Flipkart Year End Sale: స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు.. మరికొన్ని రోజులే అవకాశం.. వదులుకోవద్దు..

ఈ సంవత్సరాంత సమయంలో ఫ్లిప్ కార్ట్ బిగ్ ఇయర్ ఎండ్ సేల్‌ను నిర్వహిస్తోంది. ఇది డిసెంబర్ 9వ తేదీన ప్రారంభమైంది. డిసెంబర్ 16వరకూ ఇది కొనసాగుతుంది. ఈ సేల్లో స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు ఆఫర్లను అందిస్తోంది. ఫ్లాట్ డిస్కౌంట్ మాత్రమే కాక పలు బ్యాంకు కార్డులపై క్యాష్ బ్యాక్ లు, తగ్గింపులు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పీఎన్‌బీ కార్డ్‌లపై10 శాతం తక్షణ తగ్గింపును ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది.

Flipkart Year End Sale: స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు.. మరికొన్ని రోజులే అవకాశం.. వదులుకోవద్దు..
Smartphones
Follow us
Madhu

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 13, 2023 | 12:50 PM

ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం ఫ్లిప్‌కార్ట్ మరో సేల్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది. ప్రతి పండుగ సమయంలో కొనుగోలుదారులకు పలు ఆఫర్లను అందిస్తూ ప్రత్యేక సేల్స్ నిర్వహిస్తూ వస్తోంది. ఇదే క్రమంలో ఈ సంవత్సరాంత సమయంలో ఫ్లిప్ కార్ట్ బిగ్ ఇయర్ ఎండ్ సేల్‌ను నిర్వహిస్తోంది. ఇది డిసెంబర్ 9వ తేదీన ప్రారంభమైంది. డిసెంబర్ 16వరకూ ఇది కొనసాగుతుంది. ఈ ఫ్లిప్ కార్ట్ సేల్లో స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు ఆఫర్లను అందిస్తోంది. ఫ్లాట్ డిస్కౌంట్ మాత్రమే కాక పలు బ్యాంకు కార్డులపై క్యాష్ బ్యాక్ లు, తగ్గింపులు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పీఎన్‌బీ కార్డ్‌లపై10 శాతం తక్షణ తగ్గింపును ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది. ఈ సేల్లో స్మార్ట్ ఫోన్లపై అందుబాటులో ఉన్న ఆఫర్ల గురించి తెలుసుకుందాం..

యాపిల్ ఐఫోన్ 14.. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 69,900కాగా ఫ్లిప్ కార్ట్ దీనిని రూ. 58,999కి కొనుగోలు చేయొచ్చు. హెచ్ డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి కొనుగోలు చేస్తే రూ. 500 తక్షణ తగ్గింపును పొందొచ్చు. పాత ఫోన్ ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ. 34,500 వరకు తగ్గింపు లభిస్తుంది. దీనితో పాటు, ఐఫోన్ 14 ప్లస్ ఫోన్ పై కూడా ఆఫర్ ఉంది. ఈ ఫోన్ రూ. 89,900కి లాంచ్ కాగా.. దీనిని ఫ్లిప్ కార్ట్ పై రూ.67,999కి కొనుగోలు చేయొచ్చు.

శామ్సంగ్ జెడ్ ఫోల్డ్ 5.. ఈ ఫోన్ లాంచింగ్ ధర రూ. 1,54,999కి కొనుగోలు చేయొచ్చు. రూ. 7000 అమెజాన్ కూపన్ ద్వారా ఇది రూ. 1,48,999 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. పాత పరికరాన్ని మార్చుకుంటే కొనుగోలుదారులు రూ.44,500 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

మోటరోలా ఎడ్జ్ 40.. ఈ స్మార్ట్ ఫోన్ మన దేశంలో లాంచింగ్ సమయంలో ధర రూ. 29,999గా ఉంది. ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లో దీనిని రూ. 25,499కి కొనుగోలు చేయొచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 1,000 తగ్గింపు లభిస్తుంది.

శామ్సంగ్ ఎస్21 ఎఫ్ఈ.. ఈ ఫోన్ ని ఫ్లిప్ కార్ట్ లో రూ. 30,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయొచ్చు. దీని ధర లాంచింగ్ సమయంలో రూ. 49,999గా ఉంది.

నథింగ్ ఫోన్ (2).. ఈ స్మార్ట్ ఫోన్ ను మీరు ఫ్లిప్ కార్ట్ లో రూ. 41,999కి కొనుగోలు చేయోచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై కొనుగోలుదారులు రూ. 1,000 అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు.

శామ్సంగ్ గెలాక్సీ ఎస్22 5జీ.. ఈ ఫోన్ లాంచింగ్ సమయంలో రూ. 72,999 ప్రారంభ ధరకు విక్రయించారు. ఇది ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 39,999కి అందుబాటులో ఉంది.

గూగుల్ పిక్సల్ 7ఏ.. ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ. 37,999 ధరతో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ. 43,999 నుంచి తగ్గింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై కస్టమర్‌లు రూ. 1,000 తగ్గింపును కూడా పొందవచ్చు.

ఈ ఫోన్లపై కూడా..

కొన్ని బడ్జెట్ ఫోన్లపై కూడా ఫ్లిప్ కార్ట్ లో ఆఫర్లు ఉన్నాయి. వాటిల్లో రెడ్‌మీ 12 స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 10,999కాగా ఆఫర్ పై రూ.9,899కి కొనుగోలు చేయొచ్చు. క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ.1,100 తగ్గింపు ఉంటుంది. పోకో ఎం6 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ ను రూ. 10,999కి అందుబాటులో ఉంది. అంతేకాక హెచ్డీ ఎఫ్సీ క్రెడిట్ కార్డుపై రూ. 750 తగ్గింపు ను పొందొచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?