AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Fraud Cases: బ్యాంకు ఫ్రాడ్‌ కేసుల్లో 150 మంది అరెస్ట్‌.. రాజ్యసభలో కేంద్ర మంత్రి

కేంద్ర మంత్రిత్వశాఖ రాజ్యసభలో కీలక విషయాలను వెల్లడించింది. దేశంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 1,105 బ్యాంక్ ఫ్రాడ్ కేసులను చేపట్టిందని, ఇందులో రూ.64,920 కోట్ల విలువైన క్రైమ్ రాబడిని అటాచ్ చేసి, 150 మందిని అరెస్టు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ రాతపూర్వక సమాధానంలో వివరణ ఇచ్చారు. ప్రభుత్వ రంగ..

Bank Fraud Cases: బ్యాంకు ఫ్రాడ్‌ కేసుల్లో 150 మంది అరెస్ట్‌.. రాజ్యసభలో కేంద్ర మంత్రి
Bank Fraud Cases
Subhash Goud
|

Updated on: Dec 12, 2023 | 5:04 PM

Share

దేశంలో మోసాల కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎంతో మంది బ్యాంకుల నుంచి కోట్లాది రూపాయల రుణాలు తీసుకుని ఎగ్గొడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. బ్యాంకుల నుంచి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు రుణాలు తీసుకుని చెల్లించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వ్యాపారవేత్తలు, నేతలు బ్యాంకులకు వేల కోట్ల రూపాయల అప్పు ఉన్నారు. బ్యాంకులకు వారు తీసుకున్న రుణాలను చెల్లించని పక్షంలో వారిపై కేసులు నమోదు అవుతున్నాయి. ఇక వాటిని రికవరీ చేసేందుకు బ్యాంకులు, ఈడీ అధికారులు నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి కేసులు దేశంలో చాలా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రిత్వశాఖ రాజ్యసభలో కీలక విషయాలను వెల్లడించింది. దేశంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 1,105 బ్యాంక్ ఫ్రాడ్ కేసులను చేపట్టిందని, ఇందులో రూ.64,920 కోట్ల విలువైన క్రైమ్ రాబడిని అటాచ్ చేసి, 150 మందిని అరెస్టు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ రాతపూర్వక సమాధానంలో వివరణ ఇచ్చారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల నుండి రూ.25 లక్షలు, అంతకంటే ఎక్కువ రుణాన్ని కలిగి ఉన్న ఉద్దేశపూర్వక ఎగవేతదారుల సంఖ్య 2019 జూన్‌ చివరి నాటికి10,209 కేసులు ఉండగా, మార్చి 2023 చివరి నాటికి 14,159కి పెరిగిందని చెప్పారు.

ప్రైవేట్ రంగ బ్యాంకుల విషయానికొస్తే, జూన్ 2019 చివరినాటికి 1,950 డిఫాల్టర్‌ కేసులు ఉండగా, మార్చి 2023 చివరి నాటికి ఆ సంఖ్య 2,504కి పెరిగింది. “డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ED) నుంచి అందిన ఇన్‌పుట్ల ప్రకారం.. మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 (PMIA) నిబంధనల ప్రకారం దర్యాప్తు కోసం ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు సంబంధించిన వాటితో సహా దాదాపు 1,105 బ్యాంక్ మోసం కేసులను స్వీకరించింది. పీఎంఎల్‌ఏ నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. దీని ఫలితంగా సుమారు రూ.64,920 కోట్ల రాబడి అటాచ్‌మెంట్ చేసినట్లు మంత్రి కరాద్ తెలిపారు. ఈ ఫ్రాడ్‌ కేసులో మొత్తం 150 మంది నిందితులను అరెస్టు చేశామని, 277 ప్రాసిక్యూషన్ ఫిర్యాదులను ప్రత్యేక కోర్టు ముందు దాఖలు చేశామని ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి