AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మిడిక్లాస్ వాళ్లకు మంచి కిక్ ఇచ్చే న్యూస్.. రెండున్నర గంటల్లోనే ఢిల్లీకి.. అదికూడా అతి తక్కువ ఛార్జీలతో విమాన ప్రయాణం

ఇకపోతే, రాజధాని, సంపర్క్ క్రాంతి వంటి రైళ్లు హైదరాబాద్ నుండి ఢిల్లీకి 22 నుండి 24 గంటలు పడుతుంది. అయితే, తెలంగాణ ఎక్స్‌ప్రెస్ 26 గంటలు పడుతుంది. అదే విమానంలో మీరు ఈ ప్రయాణాన్ని కేవలం రెండున్నర గంటల్లో పూర్తి చేసుకుంటారు. మీరు కూడా జూలై 5 నుండి 31 మధ్య హైదరాబాద్ నుండి ఢిల్లీకి ప్రయాణించాలనుకుంటే, ఆకాసా ఎయిర్.. రైలు ఛార్జీల కంటే తక్కువ ధరలకు విమాన టిక్కెట్లను అందిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే...

మిడిక్లాస్ వాళ్లకు మంచి కిక్ ఇచ్చే న్యూస్.. రెండున్నర గంటల్లోనే ఢిల్లీకి.. అదికూడా అతి తక్కువ ఛార్జీలతో విమాన ప్రయాణం
Cheapest Flight Ticket
Jyothi Gadda
|

Updated on: May 06, 2025 | 3:45 PM

Share

వేసవి కాలంలో దేశంలోని అనేక విమానయాన సంస్థలు ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నాయి. దీని కింద, మీరు హైదరాబాద్ నుండి ఢిల్లీకి చాలా చౌక ధరకు విమానంలో ప్రయాణించే అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ ప్రత్యేక విషయం ఏమిటంటే ఇది మీ సమయం, డబ్బు రెండింటినీ ఆదా చేస్తుంది. మీరు కూడా జూలై 5 నుండి 31 మధ్య హైదరాబాద్ నుండి ఢిల్లీకి ప్రయాణించాలనుకుంటే, ఆకాసా ఎయిర్.. రైలు ఛార్జీల కంటే తక్కువ ధరలకు విమాన టిక్కెట్లను అందిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే…

హైదరాబాద్ నుండి ఢిల్లీ కి ఛార్జీ కేవలం రూ. 3697 మాత్రమే. goibibo వెబ్‌సైట్ ప్రకారం, 2025 జూలై 5 నుండి 31 వరకు అకాసా ఎయిర్ విమానాలు కేవలం రూ. 3697 కు ఎకానమీ క్లాస్ టిక్కెట్లను అందిస్తున్నాయి. హైదరాబాద్ నుండి ఢిల్లీకి ఆకాశ ఎయిర్ మొదటి విమానం జూలై 5న ఉదయం 6 గంటలకు బయలుదేరుతుంది. 2 గంటల 20 నిమిషాల తర్వాత, అది ఉదయం 8.20 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుంది.  జూలై 5న, ఆకాశ ఎయిర్ కు చెందిన మరో విమానం సాయంత్రం 5.20 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరుతుంది. 2 గంటల 40 నిమిషాల తర్వాత అది రాత్రి 8 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుంది. దీని ధర కూడా రూ. 3697.

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఫస్ట్ ఏసీ కంటే ఛార్జీ రూ.2100 తక్కువ ధరలోనే మీరు హైదరాబాద్‌ నుండి ఢిల్లీకి వెళ్లే అవకాశం ఇది. హైదరాబాద్ నుండి ఢిల్లీకి రైలులో ప్రయాణిస్తే, రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాలనుకుంటే..ఫస్ట్‌క్లాస్‌ AC కి INR 5830 ఖర్చవుతుంది. అదే సెకండ్‌ క్లాస్ AC కి INR 4670 ఖర్చవుతుంది. అంటే మీరు చాలా తక్కువ ధరకు విమానంలో మీ ప్రయాణాన్ని పూర్తి చేస్తారు. అలాగే, హైదరాబాద్ నుండి ఢిల్లీకి సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఫస్ట్‌ క్లాస్ ఏసీ ఛార్జీ రూ. 4460, సెకండ్ ఏసీకి రూ. 2625లు ఖర్చు అవుతుంది. అలాగే,తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో ఫస్ట్ ఏసీ ఛార్జీ రూ. 4505.

ఇవి కూడా చదవండి

జూలై 5న హైదరాబాద్ నుండి ఢిల్లీకి ఇండిగో విమానం కేవలం రూ. 3855కే అందుబాటులో ఉంది. ఈ విమానం హైదరాబాద్ నుండి సాయంత్రం 5 గంటలకు బయలుదేరి రాత్రి 7.25 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుంది. జూలై 6న హైదరాబాద్ నుండి ఢిల్లీకి ఇండిగో విమానం కేవలం రూ.4717కే అందుబాటులో ఉంది. ఈ విమానం ఉదయం 7.45 గంటలకు బయలుదేరి 10.05 గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది. మరో విమానం మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.40 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ అవుతుంది.

ఇకపోతే, రాజధాని, సంపర్క్ క్రాంతి వంటి రైళ్లు హైదరాబాద్ నుండి ఢిల్లీకి 22 నుండి 24 గంటలు పడుతుంది. అయితే, తెలంగాణ ఎక్స్‌ప్రెస్ 26 గంటలు పడుతుంది. అదే విమానంలో మీరు ఈ ప్రయాణాన్ని కేవలం రెండున్నర గంటల్లో పూర్తి చేసుకుంటారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..