TATA HBX: టాటా నుంచి కొత్త ఎస్‌యూవీ; క్రెటా, సెల్టోస్‌తో పోటీకి సిద్ధమంటోన్న టాటా

హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, నిస్సాన్ మాగ్నైట్ లాంటి ఎస్‌యూవీలు ప్రస్తుతం భారత మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.

TATA HBX: టాటా నుంచి కొత్త ఎస్‌యూవీ; క్రెటా, సెల్టోస్‌తో పోటీకి సిద్ధమంటోన్న టాటా
Tata Hbx
Follow us
Venkata Chari

|

Updated on: Jun 28, 2021 | 6:07 PM

TATA HBX: ఎస్‌యూవీ సెగ్మెంట్ మనదేశంలో బాగా పాపులర్ అయింది. ఈ విభాగంలో ప్రస్తుతం హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, నిస్సాన్ మాగ్నైట్ లు ప్రస్తుతం భారత మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ప్రస్తుతం భారత మార్కెట్ లో ప్రీమియం ఎస్‌యూవీలు వినియోగదారులను ఆకట్టుకొంటున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అందుకే భారతదేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇగ్నిస్, అర్బన్ ఎస్‌యూవీలను విడుదల చేసింది. టాటా కూడా ఈ విభాగంలో కొత్త కార్లను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. టాటా, హ్యుందాయ్ త్వరలో రెండు కొత్త ఎస్‌యూవీలను భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నాయి. వీటి ధర రూ.5లక్షల లోపే ఉండనున్నట్లు తెలుస్తోంది. టాటా హెచ్‌బిఎక్స్ పేరుతో మార్కెట్లో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ కారు ధర రూ.5 లక్షల నుంచి 7.5 లక్షల ధరల్లో విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారు నెక్సాన్ ను పోలి ఉంటుందని టాక్ వినిపిస్తోంది. కాగా, ఈ కారు ప్రీమియం లుక్ లో వినియోగదారులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

టాటా ఆటో ఎక్స్‌పో 2020 లో హెచ్‌బిఎక్స్‌ను ఆవిష్కరించింది. లాంచ్ చేయబోయే కారు.. ఎక్స్‌పోలో చూపించినట్లు 90 శాతం దాదాపు అదే డిజైన్‌ను కలిగి ఉండనుందని కంపెనీ తెలిపింది. టాటా హెచ్‌బిఎక్స్ అనేది కేవలం ఒక కాన్సెప్ట్ పేరు మాత్రమేనని, లాంచ్ చేయనున్న కారును టాటా హార్న్‌బిల్‌గా పరిచయం చేయవచ్చని సమాచారం. టాటా హెచ్‌బిఎక్స్.. మహీంద్రా కేయూవీ 100, మారుతీ సుజుకీ ఇగ్నిస్‌లతో పోటీ పడనుంది.

హెచ్‌బిఎక్స్ కారు టాటా అల్ట్రాస్‌తో నడిచే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ తో రానుంది. ఇంజిన్ 6000rpm వద్ద 84bhp శక్తిని అందించగలదు. ఈకారులో 5 స్పీడ్ మాన్యువల్, ఏఎమ్ డీ గేర్ బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉండనుంది.

Also Read:

Cryptocurrency: బంగారంతో సమానంగా క్రిప్టోకరెన్సీపై భారతీయుల పెట్టుబడులు.. వీరిలో యువతే ఎక్కువ..

SBI: ఖాతాదారుల‌ను అల‌ర్ట్ చేసిన ఎస్‌బీఐ.. ఆధార్‌-పాన్ లింక్ చేసుకోవాలని సూచ‌న‌.. లింక్ అయిందో లేదో ఇలా.

Electric Vehicles: మార్కెట్లో పెరుగుతున్న ఎలక్ట్రిక్‌ వాహనాల పోటీ.. బజాజ్‌ నుంచి మరో ఎలక్ట్రిక్‌ వెహికల్‌