Train Ticket: టికెట్ తీసుకోకుండానే రైల్లో ప్రయాణిస్తున్నారా? టెన్షన్ లేదు.. ట్రైన్‌లో ఉండి కూడా తీసుకోవచ్చు.. ఎలాగంటే!
ప్రతిరోజు వేలాది మంది ప్రజలు రైల్వే ద్వారా ప్రయాణిస్తుంటారు. అదే సమయంలో రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై విపరీతమైన జనం ఉండటంతో టికెట్లు దొరక్క, రైలు మిస్సవుతుందన్న భయంతో టికెట్ లేకుండానే రైలు ఎక్కుతున్నారు. అయితే, మీరు టికెట్..
ప్రతిరోజు వేలాది మంది ప్రజలు రైల్వే ద్వారా ప్రయాణిస్తుంటారు. అదే సమయంలో రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై విపరీతమైన జనం ఉండటంతో టికెట్లు దొరక్క, రైలు మిస్సవుతుందన్న భయంతో టికెట్ లేకుండానే రైలు ఎక్కుతున్నారు. అయితే, మీరు టికెట్ లేకుండా రైలులో ప్రయాణిస్తే మీకు జరిమానా కూడా విధించవచ్చు. మీకు రైలు ఎక్కిన తర్వాత కూడా అన్‌రిజర్వ్‌డ్ రైలు టిక్కెట్‌ను బుక్ చేసుకునే మార్గాన్ని తెలుసుకోవడం మంచిది.
UTS యాప్
ఆన్‌లైన్ అన్‌రిజర్వ్డ్ రైలు టికెట్ బుకింగ్ సౌకర్యాన్ని రైల్వే యూటీఎస్ యాప్‌లో అందించింది. యూటీఎస్ అప్లికేషన్ ద్వారా రైలులో ప్రయాణించే ప్రయాణికులు రైలు ఎక్కిన తర్వాత కూడా ఆన్‌లైన్‌లో అన్‌రిజర్వడ్ రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోండి
మొబైల్ యాప్ UTS Android, iOS, Windows వెర్షన్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లలో పనిచేస్తుంది. ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదే సమయంలో టిక్కెట్ చెల్లింపు ఆన్‌లైన్‌లో మాత్రమే చేయవచ్చు. రైల్వే అందించిన ఈ సదుపాయంతో అన్‌రిజర్వ్‌డ్ టిక్కెట్‌లతో పాటు ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు.
యూటీఎస్ నుంచి అన్‌రిజర్వడ్ టికెట్ బుకింగ్ చేయడం ఎలా?
- ముందుగా UTS యాప్‌కి వెళ్లండి.
- సాధారణ బుకింగ్ ఎంపికను ఎంచుకోండి.
- ఆపై బయలుదేరే స్టేషన్ పేరు/కోడ్, గమ్యస్థాన స్టేషన్ పేరు/కోడ్‌ను నమోదు చేయండి.
- ప్యాసింజర్, మెయిల్ లేదా ఎక్స్‌ప్రెస్ వంటి టిక్కెట్ రకాన్ని ఎంచుకోండి.
- పేపర్, పేపర్‌లెస్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- వాలెట్ లేదా ఇతర ఆన్‌లైన్ చెల్లింపు పద్ధతుల నుండి చెల్లింపు పద్ధతిని ఎంచుకోండి.
- మీ టిక్కెట్ బుకింగ్ గురించి మీకు సందేశం వస్తుంది.
- యూటీఎస్ డాష్‌బోర్డ్‌లో టికెట్ చూచడవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి