LIC Jeevan Utsav: ఎల్‌ఐసీ నుంచి అదిరిపోయే ప్లాన్.. జీవితాంతం ఏడాదికి రూ.50 వేలు
జీవన్ ఉత్సవ్ బీమా పథకం (LIC జీవన్ ఉత్సవ్) కింద కనీస బీమా మొత్తం రూ. 5 లక్షలు. ప్రీమియం చెల్లింపు ఐదు నుండి 16 సంవత్సరాల వరకు ఉంటుంది. మీ వయస్సు 8 సంవత్సరాలు అయితే, మీరు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు, అయితే గరిష్ట పరిమితి 65 సంవత్సరాలు. ఈ పాలసీలో రెండు రకాల చెల్లింపు ఎంపికలు ఉన్నాయి. వీటిలో సాధారణ ఆదాయం, ఫ్లెక్సీ ఆదాయ ప్రయోజనం అందుబాటులో ఉన్నాయి..
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి) వినియోగదారులకు అదిరిపోయే పాలసీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇన్సూరెన్స్ కంపెనీ కొత్త నాన్ పార్టిసిటింగ్ మనీ బ్యాక్ పాలసీని ప్రవేశపెట్టింది. ఈ పథకం పేరు జీవన్ ఉత్సవ్. ఇది హామీతో కూడిన రాబడిని వాగ్దానం చేస్తుంది. ఇది నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్, పర్సనల్ సేవింగ్స్, పూర్తిగా బీమా ప్లాన్. LIC ఈ పాలసీ 10 శాతం ఆదాయ ప్రయోజనాన్ని అందిస్తుంది.
జీవన్ ఉత్సవ్ బీమా పథకం (LIC జీవన్ ఉత్సవ్) కింద కనీస బీమా మొత్తం రూ. 5 లక్షలు. ప్రీమియం చెల్లింపు ఐదు నుండి 16 సంవత్సరాల వరకు ఉంటుంది. మీ వయస్సు 8 సంవత్సరాలు అయితే, మీరు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు, అయితే గరిష్ట పరిమితి 65 సంవత్సరాలు. ఈ పాలసీలో రెండు రకాల చెల్లింపు ఎంపికలు ఉన్నాయి. వీటిలో సాధారణ ఆదాయం, ఫ్లెక్సీ ఆదాయ ప్రయోజనం అందుబాటులో ఉన్నాయి. వీటిలో దేనినైనా ఎంచుకోవడం ద్వారా మీరు ప్రీమియం చెల్లించవచ్చు. పాలసీ ప్రయోజనం నిర్ణీత వ్యవధి తర్వాత ఇవ్వబడుతుంది.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందించిన సమాచారం ప్రకారం, పాలసీదారులు ఎంచుకున్న ప్రీమియం ఆధారంగా 11వ సంవత్సరం నుంచి ప్రాథమిక హామీ మొత్తంలో 10 శాతం చెల్లింపు ప్రారంభమవుతుంది. ఉదాహరణకు, మీరు ఐదు నుండి ఎనిమిది సంవత్సరాల వరకు ప్రీమియం చెల్లించాలని ఎంచుకుంటే, చెల్లింపు 11వ సంవత్సరం నుంచి ప్రారంభమవుతుంది. అయితే, మీరు సుదీర్ఘ కాల వ్యవధిని అంటే 10 సంవత్సరాలు ఎంచుకున్నట్లయితే, 13వ పాలసీ సంవత్సరం నుండి ఆదాయ ప్రయోజనం ప్రారంభమవుతుంది.
ఈ పాలసీ బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ. 5,00,000. ప్రీమియం టర్మ్ ను మీకు అనుగుణంగా 5 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వరకు ఎంపిక చేసుకోవచ్చు. మరో ఉదాహరణగా మీరు ఐదేళ్ల టర్మ్ ను ఎంపిక చేసుకున్నారు అనుకుందాం. అప్పుడు సవంత్సరానికి దాదాపు రూ. 1.16 లక్షలు (జీఎస్టీతో కలిపి) ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ప్రీమియం టర్మ్ పూర్తయిన తర్వాత మరో ఐదేళ్లు వేచి చూడాలి. ఆ తర్వాత సంవత్సరం నుంచి అంటే మీరు పాలసీ తీసుకున్న తర్వాత 11వ సంవత్సరం నుంచి ప్రతి ఏటా సమ్ అష్యూర్డ్ అమౌంట్ లో 10 శాతం మీకు వస్తుంది. మీరు రూ. 5 లక్షల పాలసీ తీసుకున్నారు కాబట్టి అందులో 10 శాతం అంటే రూ. 50 వేలు మీకు ప్రతి సంవత్సరం వస్తాయి.
మీరు బతికున్నంత కాలం ఈ అమౌంట్ వస్తుంది. ప్రతి సంవత్సరం ఏడాది చివరలో దీన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ పాలసీ ప్రీమియానికి వెయిటింగ్ పీరియడ్లు మారుతుంటాయి. ఐదేళ్ల టర్మ్ అయితే మరో ఐదేళ్ల వెయిట్ చేశాక రిటర్నులు వస్తాయి. 6 ఏళ్ల టర్మ్ తీసుకుంటే 4 ఏళ్లు, ఏడేళ్ల టర్మ్ అయితే 3 ఏళ్లు, 8 ఏళ్ల టర్మ్ అయితే రెండేళ్లు వెయిట్ చేసిన తర్వాత ప్రతి సంవత్సరం రిటర్నులు వస్తాయి. 8 ఏళ్ల నుంచి 16 ఏళ్ల ప్రీమియం టర్మ్ లకు వెయిటింగ్ పీరియడ్ రెండేళ్లుగానే ఉంటుంది.
కవరేజీ ఇలా పాలసీ తీసుకున్న తర్వాత మీరు అకాల మరణం చెందితే బీమా కవరేజీ కింద రూ. 5 లక్షలు మీ కుటుంబసభ్యులకు అందుతాయి. ఇది సహజ మరణాలకు మాత్రమే వర్తిస్తుంది. ఒకవేళ మీకు యాక్సిడెంట్ బెనిఫిట్, డిసేబిలిటీ బెనిఫిట్ కావాలంటే ప్రీమియం కాస్త ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. యాక్సిడెంట్ బెనిఫిట్ తీసుకుంటే సమ్ అష్యూర్డ్ రూ. 5 లక్షలతో పాటు, మరో రూ. 5 లక్షలు కలిపి మొత్తం రూ. 10 లక్షలు మీ కుటుంబ సభ్యులకు అందుతాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి