AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: మీరు రైలులో ప్రయాణిస్తున్నారా? రాత్రి 10 తర్వాత ఇలా అస్సలు చేయకండి!

Indian Railways: భారతీయ రైల్వేలు మిడిల్ బెర్తుల వాడకానికి సంబంధించి కూడా నియమాలను రూపొందించాయి. దిగువ, ఎగువ బెర్తులు ఉన్న ప్రయాణీకులు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల మధ్య మిడిల్ బెర్తుల వాడకాన్ని వ్యతిరేకించలేరు. రైలులో ప్రయాణించే ముందు..

Indian Railways: మీరు రైలులో ప్రయాణిస్తున్నారా? రాత్రి 10 తర్వాత ఇలా అస్సలు చేయకండి!
Subhash Goud
|

Updated on: Sep 04, 2025 | 1:03 PM

Share

Indian Railways: భారతీయ రైల్వేలు ఒక ప్రధాన రవాణా సాధనం. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు భారతీయ రైళ్లలో ప్రయాణిస్తారు. భారతీయ రైళ్లు దేశంలోని వివిధ ప్రాంతాలను ఒకదానితో ఒకటి అనుసంధానించడమే కాకుండా ఉపాధి, విద్య, ఆరోగ్యం, వ్యాపారాన్ని కూడా అందిస్తాయి. భారతీయ రైల్వేలు సౌకర్యవంతమైన రవాణాలలో ఒకటిగా ఉంది. అలాగే రైల్వే ఛార్జీలు సైతం తక్కువగా ఉండటంతో సామాన్యులకు అనుకూలంగా ఉంటుంది. ఈ కారణంగా చాలా మంది ప్రజలు ఇతర మార్గాల్లో ప్రయాణించడానికి బదులుగా భారతీయ రైళ్లలో ప్రయాణించడానికి ఇష్టపడతారు. ప్రయాణికులు ప్రయాణించేటప్పుడు ఎటువంటి అసౌకర్యాన్ని ఎదుర్కోకుండా చూసుకోవడానికి అనేక నియమాలు కూడా రూపొందించంది రైల్వే. మీరు రాత్రిపూట భారతీయ రైళ్లలో ప్రయాణిస్తే మీరు కొన్ని నియమాల గురించి తెలుసుకోవాలి. లేకుంటే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రాత్రి 10 గంటల తర్వాత భారతీయ రైళ్లలో చాలా నియమాలు మారుతాయి.

ఇది కూడా చదవండి: Mobile Number: మీ ఫోన్ నంబర్ ముందు +91 ఎందుకు ఉంటుందో మీకు తెలుసా?

రైలులో రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు TTE మీ టికెట్‌ను తనిఖీ చేయలేరు. ప్రయాణికులు నిద్రపోతున్నప్పుడు ఎటువంటి సమస్యలను ఎదుర్కోకుండా ఉండటానికి ఈ నియమం రూపొందించారు. ఎందుకంటే రాత్రి 10 గంటల తర్వాత టీటీఈ వచ్చి తనిఖీలు చేస్తే మీ నిద్రకు భంగం కలుగుతుందనే ఉద్దేశంతో రైల్వేలు ఈ నియమాలను విధిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

అయితే మీరు రాత్రి 10 గంటల తర్వాత రైలులో ప్రయాణం ప్రారంభిస్తుంటే ఈ నియమం మీకు వర్తించదు. ఈ సందర్భంలో TTE మీ టికెట్‌ను తనిఖీ చేయవచ్చు. మీ టికెట్‌ను తనిఖీ చేసే హక్కు ఆయనకు ఉంది. రాత్రిపూట రైలులో ప్రయాణిస్తున్నప్పుడు మీరు బిగ్గరగా మాట్లాడలేరు. బిగ్గరగా మాట్లాడటం తోటి ప్రయాణీకుల నిద్రకు భంగం కలిగిస్తుంది. ఈ కారణంగా మీరు రాత్రి 10 గంటల తర్వాత రైలులో బిగ్గరగా మాట్లాడటం, మీ మొబైల్‌లో మ్యూజిక్‌ బయటకు సౌండ్‌ వచ్చేలా వినడం నిషేధం.

ఇది కూడా చదవండి: Viral Video: ఓరి మీ దుంపతెగ..! రోడ్ల మీద ఆ పనులేంట్రా బాబు..! సింగిల్స్ ఏమైపోవాలి!

భారతీయ రైల్వేలు మిడిల్ బెర్తుల వాడకానికి సంబంధించి కూడా నియమాలను రూపొందించాయి. దిగువ, ఎగువ బెర్తులు ఉన్న ప్రయాణీకులు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల మధ్య మిడిల్ బెర్తుల వాడకాన్ని వ్యతిరేకించలేరు. రైలులో ప్రయాణించే ముందు మీరు ఈ నియమాల గురించి తెలుసుకోవాలి. రాత్రి పది తర్వాత రైలులో అల్లరి చేయడం, గట్టిగా అరవడం కూడా నిషేధం.

ఇది కూడా చదవండి: BSNL: ప్రత్యేక ఆఫర్‌ పొడిగింపు.. కేవలం 1 రూపాయికే 30 రోజుల వ్యాలిడిటీ, డైలీ 2GB డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌

రైల్వే చట్టం, 1989 నిబంధనల ప్రకారం.. రైలులో శాంతికి భంగం కలిగించడం లేదా ఇతరులకు ఇబ్బంది కలిగించడం శిక్షార్హమైన నేరం. అలాంటి సందర్భాలలో రైల్వే పోలీసులు (RPF) ప్రయాణికుడిని హెచ్చరించవచ్చు. జరిమానా విధించవచ్చు లేదా అవసరమైతే స్టేషన్‌లో వారిని రైలు నుండి దించవచ్చు. వివిధ సందర్భాల్లో జరిమానా 500 రూపాయల నుండి 1000 రూపాయల వరకు లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది. ప్రయాణికులను శిక్షించడం కాదు, ప్రయాణంలో ఇతరుల సౌకర్యాన్ని పరిగణనలోకి తీసుకోవడం గురించి అందరికీ అవగాహన కల్పించడం దీని ఉద్దేశ్యం. ఈ నియమాలు రైలులో ఉన్న ప్రయాణికులకు సమానంగా వర్తిస్తాయి. కానీ పర్యవేక్షణలో మాత్రం కాస్త తేడా ఉంటుంది. AC, స్లీపర్ కోచ్‌లలో ఎక్కువ మంది సిబ్బంది ఉంటారు. జనరల్ కోచ్‌లలో తక్కువ పర్యవేక్షణ ఉంటుంది.

ఇది కూడా చదవండి: Slimmest Smartphone: ఇది ప్రపంచంలోనే అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్‌.. నేడు భారత్‌లో విడుదల

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి