Aadhaar Card: ఆధార్ కార్డ్ పోగొట్టుకున్నారా ? అయితే డౌన్లోడ్ చేసుకోవడం చాలా సులభం…. ఎలాగంటే..
ప్రతి భారతీయ పౌరుడికి ఆధార్ కార్డ్ తప్పనిసరి. నిత్యావసర సరుకుల నుంచి బ్యాంక్ అకౌంట్స్, ప్రభుత్వ పథకాల వరకు అన్నింటికి ఆధార్ అవసరం.
ప్రతి భారతీయ పౌరుడికి ఆధార్ కార్డ్ తప్పనిసరి. నిత్యావసర సరుకుల నుంచి బ్యాంక్ అకౌంట్స్, ప్రభుత్వ పథకాల వరకు అన్నింటికి ఆధార్ అవసరం. మనకు పాన్ కార్డు, రేషన్ కార్డుతోపాటు ఆధార్ కార్డు కూడా చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. అందుకే ఆధార్ కార్డును ఎంతో జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. అయితే కొన్ని సందర్భాల్లో ఆధార్ కార్డు కనిపించకుండా పోవచ్చు. అయితే ఆధార్ కార్డు పోగొట్టుకున్నవారు టెన్షన్ పడాల్సిన పనిలేదు.
ఇకనుంచి సులభంగానే ఆధార్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఎక్కువగా ఇబ్బంది పడాల్సిన పనిలేదు. ఇందుకోసం యూఏడీఏఐ అధికారిక వెబ్ సైట్ ద్వారా క్షణాల్లో ఆధార్ డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను యూఏడీఏఐ ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. అందులో ఆధార్ డౌన్ లోడ్ చేసుకోవాల్సిన లింక్ ను పొందుపరచింది. అది డైరెక్ట్ లింక్. దానిపై క్లిక్ చేసి ఆధార్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అందులో ఆధార్ కార్డు నెంబర్, ఓటీపీ ఎంటర్ చేసి ఆధార్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా.. ఇందులో మాస్క్డ్ ఆధార్ కూడా లభిస్తుంది. ఆధార్ కార్డుకు ఫోన్ నంబర్ లింక్ చేయడం తప్పనిసరి.
ట్వీట్..
#AadhaarTutorials Download your Aadhaar from https://t.co/C190bVXBCk anytime anywhere. You can choose to download ‘Regular Aadhaar’ that displays the complete Aadhaar number or ‘Masked Aadhaar’ which shows only the last four digits. To learn more:https://t.co/xfmofQ9jSA
— Aadhaar (@UIDAI) June 28, 2021
Telangana Online Classes: తెలంగాణలో జూలై 1 నుంచి కేజీ టు పీజీ వరకు ఆన్‌లైన్ తరగతులు.. వివరాలివే..