5G in India: త్వరలోనే భారత్ లో 5జీ సేవలు.. స్పెక్ట్రమ్ వేలం ఎప్పటినుంచంటే..

5G in India: ఈ రోజుల్లో ఏ పని చేయాలన్నా ఇంటర్నెట్ అవసరమవుతోంది. ప్రస్తుతం మెుబైల్ వివియోగదారులకు 4జీ అందుబాటులో ఉంది. కానీ.. దేశంలో అందరూ 5జీ సేవలకోసం ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించి..

5G in India: త్వరలోనే భారత్ లో 5జీ సేవలు.. స్పెక్ట్రమ్ వేలం ఎప్పటినుంచంటే..
5g Spectrum Auction
Follow us

|

Updated on: Feb 14, 2022 | 6:34 AM

5G in India: ఈ రోజుల్లో ఏ పని చేయాలన్నా ఇంటర్నెట్ అవసరమవుతోంది. ప్రస్తుతం మెుబైల్ వివియోగదారులకు 4జీ అందుబాటులో ఉంది. కానీ.. దేశంలో అందరూ 5జీ సేవలకోసం ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించి టెలికామ్ అథారిటీ సీనియర్ అధికారి నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే మార్చి నుంచి స్పెక్ట్రమ్ వేలం జరగనుందని. దీనికి సంబంధించి టెలికాం మంత్రి అస్వినీ వైష్ణవ్ ఈ నెల ప్రారంభంలో 5జీ పై మాట్లాడారు. మార్చి నాటికి వేలానికి సంబంధించి ట్రాయ్ కి అవసరమైన సమాచారాన్ని అందించనున్నట్లు వెల్లడించారు. మార్చి నాటికి ట్రాయ్ 5జీకి సంబంధించి సిఫార్సులను అందించనుందని.. దానిపై నిర్ణయం తీసుకోవడానికి మరో నెల సమయం పడుతుందని టెలికాం సెక్టటరీ రాజారమణ్‌ తెలిపారు. గతంలో ట్రాయ్‌ సిఫార్సులు పంపించిన 60-120 రోజులకు వేలం ప్రక్రియ జరిగేది. ఈ సారి ట్రాయ్‌ నుంచి సిఫార్సులు అందుకున్న రెండు నెలల్లోనే వేలం ప్రక్రియను టెలికాం విభాగం పూర్తిచేయనున్నట్లు రాజారమణ్‌ వెల్లడించారు.

స్పెక్ట్రమ్‌ ధర, కేటాయింపు, స్పెక్ట్రమ్‌ బ్లాక్‌ సైజ్‌, పేమెంట్‌ టర్మ్స్‌ అండ్‌ కండిషన్ల విషయంలో ట్రాయ్‌ నుంచి డాట్‌ సిఫార్సులను ఆహ్వానిస్తోంది. ఆ మేరకు ట్రాయ్‌ టెలికాం పరిశ్రమ, ఇతర భాగస్వామ్యపక్షాలతో సంప్రదింపులు జరిపి డాట్‌కు ప్రతిపాదనలను పంపిస్తుంది. దీనిపై డాట్‌లోని డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌ నిర్ణయం తీసుకుని.. కేబినెట్‌ ఆమోదానికి పంపుతుంది. ఆ తరువాత వేలం ప్రక్రియను చేపట్టనున్నారు. వేలం ప్రక్రియ నిర్వహణ బాధ్యతలను ఇప్పటికే ఎంఎస్​టీసీని ఎంపిక చేసినట్లు రాజారమణ్‌ తెలిపారు. ఫిబ్రవరి 15 నాటికి 5జీ స్పెక్ట్రమ్‌ వేలానికి సంబంధించి అభిప్రాయాలను తెలపేందుకు ట్రాయ్ గడువు ఇచ్చింది. దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వస్తే.. ఇప్పుడు 4జీలో ఉన్న డౌన్‌లోడ్‌ స్పీడ్‌ కంటే 10 రెట్ల వేగంతో ఇంటర్నెట్‌ సేవలను పొందొచ్చు.

ఇవీ చదవండి..

Lord Hanuman: మనదేశంలో ఆ గ్రామంలో హనుమంతుడి పేరు తలచినా నేరం.. ఇప్పటికీ ఆయన్ని క్షమించని ప్రజలు ఎందుకంటే..

Horoscope Today: ఈ వ్యక్తులు ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు.. నేడు ఏ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ