New Rules: వినియోగదారులకు అలర్ట్.. ఫిబ్రవరి 1 నుంచి మారనున్న రూల్స్.. ఏంటో తెలుసా?
New Rules: ఫిబ్రవరి 1న బడ్జెట్‌తో అనేక ముఖ్యమైన మార్పులు కూడా జరగనున్నాయి. ప్రతి నెల 1వ తేదీన పలు అంశాలలో నియమ నిబంధనలు మారుతుంటాయి. ఈ మార్పులు సామాన్యుడిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్‌తో పాటు ముఖ్యమైన లావాదేవీలు, ఇతర అంశాలపై మార్పులు జరుగుతుంటాయి..

ఫిబ్రవరి 1న దేశ సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్‌తో అనేక ముఖ్యమైన మార్పులు జరుగుతుండగా, మరో వైపు ఫిబ్రవరి 1నుంచి పలు అంశాలలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇది మీ జేబుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాలకు సంబంధించిన ఈ మార్పులు సామాన్యుల ఖర్చుల్లో మార్పులు తెస్తాయి. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్న మార్పుల గురించి తెలుసుకుందాం.
LPG సిలిండర్ ధరలలో మార్పు:
LPG సిలిండర్ ధరలు ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు సవరించిన ధరలను జారీ చేస్తాయి. ఇది సామాన్య ప్రజానీకాన్ని ప్రభావితం చేస్తుంది. మరి ఫిబ్రవరి 1వ తేదీ బడ్జెట్ రోజున ఎల్‌పిజి గ్యాస్ ధర పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనేది చూడాలి. జనవరిలో కొన్ని మార్పుల తర్వాత 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర తగ్గించారు.
UPI లావాదేవీలకు సంబంధించిన కొత్త నియమాలు:
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) UPI కింద జరిగే కొన్ని లావాదేవీలలో మార్పులు చేయాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 1, 2025 నుండి అమలులోకి వచ్చే ఈ కొత్త నిబంధనల ప్రకారం, ప్రత్యేక రకాల అక్షరాలను కలిగి ఉన్న UPI లావాదేవీ IDలు ఆమోదించరు. ఇప్పుడు ఆల్ఫా-న్యూమరిక్ (అక్షరాలు, సంఖ్యలు) లావాదేవీ IDలు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఏదైనా లావాదేవీ ఏదైనా ఇతర రకమైన IDని కలిగి ఉంటే అది విఫలమవుతుంది.
మారుతీ సుజుకీ కార్ల ధరలు పెంపు:
పెరుగుతున్న ధరల దృష్ట్యా దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఫిబ్రవరి 1 నుండి తన వివిధ మోడళ్ల ధరలను రూ.32,500 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ధరలు మారే మోడల్‌లు. వీటిలో Alto K10, S-Presso, Celerio, Wagon R, Swift, DZire, Brezza, Ertiga, Ignis, Baleno, Ciaz, XL6, FrontX, Invicto, Jimny, Grand Vitara ఉన్నాయి.
బ్యాంకింగ్ నిబంధనలలో మార్పులు:
కోటక్ మహీంద్రా బ్యాంక్ తన కొన్ని సేవలు, ఛార్జీలలో మార్పులను ప్రకటించింది. ఇది 1 ఫిబ్రవరి 2025 నుండి అమలులోకి వస్తుంది. వీటిలో ప్రధాన మార్పులు ఏటీఎం లావాదేవీల ఉచిత పరిమితిని తగ్గించడం, ఇతర బ్యాంకింగ్ సేవల ఛార్జీలను పెంచడం. ఈ మార్పులు బ్యాంక్ కస్టమర్లను ప్రభావితం చేస్తాయి. వారు ఈ కొత్త రుసుము నిర్మాణాలతో తమ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించాల్సి ఉంటుంది.
ATF ధరలో మార్పు:
ఫిబ్రవరి 1 నుండి ఎయిర్ టర్బైన్ ఇంధనం (ATF) ధరలో మార్పు ఉండవచ్చు. చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల 1వ తేదీన ATF ధరలను సవరిస్తాయి. ఈసారి ధరలు పెరిగితే విమాన ప్రయాణికుల జేబులపై ప్రత్యక్ష ప్రభావం పడనుంది.