AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Free Update: గుడ్‌న్యూస్‌.. మరోమారు ఉచిత ఆధార్‌ అప్‌డేట్‌ గడువు పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే!

ఆధార్‌ కోసం పేరు రిజిస్టర్ చేసుకున్న తేదీ నుంచి పదేండ్లు పూర్తయిన తర్వాత తగిన పత్రాలతో ఆధార్ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసుకోవాలని గతంలో యూఐడీఏఐ సూచించింది. ఇక నుంచి ప్రతి ఒక్కరూ పదేండ్లకోసారి గుర్తింపు కార్డు అడ్రస్ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపాజిటరీ (సీఐడీఆర్)లోని వివరాలు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.ఈ ప్రక్రియతో దేశ ప్రజలవ్యక్తిగత సమాచారం..

Aadhaar Free Update: గుడ్‌న్యూస్‌.. మరోమారు ఉచిత ఆధార్‌ అప్‌డేట్‌ గడువు పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే!
Aadhaar Free Update
Subhash Goud
|

Updated on: Dec 12, 2023 | 9:45 PM

Share

ఈ రోజుల్లో ఆధార్‌ ప్రతి ఒక్కరికి ఆధార్‌ తప్పనిసరి కావాల్సిందే. బ్యాంకు అకౌంట్‌ నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పథకాలకు ఇలా ఒక్కటేమిటి అన్నింటికి ఆధార్‌ కావాల్సిందే. గతంలో ఆధార్‌ కార్డు ఉన్నవారు పది సంవత్సరాల తర్వాత తమ బయోమెట్రిక్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవడానికి యూఐడీఏఐ ఈ నెల 14 వరకు గడువు ఇచ్చింది. కానీ తాజాగా మరోసారి ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవడానికి గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది యూఐడీఏఐ. దీంతో వచ్చే ఏడాది అంటే 2024 మార్చి 14 వరకూ ఉచితంగా ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తుండటంతో గడువు పొడిగించాలని నిర్ణయించామని ఉడాయ్ ఓ ప్రకటనలో తెలిపింది. గడువు దాటిన తర్వాత ఫీజు చెల్లించి ఆధార్ పత్రాలు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఆధార్‌ కోసం పేరు రిజిస్టర్ చేసుకున్న తేదీ నుంచి పదేండ్లు పూర్తయిన తర్వాత తగిన పత్రాలతో ఆధార్ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసుకోవాలని గతంలో యూఐడీఏఐ సూచించింది. ఇక నుంచి ప్రతి ఒక్కరూ పదేండ్లకోసారి గుర్తింపు కార్డు అడ్రస్ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపాజిటరీ (సీఐడీఆర్)లోని వివరాలు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.ఈ ప్రక్రియతో దేశ ప్రజలవ్యక్తిగత సమాచారం ఎప్పటికప్పుడు సీఐడీఆర్‌లో అప్‌డేట్ అవుతూ ఉంటుందని, దీనివల్ల ఖచ్చితమైన సమాచారం నిక్షిప్తమవుతుందని యూఐడీఏఐ తెలిపింది.

ఆధార్‌ అప్‌డేట్‌ కోసం కావాల్సిన పత్రాలు:

ఇవి కూడా చదవండి

ఆధార్ వివరాలు అప్‌డేట్ చేయాల్సిన వారు.. ఉడాయ్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి లేటెస్ట్ గుర్తింపు కార్డు, అడ్రస్ వివరాలు సబ్మిట్ చేయాలి.

  • రేషన్ కార్డ్
  • ఓటరు గుర్తింపు కార్డు
  • కిసాన్ ఫోటో
  • పాస్‌బుక్
  • చిరునామా పత్రాలు

తదితర డాక్యుమెంట్లను గుర్తింపు పత్రాలు వాడవచ్చు. విద్యార్థులైతే వారి విద్యా సంస్థ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (టీసీ), మార్క్ షీట్, పాన్/ ఈ-పాన్, డ్రైవింగ్ లైసెన్స్ కూడా గుర్తింపు ధ్రువీకరణ పత్రంగా ఉపయోగ పడతాయని పేర్కొంది. అలాగే మూడు నెలల్లోపు చెల్లించిన విద్యుత్, వాటర్, గ్యాస్, టెలిఫోన్ బిల్లుల రశీదులు కూడా అడ్రస్ ధ్రువీకరణ పత్రాలుగా వినియోగించవచ్చునని యూఐడీఏఐ పేర్కొంది. ధ్రువీకరణ పత్రాల స్కాన్డ్ పత్రాలను ‘మై ఆధార్’ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పాలల్లో కుంకుమ పువ్వు వేసి తాగుతున్నారా? శరీరంలో జరిగేది తెలిస్తే
పాలల్లో కుంకుమ పువ్వు వేసి తాగుతున్నారా? శరీరంలో జరిగేది తెలిస్తే
భర్తపై దాడి చేయించిన భార్య.. పెళ్లి వేడుకల్లో కలకలం..
భర్తపై దాడి చేయించిన భార్య.. పెళ్లి వేడుకల్లో కలకలం..
తవ్వుతున్న కొద్దీ విగ్రహాలే.. ఆరు నెలల్లో 12 విగ్రహాలు..
తవ్వుతున్న కొద్దీ విగ్రహాలే.. ఆరు నెలల్లో 12 విగ్రహాలు..
పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన బాలిక.. ఎక్స్-రే చూస్తే..
పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన బాలిక.. ఎక్స్-రే చూస్తే..
రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..
రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో
ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..
ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!