ఇప్పుడు గూగుల్, ఫేస్ బుక్ ల వంతు..సమన్లు జారీ చేసిన పార్లమెంటరీ కమిటీ
కాంగ్రెస్ నేత శశిథరూర్ నేతృత్వంలో ఐటీ టెక్నాలజీలపై గల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ..గూగుల్, ఫేస్ బుక్ లకు సమన్లు జారీ చేసింది. ప్రజల హక్కుల పరిరక్షణలో ఇవి వహిస్తున్న పాత్రను, సోషల్ మీడియా దుర్వినియోగ నివారణకు ఇవి తీసుకుంటున్న చర్యలను
కాంగ్రెస్ నేత శశిథరూర్ నేతృత్వంలో ఐటీ టెక్నాలజీలపై గల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ..గూగుల్, ఫేస్ బుక్ లకు సమన్లు జారీ చేసింది. ప్రజల హక్కుల పరిరక్షణలో ఇవి వహిస్తున్న పాత్రను, సోషల్ మీడియా దుర్వినియోగ నివారణకు ఇవి తీసుకుంటున్న చర్యలను తెలుసుకునేందుకు ఈ కమిటీ ఈ చర్య తీసుకుంది. మంగళవారం ఈ సామాజిక మాధ్యమాలు ఈ స్థాయీ సంఘం ముందు తమ వాదనలను వినిపించాల్సి ఉంది. ప్రస్తుతం ట్విటర్ కి, ప్రభుత్వానికి మధ్య ‘వార్’ వంటిది నడుస్తోంది. ఆ నేపథ్యంలో ఈ సమన్లు, ఈ విచారణ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తన ట్విటర్ అకౌంట్ సుమారు గంట సేపు బ్లాక్ అయిందని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ గతవారం ఆరోపించారు. అటు- కాపీ రైట్ సమస్యపై తాను కూడా ఇదే విధమైన పరిస్థితిని ఎదుర్కొన్నానని శశిథరూర్ కూడా ఆరోపించారు. తమ ఇద్దరి ఖాతాలను కొద్దిసేపు స్తంభింప జేసిన అంశంపై ట్విటర్ ఇండియా నుంచి సంజాయిషీని కోరుతానని ఆయన అన్నారు. ఈ నెలారంభంలో కేంద్రం ట్విటర్ కి నోటీసును జారీ చేస్తూ తమ నిబంధనలకు అనుగుణంగా నడచుకోవలసిందేనని హెచ్చరించింది.
ఇటీవల ట్విటర్ ఇండియా తన నోడల్ ఆఫీసర్ వివరాలను తెలిపినప్పటికీ కేంద్రం అసంతృప్తి చెందింది. ఈ వివరాలు సమగ్రంగా లేవని పేర్కొంది.మరోవైపు…ట్విటర్ తాత్కాలిక గ్రివాన్స్ ఆఫీసర్ ధర్మేంద్ర చతుర్ తన అపాయింట్ మెంట్ కి ముందే రాజీనామా చేశారు. ఇందుకు కారణాలు తెలియలేదు. కేంద్రానికి, ఈ సామాజిక మాధ్యమానికి మధ్య తలెత్తిన వివాదం కారణంగా ఆయన రాజీనామా చేసినట్టు తెలుస్థోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: కాశ్మీర్ లో తొలి డ్రోన్ దాడి…ముష్కరులు టార్గెట్ ఏంటో తెలుసా.. వైరల్ అవుతున్న వీడియో..:Drone Attack video
బామ్మ రాక్స్.. మనమడు షాక్..బామ్మ ,మనమడు ఫన్నీ వైరల్ వీడియో.. మరీ ఇంత చీటింగ్ నా:viral video.