Chandrababu : విజయవాడ చేరుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.. రేపు దీక్ష

రేపటి దీక్ష కోసం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కొంచెం సేపటి క్రితమే విజయవాడ చేరుకున్నారు.

Chandrababu : విజయవాడ చేరుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు..  రేపు  దీక్ష
Chandrababu
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 28, 2021 | 5:04 PM

TDP Chief Chandrababu naidu protest : రేపటి దీక్ష కోసం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కొంచెం సేపటి క్రితమే విజయవాడ చేరుకున్నారు. రేపు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చంద్రబాబు దీక్షలో కూర్చుంటారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో 15 మంది సీనియర్ నేతలతో కలిసి బాబు దీక్ష నిర్వహిస్తారు. కరోనా బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలన్న డిమాండ్ తో చంద్రబాబు ఈ దీక్షకు దిగుతున్నారు. ఈ సందర్బంగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ” కరోనా బాధితులను ఆదుకోకపోతే భవిష్యత్ కార్యాచరణ తీవ్రతరం చేస్తాం. చంద్రబాబు దీక్షతోనైనా ప్రభుత్వంలో చలనం రావాలి. ఆక్సిజన్ అందక మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు, కరోనా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు తక్షణ సాయం అందించాలి.” అని అచ్చెన్న డిమాండ్ చేశారు.

మరోవైపు, అమరావతిలోని విద్యాసంస్థల్లో చదివిన తొలి బ్యాచ్ విద్యార్థులకు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వేతన శ్రేణితో అద్భుత ఉద్యోగ అవకాశాలు లభిస్తుండడం సంతోషం కలిగిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. అమరావతిలోని విద్యాసంస్థలు మెరుగైన ప్రమాణాలు ప్రదర్శించడం హర్షణీయమని బాబు పేర్కొన్నారు.

దక్షిణ భారతదేశంలోనే అమరావతిని సమున్నత విద్యాకేంద్రంగా నిలపాలన్న తమ దార్శనికతకు ఇవే నిదర్శనాలు అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇంతటి అభివృద్ధిని సాధించిన విద్యార్థులను, విద్యాసంస్థలను అభినందిస్తున్నానని, భవిష్యత్తులోనూ అత్యుత్తమ రీతిలో ఎదగాలని బాబు ఆకాంక్షించారు.

Read also : YCP MP : ఇంత నీచమైన పనులు రాజ వంశీకులు చేయాల్సినవేనా అశోక్..? ఇది ఒక నీటి బొట్టే. ఇంకా చాలా వస్తాయి బయటకు : విజయసాయిరెడ్డి