Gold Loan: మీరు బంగారంపై రుణం తీసుకున్నారా..? ఈ తప్పులు చేయకండి!

ముత్తూట్, మన్నాపురం వంటి సంస్థలు ఇంట్లో కూడా బంగారు రుణం పొందే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. గోల్డ్ లోన్‌కు ఎడ్యుకేషన్ లోన్ లేదా పర్సనల్ లోన్ వంటి పెద్దగా పేపర్‌వర్క్ అవసరం లేదు. కొన్ని గంటల్లోనే లోన్ అందుబాటులోకి వస్తుంది. విశేషమేమిటంటే.. గోల్డ్ లోన్ అమౌంట్‌పై ఎలాంటి పరిమితి లేదు. ఈ మొత్తాన్ని ఏ పనికైనా ఉపయోగించవచ్చు. ఇది సెక్యూర్డ్ లోన్ కాబట్టి బ్యాంకు..

Gold Loan: మీరు బంగారంపై రుణం తీసుకున్నారా..? ఈ తప్పులు చేయకండి!
Gold Loan
Follow us
Subhash Goud

|

Updated on: Dec 12, 2023 | 4:36 PM

చాలా మంది బంగారంపై రుణాలు తీసుకుంటారు. బ్యాంకుల నుంచి పర్సనల్‌ లోన్‌, హోమ్‌లోన్‌, ఇతర లోన్స్‌ కంటే బంగారంపై రుణాలు సులభంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఎలాంటి ప్రాసెస్‌ ఉండదు. ఎలాంటి పత్రాలు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇతర రుణాల కోసం బ్యాంకుల ప్రాసెస్‌ చాలా ఉంటుంది. రుణాలు రావాలంటే చాలా సమయం పడుతుంది. ఇక బంగారాన్ని తాకట్టుపెట్టి నిమిషాల్లోనే రుణం తీసుకునే సదుపాయం ఉంటుంది. ఇతర రుణాల కంటే బంగారంపై రుణాలు త్వరగా అందిస్తుంటాయి బ్యాంకులు, ఇతర ఫైనాన్స్‌ సంస్థలు. అయితే చాలా మంది బంగారంపై రుణం తీసుకుని సరైన చెల్లింపులు చేయరు. ఇలాంటి సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. చివరికి తాకట్టు పెట్టిన బంగారం పైతం పోతుంది. ఇలాంటి పరిస్థితి చాలా మందికి ఎదురవుతుంటుంది. సరైన వాయిదాలు చెల్లించకుంటే సంస్థలు బంగారాన్ని వేలం వేస్తుంటాయి. ప్రతిరోజూ వార్తాపత్రికల్లో బంగారం వేలానికి సంబంధించిన ప్రకటనలు ఎన్నో చూస్తుంటాము.

ఎక్కువగా బంగారంపై రుణం అందించే ఫైనాన్స్ సంస్థలు

ముత్తూట్, మన్నాపురం వంటి సంస్థలు ఇంట్లో కూడా బంగారు రుణం పొందే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. గోల్డ్ లోన్‌కు ఎడ్యుకేషన్ లోన్ లేదా పర్సనల్ లోన్ వంటి పెద్దగా పేపర్‌వర్క్ అవసరం లేదు. కొన్ని గంటల్లోనే లోన్ అందుబాటులోకి వస్తుంది. విశేషమేమిటంటే.. గోల్డ్ లోన్ అమౌంట్‌పై ఎలాంటి పరిమితి లేదు. ఈ మొత్తాన్ని ఏ పనికైనా ఉపయోగించవచ్చు. ఇది సెక్యూర్డ్ లోన్ కాబట్టి బ్యాంకు సులభంగా రుణం ఇవ్వగలదు. అందుకే మార్కెట్‌లో ఈ రుణానికి డిమాండ్ వేగంగా పెరుగుతోంది.

భారతదేశంలో గోల్డ్ లోన్ వ్యవస్థీకృత మార్కెట్ దాదాపు రూ.6 లక్షల కోట్లు. ఇందులో బ్యాంకుల వాటా 80 శాతం కాగా.. 20 శాతం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రధాన బ్యాంకులు గోల్డ్ లోన్ విభాగంలో వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ విషయంలో ఎన్‌బీఎఫ్‌సీలు కూడా బ్యాంకులకు ధీటుగా కనిపిస్తున్నాయి. దీని కారణంగా దేశంలో గోల్డ్ లోన్ మార్కెట్ వేగంగా పెరుగుతోంది. జూలై 2023లో బంగారం రుణాల బకాయిలు రూ.95,746 కోట్లకు పెరిగాయని ఆర్‌బీఐ గణాంకాలు చెబుతున్నాయి. జూలై 2022తో పోలిస్తే ఇది 23.1 శాతం వృద్ధిని నమోదు చేసింది. దేశంలో చాలా మందికి క్రెడిట్ అసెస్‌మెంట్ చేసే అలవాటు లేదని బ్యాంకింగ్ నిపుణుడు అమిత్ కుమార్ తన్వర్ అంటున్నారు. ఏదైనా లోన్ తీసుకునే ముందు, మీరు మీ ఆస్తులు, బాధ్యతలను అంచనా వేయాలి.

ఇవి కూడా చదవండి

ఒక రుణాన్ని తిరిగి చెల్లించడానికి మరొక రుణాన్ని తీసుకోకుండా ఉండండి

ఒక రుణాన్ని తిరిగి చెల్లించడానికి మరొక రుణాన్ని తీసుకోకుండా ఉండండి. పాత రుణాన్ని తిరిగి చెల్లించడానికి చాలాసార్లు వినియోగదారులు బంగారు రుణం తీసుకుంటారు. సకాలంలో రుణం చెల్లించనప్పుడు ఆ తర్వాత బంగారం వేలంలో పోతుంది. మీరు బ్యాంకు నుంచి అయినా ఇతర ఫైనాన్స్‌ సంస్థల నుంచి అయినా బంగారంపై రుణం తీసుకుంటే సకాలంలో వడ్డీ చెల్లిస్తుండాలి. లేదా వడ్డీతో పాటు అసలు కూడా కొంత చెల్లిస్తే మీ బంగారం రుణం త్వరగా తీరిపోయే అవకాశం ఉంది. నిర్లక్ష్యం చేస్తే తాకట్టుపెట్టిన బంగారం చివరకు వేలం వేస్తారు. దీంతో మీ గోల్డ్‌ మీకు దక్కకుండా పోతుంది. చివరికి మీరు అప్పుల పాలవుతుంటారు. గోల్డ్ లోన్ వేలం తర్వాత కూడా చాలా సార్లు రుణం మొత్తం మిగిలిపోయిందని.. దానిపై బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీలు వడ్డీపై వడ్డీ వసూలు చేస్తున్నాయని అమిత్ తన్వర్ చెప్పారు.

వేలంలో పోయిన బంగారం తిరిగి వచ్చే అవకాశం ఉండదు

గోల్డ్ పై రుణం చెల్లింపులు చేయకుంటే వేలంలో పోయిన బంగారం తిరిగి వచ్చే అవకాశాలు ఉండవు. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే బంగారంపై రుణం తీసుకునే బదులు అమ్మి అప్పు తీర్చుకోవడం మంచిది. మీ ఆస్తులతో పోలిస్తే మీ అప్పులు పెరిగితే, కొత్త రుణం తీసుకోకుండా ఉండండి. ఈ స్థితిలో ఆస్తులు అమ్మి అప్పుల భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం జరుగుతుంటుంది. మీరు గోల్డ్ లోన్ EMI చెల్లించలేకపోతే లోన్ కంపెనీకి వెళ్లి రుణాన్ని రీషెడ్యూల్ చేసుకోండి. రుణం కంటే బంగారం విలువ ఎక్కువగా ఉంటే.. రుణ కాలపరిమితిని పొడిగించవచ్చు. ప్రస్తుత కంపెనీ ఈ విషయంలో సహాయం చేయకుంటే మీరు బ్యాలెన్స్‌ని మరొక కంపెనీకి బదిలీ చేసుకోవచ్చు. తీసుకున్న అప్పు తీర్చలేకపోతే.. కొద్దిరోజుల పాటు స్నేహితులు లేదా బంధువుల దగ్గర డబ్బులు తీసుకుని బంగారాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించుకుని అప్పు తీర్చుకోండి. ఇలా చేసినట్లయతిఏ అప్పుడు మీరు భారీ నష్టాలను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే