AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్. ఈ రోజు ఎంతంటే..

దేశ వ్యాప్తంగా శనివారం దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై శనివారం రూ. 100 పెరిగింది. దీంతో తులం బంగారం ధర రూ. 56,600గా ఉంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 110 పెరిగి రూ. 61,750కి చేరింది. దీపావళి పండుగ నేపథ్యంలో రానున్న రోజుల్లో బంగారం ధర మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరి శనివారం...

Gold Price Today: బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్. ఈ రోజు ఎంతంటే..
Gold Price Today
Narender Vaitla
|

Updated on: Nov 04, 2023 | 6:43 AM

Share

బంగారం ధర కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తోంది. రోజురోజుకీ పెరగడమే తప్ప తగ్గడం లేదన్నట్లు దూసుకుపోతోంది. వరుసగా రెండో రోజు బంగారం ధరలో పెరుగుదల కనిపించడం గమనార్హం. దేశ వ్యాప్తంగా శనివారం దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై శనివారం రూ. 100 పెరిగింది. దీంతో తులం బంగారం ధర రూ. 56,600గా ఉంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 110 పెరిగి రూ. 61,750కి చేరింది. దీపావళి పండుగ నేపథ్యంలో రానున్న రోజుల్లో బంగారం ధర మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరి శనివారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

దేశ రాజధాని ఢిల్లీలో శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,750గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 61,900 వద్ద కొనసాగుతోంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,600గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 61,750 వద్ద కొనసాగుతోంది. చెన్నై విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,180గా ఉంది. అలాగే కోల్‌కతాలో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 56,600గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,750 వద్ద కొనసాగుతోంది. ఇక బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,600గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 61,750 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర వివరాలు..

శనివారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,600 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 61,750గా ఉంది. ఇక నిజామాబాద్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,750గా ఉంది. విజయవాడతో పాటు విశాఖ విషయానికొస్తే.. ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,600గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 61,670 వద్ద కొనసాగుతోంది.

వెండి ధర ఎలా ఉందంటే..

ఇక బంగారం ధర పెరిగితే మరో వైపు వెండి ధరలో తగ్గుదల కనిపించింది. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో శనివారం వెండి ధరలో తగ్గుదల కనిపించింది. కిలో వెండిపై ఏకంగా రూ. 700 తగ్గడం విశేషం. దీంతో శనివారం కిలో వెండి ధర రూ. 74,100 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో ఈరోజు కిలో వెండి ధర రూ. 77,000 వద్ద కొనసాగుతోంది. ఒక ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 74,100గా ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నంలోనూ కిలో వెండి ధర రూ. 77,000 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
వారానికి ఒక్కసారి తిన్నా చాలు.. శరీరం ఉక్కులా మారిపోయిద్ది..
వారానికి ఒక్కసారి తిన్నా చాలు.. శరీరం ఉక్కులా మారిపోయిద్ది..
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ రూట్‌లో ప్రత్యేక ట్రైన్‌లు
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ రూట్‌లో ప్రత్యేక ట్రైన్‌లు
3 మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన.. ఎవరికి హ్యాండిచ్చారో తెలుసా..?
3 మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన.. ఎవరికి హ్యాండిచ్చారో తెలుసా..?
మహాదేవుని త్రిశూలంలోని మూడు కొమ్ముల వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక..
మహాదేవుని త్రిశూలంలోని మూడు కొమ్ముల వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక..
మీ పీఎఫ్‌ ఖాతాలో రూ.5 లక్షలు ఉంటే ఎంత వడ్డీ వస్తుందో తెలుసా?
మీ పీఎఫ్‌ ఖాతాలో రూ.5 లక్షలు ఉంటే ఎంత వడ్డీ వస్తుందో తెలుసా?
నడవలేని వ్యక్తులు కూడా ఇవి తినగానే గుర్రంలా పరుగులు..
నడవలేని వ్యక్తులు కూడా ఇవి తినగానే గుర్రంలా పరుగులు..
AP EAMCET 2026కౌన్సెలింగ్ ఎట్టకేలకు ప్రారంభం.. వెబ్ ఆప్షన్ల లింక్
AP EAMCET 2026కౌన్సెలింగ్ ఎట్టకేలకు ప్రారంభం.. వెబ్ ఆప్షన్ల లింక్
ఆషాఢ పౌర్ణమి రోజున చేయాల్సిన పనులు.. పొరపాటున కూడా చేయకూడని పనులు
ఆషాఢ పౌర్ణమి రోజున చేయాల్సిన పనులు.. పొరపాటున కూడా చేయకూడని పనులు
వందేభారత్‌ స్లీపర్‌ అదుర్స్‌.. విదేశీ మహిళ ప్రశంసలు
వందేభారత్‌ స్లీపర్‌ అదుర్స్‌.. విదేశీ మహిళ ప్రశంసలు
వానాకాలంలో నోటికి రుచిగా ఉండే కొత్తిమీర రోటీ పచ్చడి.. ఇలా చేస్తే
వానాకాలంలో నోటికి రుచిగా ఉండే కొత్తిమీర రోటీ పచ్చడి.. ఇలా చేస్తే