ప్రయాణికులలో హైస్పీడ్ రైళ్లకు నానాటికీ పెరుగుతున్న..
Vande Bharat Express: పూణే- సికింద్రాబాద్ మధ్య కనెక్టివిటీని పెంచుతూ, దక్షిణ మధ్య రైల్వే త్వరలో రెండు నగరాల మధ్య కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. కొత్త మార్గాల్లో ఈ వందే భారత్‌ను నడిపేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా సెమీ-హై స్పీడ్ రైలు సేవలను మరింత విస్తరించేందుకు భారతీయ రైల్వే చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా, దక్షిణ మధ్య రైల్వే (SCR) త్వరలో సికింద్రాబాద్ – పూణేల మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌ను, ఇతర 9 మార్గాల్లో ఈ వందేభారత్‌సేవలను ప్రారంభించాలని యోచిస్తోంది కేంద్ర ప్రభుత్వం.
ఈ కొత్త రైలు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వచ్చే సికింద్రాబాద్ రైల్వే డివిజన్‌కు చెందినది. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్థానంలో వందే భారత్ రైళ్లను ఏర్పాటు చేయాలని రైల్వే ఇప్పటికే నిర్ణయించింది. రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ఒకటి సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య, మరొకటి సికింద్రాబాద్-తిరుపతి మధ్య ఇప్పటికే నడుస్తున్నాయి. అయితే, ప్రయాణికులలో హైస్పీడ్ రైళ్లకు నానాటికీ పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా, సౌత్ సెంట్రల్ రైల్వే సేవలను మరింత విస్తరించాలని నిర్ణయించింది.
త్వరలో మరో 10 కొత్త వందే భారత్ రైళ్లు
దేశవ్యాప్తంగా త్వరలో ప్రారంభించనున్న 10 కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఒకటి సికింద్రాబాద్ – పూణే మార్గంలో ప్రవేశ పెట్టనున్నారు. ఇది అత్యంత రద్దీగా ఉండే వాటిలో ఒకటిగా పరిగణిస్తున్నారు. సికింద్రాబాద్-పూణే కాకుండా, వారణాసి-లక్నో, పాట్నా-జల్పాయిగురి, మడ్గావ్-మంగళూరు, ఢిల్లీ-అమృతసర్, ఇండోర్-సూరత్, ముంబై-కొల్హాపూర్, ముంబై-జల్నా, పూణే-వడోదర, టాటానగర్-వారణాసి సెక్షన్ల మధ్య కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి భారతదేశంలో ఈ సెమీ-హై స్పీడ్ వందే భారత్ రైళ్ల సంఖ్య 34కి చేరుకుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రపంచ స్థాయి ప్రయాణీకుల సౌకర్యాలతో కూడిన భారతదేశపు మొదటి సెమీ-హైస్పీడ్ రైలు. ఈ సిరీస్‌లోని మొదటి రైలు ఫిబ్రవరి 15, 2019న ఢిల్లీ – వారణాసి మధ్య ప్రారంభమైంది. వందేభారత్ రైళ్ల ఆక్యుపెన్సీ రేషియో ఇప్పటివరకు ఏ ఇతర రైళ్లలోనూ అందుబాటులో లేని కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్నందున వాటి ఆక్యుపెన్సీ రేషియో చాలా ఎక్కువగా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి