AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TRAI Caller ID: కాలర్ ఐడీ విషయంలో ట్రాయ్ కీలక నిర్ణయం.. ట్రూ కాలర్ అవసరం లేకుండానే కాలర్ ఐడీ డిస్‌ప్లే..!

మనకు ఫోన్ ఎవరు చేశారనే విషయం తెలుసుకునేలా స్మార్ట్ ఫోన్లకు ఉపయోగపడేలా ట్రూ కాలర్ యాప్ ఇటీవల కాలంలో అత్యంత ప్రజాదరణ పొందింది. అయితే మనకు ఫోన్ ఎవరు చేశారో? తెలుసుకోవడానికి ట్రూ కాలర్ యాప్ ఉపయోగపడినా మన ఫోన్ భద్రత విషయంలో థర్డ్ పార్టీ యాప్ అయిన ట్రూ కాలర్‌ను విశ్వసించలేము. ఈ నేపథ్యంలో భారతదేశంలో మొబైల్ వినియోగదారులకు మెరుగైన భద్రతను అందించేందుకు ట్రాయ్ కీలక చర్యలను తీసుకుంది.  టెలికాం ఆపరేటర్లు ముంబై, హర్యానాలో కాల్ ఐడి ప్రజెంటేషన్‌కు సంబంధించిన పరిమిత ట్రయల్స్ నిర్వహించారు.

TRAI Caller ID:  కాలర్ ఐడీ విషయంలో ట్రాయ్ కీలక నిర్ణయం.. ట్రూ కాలర్ అవసరం లేకుండానే కాలర్ ఐడీ డిస్‌ప్లే..!
TRAI
Nikhil
|

Updated on: Jul 02, 2024 | 7:30 PM

Share

ఇటీవల కాలంలో ఫోన్ల వాడకం బాగా పెరిగింది. ప్రతి ఇంట్లో రెండు నుంచి మూడు ఫోన్లు ఉంటున్నాయంటే వాటి వాడకం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే మంచి ఉన్న చోటే చెడు ఉన్న చందాన ఈ ఫోన్లు వాడి మోసం చేసే వారి సంఖ్య కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో మనకు ఫోన్ ఎవరు చేశారనే విషయం తెలుసుకునేలా స్మార్ట్ ఫోన్లకు ఉపయోగపడేలా ట్రూ కాలర్ యాప్ ఇటీవల కాలంలో అత్యంత ప్రజాదరణ పొందింది. అయితే మనకు ఫోన్ ఎవరు చేశారో? తెలుసుకోవడానికి ట్రూ కాలర్ యాప్ ఉపయోగపడినా మన ఫోన్ భద్రత విషయంలో థర్డ్ పార్టీ యాప్ అయిన ట్రూ కాలర్‌ను విశ్వసించలేము. ఈ నేపథ్యంలో భారతదేశంలో మొబైల్ వినియోగదారులకు మెరుగైన భద్రతను అందించేందుకు ట్రాయ్ కీలక చర్యలను తీసుకుంది.  టెలికాం ఆపరేటర్లు ముంబై, హర్యానాలో కాల్ ఐడి ప్రజెంటేషన్‌కు సంబంధించిన పరిమిత ట్రయల్స్ నిర్వహించారు. ఈ చర్యలు విజయవంతం కావడంతో కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ సదుపాయాన్ని రానున్న నెలల్లో త్వరలో దేశవ్యాప్తంగా టెలికాం ఆపరేటర్లు అమలు చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రాయ్ కీలక చర్యల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ సదుపాయం సిమ్ కార్డ్ కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు కేవైసీ ఫారమ్‌లో నింపిన సమాచారం ఆధారంగా కాలర్ పేరు ప్రదర్శితమవుతుంది. దేశంలో నకిలీ, స్పామ్ కాల్‌లను అరికట్టడానికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, టెలికాం శాఖ ఈ చర్యలు తీసుకుంది. సీఎన్ఏపీ సర్వీస్ ట్రూ కాలర్‌లానే ఉంటుంది. ఈ ఫీచర్ పని, సాధ్యాసాధ్యాలను అర్థం చేసుకోవడానికి టెలికాం కంపెనీలు మొదట ముంబై మరియు హర్యానాలోని పరిమిత నగరాల్లో దీనిని పరీక్షించినట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. పరీక్ష ఫలితాలు టెలికమ్యూనికేషన్స్ శాఖ అందుకుంది. ఈ నేపథ్యంలో సాధ్యాసాధ్యాల పరిశీలన తర్వాత ప్రతిపాదిత సేవ గురించి ఆచరణాత్మక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే సీఎన్‌ఏపీ సర్వీస్‌ను ప్రారంభించడానికి టెలికాం ఆపరేటర్లకు జూలై 15 వరకు గడువు ఇచ్చారని, ఈ లోపే ఈ తాజా అప్‌డేట్ యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 

సిమ్ కార్డ్‌ని కొనుగోలు చేసే సమయంలో ఫారమ్‌లో నింపిన వ్యక్తి పేరు కాల్ చేసినప్పుడు కనిపిస్తుంది. వ్యాపార కాల్‌ల విషయంలో కంపెనీ పేరు ప్రదర్శితమవుతుంది. దేశంలో సైబర్ క్రైమ్‌లను నిరోధించడంలో ఈ చర్య సహాయపడుతుందని టెలికాం కంపెనీలు కూడా భావిస్తున్నాయి. ముఖ్యంగా సీఎన్ఏపీ సర్వీస్ స్పామ్ కాల్‌లను నిరోధించడంలో కూడా ఇది సహాయపడుతుంది. దేశంలో స్పామ్ కాల్స్ పెద్ద సమస్యగా మారాయి. లోకల్‌సర్కిల్స్ స్టడీ సర్వే ప్రకారం 60 శాతం మంది వ్యక్తులు రోజుకు 3 కంటే స్పామ్ కాల్‌లను స్వీకరిస్తున్నారు. అంతేకాకుండా నేషనల్ డూ నాట్ కాల్ రిజిస్ట్రీ కింద డోంట్ డిస్టర్బ్ జాబితాలో రిజిస్టర్ చేసినప్పటికీ తమకు స్పామ్ కాల్స్ వస్తున్నాయని 90 శాతం మంది యూజర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కాల్స్‌లో ఎక్కువ భాగం ఆర్థిక సేవలు, రియల్ ఎస్టేట్‌కు సంబంధించినవిగా ఉంటాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన..
సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన..