Gold Buying: ధన త్రయోదశికి బంగారం కొనాలనుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి.. లేకుంటే నష్టపోతారు..

బంగారం కొనుగోలు సమయంలో కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోయే నాణ్యతలేని బంగారం కొనుగోలు చేసే ప్రమాదం ఉంది. ఒకవేళ మీకు బంగారంపై అవగాహన లేకపోతే అనుభవజ్ఞులైన కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల నుంచి సలహా తీసుకోవడం ఉత్తమం. లేదా విశ్వసనీయ బంగారం వ్యాపారిని సంప్రదించడం మేలు.

Gold Buying: ధన త్రయోదశికి బంగారం కొనాలనుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి.. లేకుంటే నష్టపోతారు..
Gold
Follow us
Madhu

| Edited By: Ravi Kiran

Updated on: Nov 04, 2023 | 7:34 AM

మన సంప్రదాయంలో బంగారానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఏ శుభకార్యమైనా బంగారం ఉండాల్సిందే. అయితే బంగారం కొనాలన్నా.. లేదా బంగారంపై పెట్టుబడి పెట్టాలన్నా ధన త్రయోదశిని చాలా శుభముహూర్తంగా జనాలు భావిస్తుంటారు. ఆ రోజున ఆభరణాలు, నాణేలు, బిస్కట్ల రూపంలో కొనుగోలు చేస్తుంటారు. పైగా ఇది సురక్షితమైన పెట్టుబడిగా అందరూ భావిస్తారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు బంగారాన్ని నగదుగా మార్చుకొనే అవకాశం కూడా ఉండటంతో అందరూ ఈ పసుపువర్ణపు లోహంపై అధికంగా పెట్టుబడులు పెడతారు. అయితే బంగారం కొనుగోలు సమయంలో కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోయే నాణ్యతలేని బంగారం కొనుగోలు చేసే ప్రమాదం ఉంది. ఒకవేళ మీకు బంగారంపై అవగాహన లేకపోతే అనుభవజ్ఞులైన కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల నుంచి సలహా తీసుకోవడం ఉత్తమం. లేదా విశ్వసనీయ బంగారం వ్యాపారిని సంప్రదించడం మేలు. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేసే సమయంలో ప్రతి వినియోగదారుడు కచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయాలు నిపుణులు ద్వారా మీకు అందిస్తున్నాం. ఓ సారి చదివేయండి..

ధ్రువీకరించిన బంగారాన్నే.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్‌) ద్వారా ధ్రువీకరించిన బంగారాన్ని మాత్రమే కొనుగోలు చేయాలి. ఇది బంగారం స్వచ్ఛత, నాణ్యతతో ఉన్నట్లు నిర్ధారిస్తుంది. బీఐఎస్‌ హాల్‌మార్క్‌లో స్వచ్ఛత కోడ్, పరీక్ష కేంద్రం గుర్తు, ఆభరణాల గుర్తు, మార్కింగ్ చేసిన సంవత్సరం ఉంటుంది. ఇది ప్రామాణికతకు చిహ్నం. బంగారం నాణ్యతకు ఈ చిహ్నమే హామీ.

స్వచ్ఛతను తనిఖీ చేయాలి.. బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు, 24 క్యారెట్ల బంగారం స్వచ్ఛమైనది. భారతదేశంలో సాధారణ బంగారం స్వచ్ఛత స్థాయిలు 24, 22, 18 క్యారెట్లుగా ఉంటుంది. మీ బడ్జెట్‌కు తగిన స్వచ్ఛత స్థాయిని ఎంచుకోవచ్చు. 24 క్యారెట్లను స్వచ్ఛమైన బంగారంగా పరిగణిస్తారు. అయితే, ఆభరణాల మృదుత్వం కారణంగా ఇది ఎల్లప్పుడూ ఆచరణాత్మకమైనది కాదు. సాధారణంగా, 22 క్యారెట్లు 18 క్యారెట్ల బంగారాన్ని ఆభరణాల కోసం ఉపయోగిస్తారు.

ఇవి కూడా చదవండి

ధరలను సరిపోల్చుకోవాలి.. బంగారం ధరలు జ్యువెలర్స్ ను బట్టి మారుతుంటాయి. అందుకే ముందు వివిధ ఆభరణాల దుకాణాల మధ్య ధరల్లో తేడాలను అధ్యయనం చేయాలి. మీరు ఆన్‌లైన్‌లో బంగారం ధరను కూడా తనిఖీ చేయవచ్చు. బంగారం ప్రస్తుత మార్కెట్ ధర గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కొనుగోలు చేయడానికి ముందు ప్రస్తుత ధరలను తెలుసుకోవడం చాలా అవసరం. మీరు సరసమైన ధరను పొందుతున్నారని నిర్ధారించుకోవడానికి బహుళ మూలాధారాలను తనిఖీ చేయండి.

మేకింగ్ చార్జీలు.. వ్యాపారస్తులు బంగారాన్ని ఆభరణాలుగా మార్చడానికి మేకింగ్ చార్జీని వసూలు చేస్తారు. ఆభరణాల రూపకల్పన, సంక్లిష్టతను బట్టి మేకింగ్ చార్జీలు మారుతుంటాయి. అందుకే మేకింగ్ చార్జీల గురించి ముందుగా అడగాలి. వాటిని వివిధ జ్యూవెలర్స్ తో సరిపోల్చండి. ఇవి మొత్తం ఖర్చును గణనీయంగా ప్రభావితం చేస్తాయి.

బై-బ్యాక్ పాలసీ.. కొనుగోలు చేసే ముందు, జ్యువెలర్ బై-బ్యాక్ పాలసీని అర్థం చేసుకోండి. భవిష్యత్తులో ఆ బంగారాన్ని తిరిగి స్వర్ణకారుడికి అమ్మితే ఎంత మొత్తం తిరిగి వస్తుందో ఇది మీకు తెలియజేస్తుంది.

ప్రసిద్ధ జ్యూవెలర్స్ నుంచి.. మార్కెట్లో పేరున్న జ్యూవెలర్స్ వద్ద బంగారాన్ని కొనుగోలు చేయడం ఉత్తమం. ఇది మెటల్ నాణ్యత, ప్రామాణికతను నిర్ధారిస్తుంది. పేరున్న ఆభరణాల వ్యాపారులు తాము విక్రయించే బంగారం గురించి కచ్చితమైన సమాచారాన్ని అందించే అవకాశం ఉంది.

తగ్గింపులు, ఆఫర్లు.. పండుగ సీజన్లలో, చాలా మంది జ్యువెలర్లు డిస్కౌంట్లు, ప్రత్యేక ప్రమోషన్‌లను అందిస్తారు. మీ డబ్బుకు ఉత్తమమైన విలువను పొందడానికి వీటిని గమనించండి.

డాక్యుమెంటేషన్.. మీరు సరైన ఇన్‌వాయిస్‌ని, మీ కొనుగోలుకు అవసరమైన అన్ని డాక్యుమెంటేషన్‌ను అందుకున్నారని నిర్ధారించుకోండి. ఇందులో స్వచ్ఛత, బరువు, మేకింగ్ ఛార్జీలు వంటి వివరాలు ఉంటాయి. ఈ డాక్యుమెంటేషన్ ఏదైనా భవిష్యత్ లావాదేవీలు లేదా ఎక్స్ఛేంజీలకు కీలకంగా ఉపయోగపడుతుంది.

నష్టాల గురించి తెలుసుకోండి.. బంగారం విలువైన ఆస్తి, కాబట్టి దానిని కొనుగోలు చేయడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ బంగారాన్ని సురక్షితమైన స్థలంలో భద్రపరుచుకోండి. బీమా చేయించుకోవడం ఉత్తమం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..