Indian Railways: మీరు రైలులో ప్రయాణిస్తున్నారా.? ఇలా చేస్తే ఏడాది జైలు, భారీ జరిమానా.!

ఇండియన్ రైల్వేస్.. దేశామంతటా ప్రతీ రోజూ లక్షల్లో ప్రయాణీకులను తమ గమ్యస్థానాలు చేరుస్తుంటాయి. పండుగలు, లేదా రద్దీ ఉండే రూట్లలో ప్రయాణీకులు ఇబ్బందులకు గురికాకుండా ఉండేలా పలు నిబంధనలను అమలులోకి తీసుకొస్తోంది రైల్వేశాఖ. ఇక రైలు ప్రయాణానికి టికెట్ కొనడం తప్పనిసరి..

Indian Railways: మీరు రైలులో ప్రయాణిస్తున్నారా.? ఇలా చేస్తే ఏడాది జైలు, భారీ జరిమానా.!
Indian Railways
Follow us

|

Updated on: Jul 02, 2024 | 6:11 PM

ఇండియన్ రైల్వేస్.. దేశామంతటా ప్రతీ రోజూ లక్షల్లో ప్రయాణీకులను తమ గమ్యస్థానాలు చేరుస్తుంటాయి. పండుగలు, లేదా రద్దీ ఉండే రూట్లలో ప్రయాణీకులు ఇబ్బందులకు గురికాకుండా ఉండేలా పలు నిబంధనలను అమలులోకి తీసుకొస్తోంది రైల్వేశాఖ. ఇక రైలు ప్రయాణానికి టికెట్ కొనడం తప్పనిసరి, అలా లేనిచో టీటీఈ జరిమానా విధిస్తాడు. మరి మీరు రైలులో తరచూ ప్రయాణిస్తుంటే.. రూల్స్ ఏంటి.? పాటించకపోతే జరిమానా, జైలు శిక్ష ఎలా ఉంటాయన్నది ఇప్పుడు తెలుసుకుందామా..

ఏ రూల్స్ అతిక్రమిస్తే.. ఎంత జరిమానా.?

  • ఎవరైనా టికెట్ లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడితే, రైల్వే నిబంధనల ప్రకారం, అతడికి ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా గరిష్టంగా రూ. వెయ్యి జరిమానా పడుతుంది. ఈ జరిమానాలో ప్రయాణికుడు ప్రయాణించే దూరానికి టికెట్ ధర కూడా కలిపి ఉంటుంది.

  • మీరు స్లీపర్ కోచ్ టికెట్‌తో ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తూ పట్టుబడితే.. సదరు వ్యక్తి తీసుకున్న స్లీపర్ టికెట్‌పై.. వ్యత్యాసంగా ఉన్న ఏసీ కోచ్ ధర చార్జీని చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా టీటీఈ అదనపు పెనాల్టీ ఛార్జీలను సైతం విధించవచ్చు.

  • మీరు ఆన్‌లైన్‌లో టికెట్‌ను బుక్ చేసుకున్నట్లయితే, ప్రయాణ సమయంలో మీ వద్ద తప్పనిసరిగా ఐడీ కార్డు ఉండాలి. టీటీఈ ఐడీని అడిగినప్పుడు.. మీరు చూపించలేకపోతే.. మిమ్మల్ని టికెట్ లేని వ్యక్తిగా పరిగణిస్తాడు.

  • ఎవరైనా రైలులో మద్యం సేవిస్తూ లేదా మద్యం సేవించి రైలులో ప్రయాణించినట్లయితే, అతడ్ని రైలు నుంచి దింపేయడమే కాకుండా.. రూ. 500 జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించవచ్చు.

  • మీరు యువకులై ఉండి, టికెట్ లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడితే, మీరు కనీసం రూ. 250 జరిమానా లేదా అదనపు రుసుము లేదా రెండూ చెల్లించాల్సి ఉంటుంది.

  • భారతీయ రైల్వే చట్టంలోని సెక్షన్ 141 ప్రకారం, ఎటువంటి సరైన కారణం లేకుండా ఎమర్జెన్సీ చైన్‌ని లాగి రైలును ఆపిన వారికి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా రూ. 1,000 వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు.

  • రైలులో పొగత్రాగుతూ పట్టుబడితే రూ.200 జరిమానా విధించవచ్చు. ఎవరైనా టికెట్ లేదా అనుమతి లేకుండా రైల్వే ట్రాక్ దాటినా లేదా ప్లాట్‌ఫారమ్‌లోకి ప్రవేశించినా వారికి రూ.1,000 జరిమానా లేదా జైలు శిక్ష విధించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..