AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maternity Insurance: మీరు ప్రసూతి కవరేజీ కోసం బీమా తీసుకుంటున్నారా? ముందు ఇవి తెలుసుకోండి

నేడు దాదాపు అన్ని కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగులకు బీమా కవరేజీని అందజేస్తున్నాయి. ఆరోగ్య బీమా కంపెనీల నుండి కార్పొరేట్ ప్లాన్ అందుబాటులో ఉంది. కొన్ని ప్లాన్‌లలో కవరేజీ స్థాయిలో తేడాలు ఉన్నాయి. బీమా సౌకర్యం మీరు పని చేసే కంపెనీ ద్వారా అందించబడితే, ప్రయోజనాలను తనిఖీ చేయండి. ఉదాహరణకు.. బీమా పథకంలో ప్రసూతి ఖర్చులు ఎలా కవర్ అవుతాయో..

Maternity Insurance: మీరు ప్రసూతి కవరేజీ కోసం బీమా తీసుకుంటున్నారా? ముందు ఇవి తెలుసుకోండి
Maternity Insurance
Subhash Goud
|

Updated on: Jul 03, 2024 | 5:31 AM

Share

నేడు దాదాపు అన్ని కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగులకు బీమా కవరేజీని అందజేస్తున్నాయి. ఆరోగ్య బీమా కంపెనీల నుండి కార్పొరేట్ ప్లాన్ అందుబాటులో ఉంది. కొన్ని ప్లాన్‌లలో కవరేజీ స్థాయిలో తేడాలు ఉన్నాయి. బీమా సౌకర్యం మీరు పని చేసే కంపెనీ ద్వారా అందించబడితే, ప్రయోజనాలను తనిఖీ చేయండి. ఉదాహరణకు.. బీమా పథకంలో ప్రసూతి ఖర్చులు ఎలా కవర్ అవుతాయో తెలుసుకోవాలి. లేకుంటే ఈరోజు మాతృత్వానికి అయ్యే ఖర్చు, గర్భం దాల్చినప్పటి నుంచి పుట్టే వరకు కొన్ని లక్షలే అవుతుంది. స్త్రీ గర్భవతి అయితే ముందుగా బీమా పాలసీలో ప్రసూతి కవరేజీ గురించి ఆరా తీయండి.

  1. మొత్తం కవరేజీలో ప్రసూతి కోసం ఎంత?: సాధారణంగా ఆరోగ్య బీమాలు ప్రసూతి కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉండవు. మొత్తం కవరేజీలో ప్రసూతి కోసం ఉప పరిమితి ఉంది. లేదా రైడర్‌గా అందుబాటులో ఉంటుంది. ఉదాహరణకు.. మీ కంపెనీ బీమా పాలసీ మొత్తం కవరేజీ సంవత్సరానికి రూ. 5 లక్షలు అయితే, ప్రసూతి ఖర్చుల పరిమితి రూ. 50,000 నుండి రూ. 1.5 లక్షల వరకు ఉండవచ్చు. మీ పాలసీలో ఈ పరిమితి ఎంత ఉందో తనిఖీ చేయండి.
  2. వేచి ఉండే కాలం ఎంత?: కొన్ని పాలసీలు ప్రసూతి ఖర్చులను కవర్ చేయడానికి నిర్దిష్ట నిరీక్షణ వ్యవధిని కూడా కలిగి ఉంటాయి. కొన్ని పాలసీలకు ఒక సంవత్సరం వెయిటింగ్ పీరియడ్ ఉండవచ్చు. కొన్ని పాలసీలకు ఏడాది కంటే ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉండవచ్చు. కొన్ని పాలసీలకు ఈ వెయిటింగ్ పీరియడ్ ఉండకపోవచ్చు. ఇలాంటి ముందుగానే తెలుసుకోవాలి.
  3. ప్రెగ్నెన్సీ నుంచి ప్రెగ్నెన్సీ వరకు..: కొన్ని బీమా పాలసీలు డెలివరీ ఖర్చులకు మాత్రమే కవరేజీని అందిస్తాయి. కొన్ని పాలసీలు గర్భం దాల్చినప్పటి నుంచి పిల్లల సంరక్షణ వరకు వైద్యుల సంప్రదింపులు, చికిత్స తదితర ఖర్చులను కూడా కవర్ చేయగలవు. మీరు ఈ పాయింట్లను ముందే తెలుసుకుంటే, మీరు వాటిని సరిగ్గా ఉపయోగించుకోవచ్చు.
  4. సంతానోత్పత్తి చికిత్స: మీరు సహజంగా గర్భం దాల్చలేక IUI, IVF మొదలైన సంతానోత్పత్తి చికిత్సను పొందుతున్నట్లయితే, మీ కార్పొరేట్ బీమా ప్లాన్ ధరను భరిస్తుందో లేదో తెలుసుకోండి. కొన్ని పాలసీలు గర్భధారణను నివారించడానికి కుటుంబ నియంత్రణ చికిత్సను కూడా కవర్ చేస్తాయి. మీరు అలాంటి చికిత్స లేదా కుటుంబ నియంత్రణ కోసం సిద్ధంగా ఉంటే, మీరు బీమా సౌకర్యాన్ని ఉపయోగించవచ్చు.
  5. ప్రసూతి సెలవుల విధానం ఎలా ఉంది..? మొత్తంమీద ముందుగా మీ వద్ద ఉన్న బీమా ప్లాన్‌ను పూర్తిగా చదవండి. అలాగే అన్ని అంశాలను అర్థం చేసుకోండి. అనుమానం ఉంటే, మీ కంపెనీ హెచ్‌ఆర్‌ డిపార్ట్‌మెంట్‌ని అడగండి. అలాగే కంపెనీ మెటర్నిటీ లీవ్ పాలసీ ఏమిటో ముందుగానే తెలుసుకోవడం మంచిది. కొన్ని కంపెనీలు గర్భధారణ నుండి ప్రసూతి సెలవు వరకు ఆరు నెలల వేతనంతో కూడిన సెలవును అందించవచ్చు. కొన్ని కంపెనీలు చెల్లించని సెలవులను కూడా అందించవచ్చు. సెలవుకు ముందు డాక్టర్ సర్టిఫికేట్ లేదా ఏదైనా ఇతర పత్రాన్ని కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుంది. దీని గురించి ముందుగానే ఆరా తీయడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి