Public Charging Stations: పెట్రోల్ బంకుల్లో చార్జింగ్ స్టేషన్లు.. విద్యుత్ వాహనాల చార్జింగ్ కష్టాలకు చెక్.. ఎక్కడంటే..
టాటా ప్యాసెంజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్(టీపీఈఎం), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) కలిసి పనిచేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. దేశ వ్యాప్తంగా 7,000 పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పాలని తీర్మానించాయి. దేశ వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకుల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఇది ఎలక్ట్రిక్ వాహనదారులకు ఉపశమనాన్ని కలిగించే వార్త. ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లు పెద్దగా లేవు. ఎక్కడో ఒక దగ్గర మాత్రమే ఉంటున్నాయి. దీంతో అందరూ ఇంట్లోనే ఆ వాహనాలను చార్జింగ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి. అయితే ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభించే అవకాశం కనిపిస్తోంది. దీనిపైనే ఫోకస్ పెట్టిన కంపెనీలు కొన్ని సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నాయి. అందులో భాగంగా టాటా ప్యాసెంజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్(టీపీఈఎం), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) కలిసి పనిచేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. దేశ వ్యాప్తంగా 7,000 పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పాలని తీర్మానించాయి. దేశ వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకుల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రతి 100 కిలోమీటర్లకు ఒక స్టేషన్..
దేశ వ్యాప్తంగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ కు సంబంధించిన పెట్రోల్ బంకులు ఉన్నాయి. టీపీఈఎం ప్రకారం దేశంలో కేవలం టాటా ఈవీలు 1.15లక్షలు ఉన్నాయి. ఈవీ వాహనాల వినియోగదారులు స్టేషన్లను ఏర్పాటు చేయాలని విన్నవిస్తున్నారు. ఈక్రమంలో బీపీసీఎల్ కూడా ఈవీ స్టేషన్ల నిర్మాణానికి ఆసక్తి చూపించింది. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా టీపీఈఎం, బీపీసీఎల్ సంయుక్తంగా 7000 స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేశాయి. అందుకోసం బీపీసీఎల్ 90 ఎలక్ట్రిక్ ఫాస్ట్ చార్జింగ్ హైవే కారిడార్లను గుర్తించింది. ప్రతి 100 కిలోమీటర్లకు ఒక స్టేషన్ ఉండేటట్లు ప్రధాన జాతీయ రహదారులకు ఇరువైపులా ఇవి ఉండే విధంగా మ్యాప్ సిద్ధం చేసింది. మొత్తం మీద దేశంలోని 30,000కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసేలా ఈ రూట్ ఉండనుంది. దీని ద్వారా ఈవీ వినియోగదారులకు చార్జింగ్ కష్టాల తగ్గనున్నాయి.
సరికొత్త పేమెంట్ సిస్టమ్..
టీపీఈఎం, బీపీసీఎల్ ఒప్పందం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారులకు ముఖ్యంగా టాటా ఈవీ వాహనదారులకు మరింత మెరుగైన రవాణాను అందించేందుకు దొహదపడుతోంది. కాగా ఈ స్టేషన్లలో పేమెంట్ వ్యవస్థ కూడా సులభతం చేసేందుకు సరికొత్త సిస్టమ్ ను తీసుకురానున్నట్లు కంపెనీలు ప్రకటించయి. టాటా, భారత్ పెట్రోలియం కో బ్రాండెడ్ ఆర్ఎఫ్ఐడీ కార్డు ను పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిని తీసుకోవడం ద్వారా సులభతరమైన పేమెంట్ విధానం వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది.
ఈ సందర్భంగా బీపీసీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇన్ చార్జ్ రిటైల్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ తమ పెట్రోల్ బంకుల్లో ఈవీ స్టేషన్ల ఏర్పాటు ద్వారా తమ పరిధిని మరింత విస్తరిస్తున్నట్లు చెప్పారు. దీని కోసం టీపీఈఎంతో సంయుక్తంగా ముందుకు వెళ్లడం సంతోషంగా ఉందన్నారు. అలాగే టాటా మోటార్ ప్యాసెంజర్ వెహికల్స్, టాటా ప్యాసెంజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్( టీపీఈఎం)మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్రా మాట్లాడుతూ ఒక మెరుగైన వ్యవస్థ కోసం తాము సంయుక్తంగా కలిసి ముందుకెళ్తున్నట్లు చెప్పారు. ఇది ఈవీ వినియోగదారులకు మెరుగైన, సౌకర్యవంతమైన వ్యవస్థను కల్పించినట్లు అవుతుందని, ఈవీ కొనుగోళ్లు దీని వల్ల మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..