ఈ నెలాఖరులోపు ఈ పనులు చేయకపోతే ఇబ్బందులు తప్పవు.. వెంటనే పూర్తి చేయండి..

Pan-Aadhaar Link:వీటితో పాటు జూన్ మాసం అనగానే పలు రకాల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కొన్ని పనులు తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. వాటిల్లో పాన్-ఆధార్ లింక్ చేయడం నుంచి అధిక ఈపీఎఫ్ పెన్షన్ కోసం దరఖాస్తు చేయడం వరకు అనేక ఆర్థిక పనులను జూన్ లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. 

ఈ నెలాఖరులోపు ఈ పనులు చేయకపోతే ఇబ్బందులు తప్పవు.. వెంటనే పూర్తి చేయండి..
Aadhaar - PAN
Follow us

|

Updated on: Jun 01, 2023 | 5:00 PM

2023లో అప్పుడే జూన్ మాసం వచ్చేసింది. జూన్ అనగానే అందరి ఇళ్లల్లో బడ్జెట్ లెక్కలే కనిపిస్తాయి. పిల్లల స్కూల్ ఫీజులు, బుక్స్, ఆటో చార్జీలు, కొత్త యూనిఫామ్స్ అంటూ ఖర్చు చాంతాడంతా ఉంటుంది. అయితే వీటితో పాటు జూన్ మాసం అనగానే పలు రకాల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కొన్ని పనులు తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. వాటిల్లో పాన్-ఆధార్ లింక్ చేయడం నుండి అధిక ఈపీఎఫ్ పెన్షన్ కోసం దరఖాస్తు చేయడం వరకు అనేక ఆర్థిక పనులను జూన్ 2023లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎటువంటి జరిమానాలు లేదా ఇతర పరిణామాలను ఎదుర్కొనకుండా ఉండాలంటే సమయానికి ఇవి పూర్తి చేయాలి. ఆ పనులు ఎంటి? ఎలా చేయాలి ఓసారి చూద్దాం..

పాన్-ఆధార్ లింకింగ్..

పర్మినెంట్ అకౌంట్ నంబర్(PAN)ను మీ ఆధార్ కార్డ్‌తో 30 జూన్ 2023లోపు, ఆదాయపు పన్ను శాఖ ద్వారా తప్పనిసరిగా లింక్ చేయాలి. ఇప్పటికే ఈ అనుసంధానం కోసం గడువును అధికారులు అనేకసార్లు పొడిగించారు. ఈసారి గడువులోపు పూర్తి చేయని వ్యక్తులపై రూ.1,000 జరిమానా విధిస్తారు. అలాగే పాన్, ఆధార్ కార్డ్‌లను లింక్ చేయకపోతే మీ ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్‌ను ఐటీ శాఖ ప్రాసెస్ చేయదు.

అధిక ఈపీఎఫ్ పెన్షన్ కోసం దరఖాస్తు..

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) చందాదారులకు నెలకు రూ. 15,00కు మించిన పెన్షన్ పొందే వెసులుబాటును కల్పించింది.దీని కోసం ఉద్యోగుల బేసిక్ జీతం నుంచి 8.33శాతం డిడక్ట్ అవడానికి అవకాశం ఇచ్చారు. ఈ అధిక పెన్షన్ ఆప్షన్ ను ఎంచుకోడానికి 2023, జూన్ 26 వరకూ గడువు ఉంది.

ఇవి కూడా చదవండి

బ్యాంక్ లాకర్ ఒప్పందం..

2023, డిసెంబర్ 31 నాటికి కొత్త లాకర్ ఒప్పందాల దశలవారీ పునరుద్ధరణను పూర్తి చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులను ఆదేశించింది. అయితే, 30 జూన్ 2023 నాటికి బ్యాంకులు 50 శాతం నమోదు మైలురాళ్లను అనుసరించాలి. 30 సెప్టెంబర్ 2023 నాటికి 75 శాతం దాటాలి.

ఉచిత ఆధార్ అప్‌డేట్..

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) జూన్ 14, 2023 వరకు ఆధార్ కోసం డాక్యుమెంట్ అప్‌డేట్ సదుపాయాన్ని ఉచితంగా అందించింది. అయితే, ఈ సేవ కేవలం మైఆధార్ పోర్టల్‌లో మాత్రమే ఉచితంగా అందిస్తోంది. ఆధార్ సెంటర్‌లలో రూ. 50 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..