Book Gas Through Paytm : పేటీఎం ద్వారా గ్యాస్ బుక్ చేయండి.. 3 సిలిండర్లపై రూ. 900 ఫిక్స్‌డ్ క్యాష్ బ్యాక్ పొందండి..

Book Gas Through Paytm : ప్రముఖ చెల్లింపుల సంస్థ పేటీఎం ఆకర్షణీయమైన ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లతో గ్యాస్ వినియోగదారులను

Book Gas Through Paytm : పేటీఎం ద్వారా గ్యాస్ బుక్ చేయండి.. 3 సిలిండర్లపై రూ. 900 ఫిక్స్‌డ్ క్యాష్ బ్యాక్ పొందండి..
Gas Connection
Follow us
uppula Raju

|

Updated on: Jun 28, 2021 | 5:37 PM

Book Gas Through Paytm : ప్రముఖ చెల్లింపుల సంస్థ పేటీఎం ఆకర్షణీయమైన ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లతో గ్యాస్ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. తాజాగా గ్యా్స్ యూజర్లు ఐవిఆర్, మిస్డ్ కాల్ లేదా వాట్సాప్ ద్వారా చేసిన బుకింగ్ కోసం పేటిఎం ద్వారా డబ్బులు చెల్లించవచ్చు. ఏ ఇతర ప్లాట్‌ఫాం నుంచి సిలిండర్‌ను బుక్ చేసినా Paytm ద్వారా డబ్బులు చెల్లించడానికి వీలు కల్పిస్తుంది. అంతేకాదు పేటిఎం ద్వారా ఎల్‌పిజి సిలిండర్లను బుక్ చేసే వినియోగదారులకు 3 సిలిండర్ బుకింగ్‌లపై రూ .900 వరకు ఫిక్స్‌డ్ క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది.

Paytm లో బుక్ చేసుకున్న ప్రతి సిలిండర్‌పై యూజర్లు Paytm ఫస్ట్ పాయింట్లను పొందుతారు. వీటిని వారి వాలెట్ బ్యాలెన్స్, ప్రసిద్ధ బ్రాండ్ల డిస్కౌంట్ వోచర్‌ల రూపంలో రీడీమ్ చేసుకోవచ్చు. ఇండేన్, హెచ్‌పి, భారత్‌ 3 ప్రధాన ఎల్‌పిజి కంపెనీల సిలిండర్ బుకింగ్‌పై ఈ ఆఫర్ వర్తిస్తుంది. Paytm పోస్ట్‌ప్యాడ్‌లో నమోదు చేయడం ద్వారా సిలిండర్ బుక్ చేసి తరువాత కూడా డబ్బులు చెల్లించే అవకాశం కల్పించింది. Paytm వినియోగదారులు సిలిండర్‌ను బుక్ చేసే ముందు ధరను కూడా తనిఖీ చేయవచ్చు.

కస్టమర్లు తమ గ్యాస్ సిలిండర్ల డెలివరీని ట్రాక్ చేయడానికి, రీఫిల్స్ కోసం ఆటోమేటెడ్ ఇంటెలిజెంట్ రిమైండర్‌లను పొందగల సామర్థ్యం కూడా కల్పించింది. ఇది ఇప్పుడు పేటిఎమ్ యాప్‌ లో అందుబాటులో ఉంది. Paytm LPG సిలిండర్ బుకింగ్‌ ప్రక్రియను ను చాలా సులభమైన ప్రక్రియగా మార్చింది. వినియోగదారు ‘బుక్ గ్యాస్ సిలిండర్’ టాబ్‌కు వెళ్లి, గ్యాస్ కంపెనీని ఎంచుకుని, మొబైల్ నంబర్ / ఎల్‌పిజి ఐడి / కస్టమర్ నంబర్‌ను ఎంటర్ చేసి, ఆపై చెల్లింపు చేయాలి. సిలిండర్ సమీప గ్యాస్ ఏజెన్సీ ద్వారా యూజర్ రిజిస్టర్డ్ చిరునామాకు పంపబడుతుంది.

Viral Video: వధూవరుల గుసగుసలు.. మైక్ ఆన్‌లో ఉందని తెలిసి వరుడు ఏం చేశాడో చూస్తే నవ్వాపుకోలేరు.!

Chandrababu : విజయవాడ చేరుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.. రేపు దీక్ష

Dharmendra Chatur Resigns : కేంద్రానికి, ట్విట్టర్‌కి జరుగుతున్న వివాదంలో మరో ట్విస్ట్..! తాత్కాలిక గ్రీవెన్స్ అధికారి ధర్మేంద్ర చతుర్ రాజీనామా..

భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.