AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhoni investments: ధోనీలా ఆలోచిస్తే విజయం మీదే.. పెట్టుబడి సమయంలో వీటిని మరువొద్దు

మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ పేరు తెలియని వారు మన దేశంలో ఎవ్వరూ ఉండదు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ను అభిమానించే వారందరికీ కూడా ధోనీ పేరు సుపరిచితమే. ఇండియన్ క్రికెట్ లో ఆయనకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. లెజెండరీ క్రికెటర్లు కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ తర్వాత ఆటను శాసించిన నాయకుడు ధోనీ.

Dhoni investments: ధోనీలా ఆలోచిస్తే విజయం మీదే.. పెట్టుబడి సమయంలో వీటిని మరువొద్దు
Investment
Nikhil
|

Updated on: May 06, 2025 | 6:00 PM

Share

ఆటలో సమయానికి అనుగుణంగా ఎత్తులు వేయడం, ప్రత్యర్థి బ్యాటర్లను తడబడేలా చేసి అవుట్ చేయడం, వికెట్లు వెనకాల మెరుపు వేగంతో స్టంపింగ్ చేయడం ధోనీకే సాధ్యం. క్రికెట్ తో పాటు వ్యాపార రంగంలోనూ ధోనీ విజయకేతనం ఎగురవేశాడు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పెట్టుబడుల గురించి ఆయన ఎన్నో విలువైన విషయాలు వెల్లడించారు. మహేంద్ర సింగ్ ధోనీ చెప్పిన విషయాల్లోకి వెళితే.. పెట్టుబడి దారులు లాభం కోసం తొందరపడకూడదు. స్థిరమైన పెట్టుబడి మార్గాలను ఎంచుకోవాలి. తక్కువ రిస్కు ఉన్న వాటిని ఎంపిక చేసుకుంటే కాలక్రమీణా మంచి రాబడిని ఇచ్చే అవకాశం ఉంటుంది. త్వరిత లాభాల కోసం ప్రమాదకరమైన వాటిలో డబ్బులను జమ చేయవద్దు. ముఖ్యంగా మార్కెట్ పరిస్థితులను బట్టి అవసరమైన మార్పులు చేసుకుంటూ వెళ్లాలి.

త్వరగా అధిక లాభాలు ఆర్జించాలనే ఉద్దేశంతో పెట్టుబడి పెట్టడం ప్రమాదకరమని ధోనీ చెప్పాడు. ఆయన ఉద్దేశంలో సరైన మార్గాల్లో పెట్టుబడి పెడితే మీ డబ్బు ఎక్కడికీ పోదు. పైగా మీకు మంచి ఫలితాలను అందిస్తుంది. మీ లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులు ఎంపిక చేసుకోవడం, వాటిని నిర్వహించడం చాలా ముఖ్యం. ప్రతి దానికి అనుకూల, ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఎక్కువ రాబడిని, బహుమతులను కోరుకుంటే ప్రమాదం కూడా ఎక్కువగానే ఉంటుంది.

క్రికెట్ తో పాటు వ్యాపారంలోనూ మహేంద్ర సింగ్ ధోనీ తనదైన ముద్ర వేశాడు. వ్యాపారంలో వివిధ రంగాలకు తన పెట్టుబడులను విస్తరించాడు. టెక్నాలజీ, మొబిలిటీ, ఫిన్ టెక్, వెల్నెస్, సస్టైనబిలిటీ వంటి రంగాల్లో ఇన్వెస్ట్ చేశాడు. అలాగే వివిధ స్టార్టప్ లకు కూడా మద్దతుగా నిలిచాడు. గరుడ ఏరోస్పేస్, ఈమోటోరాడ్, టాగ్జా రహూ, ఖటాబుక్ వంటి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాడు.

ఇవి కూడా చదవండి

భారత క్రికెట్టు జట్టు ఆటగాడిగా, నాయకుడిగా దేశానికి ధోనీ అనేక విజయాలు అందించాడు. పలు రికార్డులను తన పేరుపై లిఖించుకున్నాడు. సారథిగా టీమ్ ఇండియాకు 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్టే వరల్డ్ కప్, 2013 చాంపియన్స్ ట్రోపీ అందించాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత ఇన్వెస్ట్ మెంట్లపై ఆసక్తి చూపుతున్నాడు. వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నాడు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి