Post Office Scheme: నెలకు రూ.10 వేలు పెట్టుబడి పెట్టండి.. రూ.16 లక్షలు సొంతం చేసుకోండి..

కచ్చితమైన ఆర్థిక ప్రణాళికతో ముందుకెళ్తే కోటీశ్వరులు కావొచ్చని ఆర్థిక నిపుణు చెబుతున్నారు. మీరు పెట్టుబడి పెట్టే పథకాలు భద్రతతో కచ్చితమైన ఆదాయాన్ని ఇవ్వాలి...

Post Office Scheme: నెలకు రూ.10 వేలు పెట్టుబడి పెట్టండి.. రూ.16 లక్షలు సొంతం చేసుకోండి..
Money
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Feb 15, 2022 | 11:35 AM

కచ్చితమైన ఆర్థిక ప్రణాళికతో ముందుకెళ్తే కోటీశ్వరులు కావొచ్చని ఆర్థిక నిపుణు చెబుతున్నారు. మీరు పెట్టుబడి పెట్టే పథకాలు భద్రతతో కచ్చితమైన ఆదాయాన్ని ఇవ్వాలి. అలాంటి ఓ పథకాన్ని పోస్టాఫీస్(Post Offic) అందిస్తుంది. అదే పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్(Post Office RD). ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం వల్ల మీ డబ్బు భద్రంగా ఉంటుంది. కచ్చితమైన రాబడి(Income) వస్తుంది. అందుకే చాలామంది ఇందులో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నారు.

పెట్టుబడి ఎలా ప్రారంభించాలి

పోస్ట్ ఆఫీస్ RD డిపాజిట్ ఖాతా అనేది ప్రభుత్వ-మద్దతు గల పథకం. ఇందులో చిన్న మొత్తల్లో డబ్బును డిపాజిట్ పొదుపు చేసి అధిక వడ్డీ రేటును పొందవచ్చు. మీరు కేవలం 100 రూపాయలతో పెట్టుబడిని ప్రారంభించవచ్చు. గరిష్ఠ పెట్టుబడికి పరిమితి లేదు. కాబట్టి మీరు కోరుకున్నంత పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఈ పథకానికి పదేళ్ల పాటు మెచ్యూరిటీ ఉంటుంది.

ఎంత వడ్డీ?

ప్రస్తుతం, రికరింగ్ డిపాజిట్ పథకాలపై 5.8% వడ్డీ రేటు అందుబాటులో ఉంది. ప్రతి త్రైమాసికంలో, భారత ప్రభుత్వం తన చిన్న పొదుపు కార్యక్రమాలన్నింటికీ వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది. మీరు ప్రతి నెలా 10 వేలు పెడితే పదేళ్ల తర్వాత 5.8% వడ్డి చొప్పున రూ 16,28,963 జమ అవుతుంది. అయితే మీరు క్రమం తప్పకుండా ఖాతాలో డబ్బు జమ చేయాలి. లేకపోతే మీకు నెలవారీ ఒక శాతం జరిమానా విధిస్తారు. వరుస నాలుగు నెలలు కట్టకపోతే ఖాతా మూసేస్తారు.

Read Also..  LIC IPO: ఎల్ఐసీ పాలసీదారులకు తగ్గింపు లభిస్తుంది.. దరఖాస్తు చేయడానికి ఈ రెండు విషయాలు అవసరం..