Petrol Price: దూకుడు మీదున్న క్రూడాయిల్‌ ధరలు.. అయినా స్థిరంగా కొనసాగుతోన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..

Petrol Price: గతకొన్ని రోజులుగా భారీగా తగ్గిన క్రూడాయిల్‌ ధరలకు ఇప్పుడు మళ్లీ రెక్కలొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధరలు 115 డార్లపైకి చేరాయి. అయితే సహజంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు..

Petrol Price: దూకుడు మీదున్న క్రూడాయిల్‌ ధరలు.. అయినా స్థిరంగా కొనసాగుతోన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..
Petrol Diesel Price
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 21, 2022 | 9:03 AM

Petrol Price: గతకొన్ని రోజులుగా భారీగా తగ్గిన క్రూడాయిల్‌ ధరలకు ఇప్పుడు మళ్లీ రెక్కలొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధరలు 115 డార్లపైకి చేరాయి. అయితే సహజంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరిగితే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగాలి. కానీ ప్రస్తుతం మాత్రం దేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే మార్కెట్లో నిపుణుల అంచనా ప్రకారం ఈ స్థిరత్వం ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం కనిపించడం లేదు. పెరుగుతోన్న క్రూడ్‌ ఆయిల్‌ ధరల కారణంగా రానున్న రోజుల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలో పెరుగుదల అనివార్యమని అంచనా వేస్తున్నారు. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో మంగళవారం పెట్రోల్‌, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్‌ రేట్‌ రూ. 96.72గా ఉండగా, డీజిల్‌ రూ. 89.62 వద్ద కొనసాగుతోంది.

* ముంబైలో పెట్రోల్‌ రూ. 111.35 కాగా, డీజిల్‌ రూ. 96.72గా ఉంది.

ఇవి కూడా చదవండి

* తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 102.63 పలుకగా, డీజిల్‌ రూ. 94.24గా ఉంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ. 101.92 వద్ద కొనసాగుతుండగా, డీజిల్‌ రూ. 87.87గా ఉంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

* హైదరాబాద్‌లో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ మంగళవారం పెట్రోల్‌ రేట్‌ రూ. 109.64గా ఉండగా, డీజిల్‌ రూ. 97.8 వద్ద కొనసాగుతోంది.

* గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ. 111.74గా ఉండగా, డీజిల్‌ రూ. 99.49వద్ద కొనసాగుతోంది.

* సాగర నగరం విశాఖపట్నంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 110.46గా ఉండగా, డీజిల్‌ రేట్‌ రూ. 98.25గా నమోదైంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..