Cryptocurrency: బంగారంతో సమానంగా క్రిప్టోకరెన్సీపై భారతీయుల పెట్టుబడులు.. వీరిలో యువతే ఎక్కువ..

రోజులు మారుతున్నాయి.. అంతా ఇప్పుడు పెట్టుబడులపై ఫోకస్ పెడుతున్నారు. బంగారంతో సమానంగా క్రిప్టోకరెన్సీపై పెట్టుబడి పెడుతున్నారు. అది కూడా యువత..

Cryptocurrency: బంగారంతో సమానంగా క్రిప్టోకరెన్సీపై భారతీయుల పెట్టుబడులు.. వీరిలో యువతే ఎక్కువ..
Indians Invest Billions In
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 28, 2021 | 4:52 PM

బంగారం… భారతీయులకు ఆభరణం మాత్రమే కాదు. లక్ష్మీదేవితో సమానంగా చూస్తారు..  బంగారాన్ని వస్తువుగా కాకుండా సెంటిమెంట్‌తో చూడటం అలవాటు. బంగారం భారతీయులకు అలంకరణప్రాయం మాత్రమే కాదు… పెట్టుబడి సాధనం కూడా. బంగారానికి విడదీయరాని బంధం ఉంటుంది. ఏ చిన్న వేడుకైనా బంగారం కొనడం, బహుమతిగా ఇవ్వడం సంప్రదాయం. ఇక బంగారం కొనకుండా, కానుకగా ఇవ్వకుండా పెళ్లిళ్లు జరిగే ప్రసక్తే లేదు. అయితే ఇదే బంగారం పెట్టుబడిగా కూడా చూస్తారు భారతీయులు…

పసిడి నుంచి క్రిప్టోకరెన్సీ వైపు..

రోజులు మారుతున్నాయి.. అంతా ఇప్పుడు పెట్టుబడులపై ఫోకస్ పెడుతున్నారు. షేర్ మార్కెట్లతోపాటు బ్యాంక్ డిపాజిట్లు, బంగారంపై పెట్టుబడి పెట్టడం… ఇప్పుడు మరింత ముందుకు వెళ్లిపోయారు. డిజిటల్ కరెన్సీపై పెట్టుబడులు పెట్టేందుకు మక్కువ చూస్తున్నారు. భారత్‌లో సుమారు 25 వేల టన్నుల బంగారాన్ని కలిగి ఉంది. ఇప్పుడు అదే స్థాయిలో భారతీయులు క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్ చేసేందుకు చూస్తున్నారు. ఇప్పటికే  క్రిప్టో కరెన్సీలోని బిట్‌కాయిన్‌, డాగ్‌కాయిన్‌, ఈథర్‌ క్రిప్టోకరెన్సీలపై భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. కరోనా ఫస్ట్ వేవ్.. ఆ తర్వాత సెకెండ్ వేవ్ ముంచేయడంతో కొద్దిగా పెట్టుబడులపై వెనక్కి తగ్గిన భారతీయులు.. దేశంలో ఇప్పుడు కరోనా తగ్గుతుండటంతో  క్రిప్టో పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అవుతున్నారు.

క్రిప్టోకరెన్సీపై పరిశోధనలు చేస్తోన్న ప్రముఖ సంస్థ చైనాలిసిస్‌ ప్రకారం భారత్‌లో గత సంవత్సరంలో క్రిప్టో కరెన్సీ పెట్టుబడులు 200 మిలియన్‌ డాలర్ల నుంచి దాదాపు 40 బిలియన్‌ డాలర్లుకు పెరిగిందని పేర్కొంది.

యూత్.. తగ్గేది లేదు..!

క్రిప్టోకరెన్సీ గత కొన్ని పడిపోతున్నా.. భారతీయులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు.. గతంలా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం లేదు కానీ… డిజిటల్‌ కరెన్సీపై ఇన్వెస్ట్‌చేయడానికి ఉండలేక పోతున్నారు. బంగారంపై కాకుండా క్రిప్టో కరెన్సీపై ఇన్వెస్ట్‌ చేయడానికి భారతీయులు ముందుంటున్నారు. అంతేకాకుండా క్రిప్టో కరెన్సీపై ఇన్వెస్ట్‌మెంట్‌ అత్యంత పారదర్శకంగా ఉంటుందని నమ్ముతున్నారు. అతి తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను గడించవచ్చునని భావిస్తున్నారు.

తాజాగా వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ నివేదిక ప్రకారం భారత్‌లో ఎక్కువగా 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసువారే క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్‌ చేస్తున్నారని చైనాలసిస్‌ తన నివేదకలో పేర్కొంది. భారత్‌లో ప్రస్తుతం 19 క్రిప్టో ఎక్స్చేంజ్‌ మార్కెట్లు ఉన్నాయి. ఇందులో వజిరెక్స్ చాలా పాతది.

ఇవి కూడా చదవండి: Maoists Dump: మహారాష్ట్ర సరిహద్దుల్లో భారీగా నగదు స్వాధీనం.. మావోయిస్టులకు చెందినదిగా అనుమానిస్తున్న పోలీసులు

Rave Party Case: రేవ్ పార్టీలో పట్టుబడిన బిగ్‌బాస్ మాజీ పోటీదారు.. భారీగా డ్ర‌గ్స్‌ను స్వాధీనం

భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.