Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Union Budget 2025: వరుసగా 8వ సారి బడ్జెట్‌ను సమర్పించిన మంత్రి నిర్మలా సీతారామన్!

Union Budget 2025: సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కేంద్ర వార్షిక బడ్జెట్‌ 2025 రానే వచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ పార్లమెంట్‌లో 8వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడవసారి అధికారంలోకి వచ్చిన మొదటి పూర్తిస్థాయి బడ్జెట్ 2025 ఫిబ్రవరి 1, శనివారం నాడు పార్లమెంటులో సమర్పించారు..

Union Budget 2025: వరుసగా 8వ సారి బడ్జెట్‌ను సమర్పించిన మంత్రి నిర్మలా సీతారామన్!
Follow us
Subhash Goud

|

Updated on: Feb 01, 2025 | 11:03 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడవసారి అధికారంలోకి వచ్చిన మొదటి పూర్తిస్థాయి బడ్జెట్ 2025 ఫిబ్రవరి 1, శనివారం నాడు పార్లమెంటులో సమర్పించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదో సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు ఎన్నో ఆశలు ఉన్నాయి. బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటనలు ఉంటాయని ఎదురు చూస్తుండగా, ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

దీంతో ఆమె 10 బడ్జెట్లు సమర్పించిన మొరాజీ దేశాయ్ రికార్డుకు చేరువైంది. మొరార్జీ దేశాయ్ ఆర్థిక మంత్రిగా 1959-1964 మధ్య ఆరు బడ్జెట్లు, 1967 -1969 మధ్య నాలుగు బడ్జెట్లు సమర్పించారు. వివిధ ప్రధాన మంత్రుల నాయకత్వంలో మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం తొమ్మిది బడ్జెట్‌లను సమర్పించగా, ప్రణబ్ ముఖర్జీ ఎనిమిది బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు.

ఇది కూడా చదవండి: Gas Cylinder Price: బడ్జెట్‌ రోజు వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

అయితే ఏకంగా ఎనిమిది బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన రికార్డు మాత్రం నిర్మలా సీతారామన్‌ పేరిటే ఉంది. 2019లో మోదీ రెండోసారి పూర్తిస్థాయి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2024లో మూడోసారి ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఈ మంత్రిత్వ శాఖ సీతారామన్‌ వద్దే ఉంది. దేశానికి రెండుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ప్రస్తుత భారతదేశ ఆర్థిక వ్యవస్థను మార్చిన ఘనత సాధించారు.

ఇది కూడా చదవండి: New Rules: వినియోగదారులకు అలర్ట్‌.. ఫిబ్రవరి 1 నుంచి మారనున్న రూల్స్‌.. ఏంటో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడక క్లిక్ చేయండి

మంటలు రేపనున్న మార్చినెల.. ఎండలతో జాగ్రత్త జర వీడియో
మంటలు రేపనున్న మార్చినెల.. ఎండలతో జాగ్రత్త జర వీడియో
గంగానది మధ్యలో వంద మంది యాత్రికులు.. ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో
గంగానది మధ్యలో వంద మంది యాత్రికులు.. ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో
హల్దీ ఫంక్షన్‌లో కోతి హల్‌చల్‌.. ఏం చేసిందో చూడండి
హల్దీ ఫంక్షన్‌లో కోతి హల్‌చల్‌.. ఏం చేసిందో చూడండి
92 ఏళ్ల వృద్ధురాలి సాహసం.. శివుడి కోసం.. కాగుతున్న నూనెలో చేతితో
92 ఏళ్ల వృద్ధురాలి సాహసం.. శివుడి కోసం.. కాగుతున్న నూనెలో చేతితో
అయ్యో.. నీళ్ల కోసం వచ్చి బావిలో పడి.. చివరికి?
అయ్యో.. నీళ్ల కోసం వచ్చి బావిలో పడి.. చివరికి?
గోవా కొంపముంచిన ఇడ్లీ సాంబార్‌.. ఎమ్మెల్యే ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు
గోవా కొంపముంచిన ఇడ్లీ సాంబార్‌.. ఎమ్మెల్యే ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు
"గోల్డ్‌ కార్డు'' కావాలా నాయనా..? కండిషన్స్ అప్లయ్‌.!
ఐదుగురు మహిళలతో కలిసి అంతరిక్షంలోకి జెఫ్‌ బెజోస్‌ ప్రియురాలు
ఐదుగురు మహిళలతో కలిసి అంతరిక్షంలోకి జెఫ్‌ బెజోస్‌ ప్రియురాలు
గ్రహశకలం భూమిని ఢీ కొంటే.. నాశనమయ్యే నగరాలు ఏంటో తెలుసా?
గ్రహశకలం భూమిని ఢీ కొంటే.. నాశనమయ్యే నగరాలు ఏంటో తెలుసా?
తల్లి ప్రేమ రేంజ్ ఇదీ.. కుక్క దాడి నుంచి తల్లి రక్షణ కవచం ఏర్పాటు
తల్లి ప్రేమ రేంజ్ ఇదీ.. కుక్క దాడి నుంచి తల్లి రక్షణ కవచం ఏర్పాటు