Recharge plan: మొబైల్ యూజర్లకు బెస్ట్ రీఛార్జ్‌ ప్లాన్స్‌.. ధరలు పెరిగినా..

ఇటీవల టెలికాం సంస్థలు టారిఫ్‌లను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కంపెనీలు ఏకంగా 10 నుంచి 25 శాతం వరకు ధరలను పెంచాయి. దీంతో మొబైల్‌ ఫోన్‌ ఉపయోగిస్తున్న వారిపై భారీగా భారం పడింది. జియో మొదలు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ వరకు అన్ని సంస్థలు టారిఫ్‌లను పెంచాయి. పెరిగిన ఈ ధరలు జులై 4వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి...

Recharge plan: మొబైల్ యూజర్లకు బెస్ట్ రీఛార్జ్‌ ప్లాన్స్‌.. ధరలు పెరిగినా..
Recharge Plans
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 02, 2024 | 6:20 PM

ఇటీవల టెలికాం సంస్థలు టారిఫ్‌లను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కంపెనీలు ఏకంగా 10 నుంచి 25 శాతం వరకు ధరలను పెంచాయి. దీంతో మొబైల్‌ ఫోన్‌ ఉపయోగిస్తున్న వారిపై భారీగా భారం పడింది. జియో మొదలు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ వరకు అన్ని సంస్థలు టారిఫ్‌లను పెంచాయి. పెరిగిన ఈ ధరలు జులై 4వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఇదిలా ఉంటే ధరలు పెరిగిన తర్వాత కూడా ప్రముఖ టెలికాం దిగ్గజం జియో కొన్ని మంచి ప్లాన్స్‌ను అందిస్తున్నాయి. ఇతర కంపెనీలతో పోల్చితే జియో అందిస్తున్న కొన్ని రీఛార్జ్‌ ప్లాన్స్‌పై ఓ లుక్కేయండి..

* జియో అందిస్తున్న బెస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్స్‌లో రూ. 249 ఒకటి. ఈ ప్లాన్‌తో రోజుకు 1 జీబీ డేటాతో పాటు అన్‌ లిమిటెడ్‌ కాల్స్‌ పొందొచ్చు. అయితే ఇతర సంస్థలతో పోల్చితే జియోలోనే ఈ ప్లాన్‌ తక్కువ ధరకు లభిస్తోంది.

* రూ. 299తో రీఛార్జ్‌ చేసుకుంటే రోజుకు 1.5 జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ లభిస్తాయి. ఇదే బెనిఫిట్స్‌తో ఇతర కంపెనీల్లో రూ. 349 ప్లాన్‌ అమల్లో ఉంది.

* ఇక జియో అందిస్తున్న మరో బెస్ట్ రీఛార్జ్‌ ప్లాన్స్‌లో రూ. 349 ఒకటి. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. దీంతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్‌ పొందొచ్చు. ఇదే బెనిఫిట్స్‌తో ఇతర టెలికాం సంస్థల్లో అదనంగా రూ. 50 చెల్లించాల్సిందే.

Jio

* మూడు నెలల ప్లాన్‌ కోసం చూస్తున్న వారికి రూ. 479 ప్లాన్ అందుబాటులో ఉంది. ఇందులో యూజర్లకు 6 జీబీ డేటా లభిస్తుంది. అలాగే అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ పొందొచ్చు. ఇదే బెనిఫిట్స్‌తో ఇతర టెలికాం సంస్థల్లో రూ. 509 వరకు ఉన్నాయి.

* ఏడాది ప్లాన్‌ విషయానికొస్తే.. రూ. 1899 ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే ఏడాది పాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ పొందొచ్చు. 24 జీబీ డేటా లభిస్తుంది. ఇదే ప్లాన్‌ ఇతర సంస్థల్లో 5 శాతం ఎక్కువగా వసూలు చేస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..