New GST Slabs: రైతులకు, సామాన్యులకు పండుగ ముందే వచ్చింది.. కేంద్రం తీపికబురు
వ్యవసాయం రంగానికి ఉపయోగించే వస్తువులపై 12 నుంచి 5శాతానికి జీఎస్టీ తగ్గించింది కేంద్రం. రైతులు వినియోగించే ట్రాక్టర్లపై 12 నుంచి 5శాతానికి జీఎస్టీ తగ్గడం వల్ల.. కొత్త ట్రాక్టర్ కొనే సమయంలో 20 నుంచి 50వేల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది. అలాగే బీమా సదుపాయాలపై ఎటువంటి జీఎస్టీ ఉండదని స్పష్టం చేసింది.
వ్యవసాయం రంగానికి ఉపయోగించే వస్తువులపై 12 నుంచి 5శాతానికి జీఎస్టీ తగ్గించింది కేంద్రం. ట్రాక్టర్ టైర్లు, విడిభాగాలు, బయో పెస్టిసైడ్స్, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్లు, వ్యవసాయ పరికరాలు అన్నీ 12 నుంచి 5శాతానికి వచ్చాయి. వీటిపై కూడా రైతులకు భారీగా ఆదా అయ్యే అవకాశం ఉంది. పేదలు, మధ్యతరగతికి ఊరటనిచ్చేలా పన్ను శ్లాబుల కుదింపునకు జీఎస్టీ కౌన్సిల్ పచ్చజెండా ఊపింది. వ్యక్తిగత బీమా, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్‌పై 18 శాతం జీఎస్టీ నుంచి జీరోకు తీసుకొచ్చారు. ఇకపై బీమా సదుపాయాలపై ఎటువంటి జీఎస్టీ అనేది ఉండదు. మెడికల్ ఆక్సిజన్, డయాగ్నొస్టి్క్ కిట్‌లు, గ్లూకోమీటర్, కళ్లజోళ్లు లాంటి వాటిపై 12 నుంచి 5 శాతానికి జీఎస్టీ తగ్గించారు. దీనివల్ల హాస్పిటల్ బిల్లులు భారీగా ఆదా అయ్యే అవకాశం ఉంది.
మాయదారి ఉల్లి,వెల్లుల్లి.. 11 ఏళ్ల కాపురాన్నే కూల్చేసాయిగా!
జూ కీపర్‌పై ఎలుగుబంటి దాడి.. పాపం చివరికి
ఆ దేశం లో టీనేజర్లకు సోషల్ మీడియాను బ్యాన్..
పేద యువతికి పెళ్ళి చేసిన పల్లె.. ఇది కదా మానవత్వం అంటే..
అద్దె ఇల్లు కావాలంటూ వచ్చారు.. దొరికింది దోచుకుపోయారు..
ఆ ఊర్లో ప్రజలందరికీ ఒకటే పేరు.. ఎవర్ని పిలిచినా..
వీటిని కుందేళ్లు అనుకునేరు.. ఏంటో తెలిస్తే షాకవుతారు

