NIO ES6 Electric car: మూడు రోజుల్లో ముప్పై వేల బుకింగ్స్.. ఈ ఎలక్ట్రిక్ కారు చాలా హాట్ గురూ..

ప్రముఖ బ్రాండ్ నియో కంపెనీకి రెండో జనరేషన్ ఈఎస్6 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు కూడా ఇదే తరహా అటెన్షన్ ను వినియోగదారులను పొందింది. అలా మార్కెట్లోకి విడుదల అయ్యిందో లేదో పెద్ద ఎత్తున ప్రీ బుకింగ్స్ చేసుకుంటున్నారు. మూడో రోజుల్లో ఏకంగా 30,000 కార్లకు ప్రీ ఆర్డర్లు వచ్చాయి.

NIO ES6 Electric car: మూడు రోజుల్లో ముప్పై వేల బుకింగ్స్.. ఈ ఎలక్ట్రిక్ కారు చాలా హాట్ గురూ..
Nio Es6 Suv
Follow us

|

Updated on: Jun 01, 2023 | 5:30 PM

మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. ఇంధన పెరుగుతుండటం, ఎలక్ట్రిక్ కార్ల నిర్వహణ వ్యయం తక్కువగా ఉంటుండంతో అందరూ వాటివైపు మొగ్గుచూపుతున్నారు. మార్కెట్లోకి ఏ ఒక్క కారు లాంచ్ అయినా దాని గురించి ఆసక్తి తెలుసుకుంటున్నారు. ఫీచర్లు, లుక్ బాగుంటే దాని వివరాలు తెలుసుకొని, ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ప్రీ బుకింగ్స్ ప్రారంభం కాగానే ఎగబడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. చైనా మార్కెట్ అయితే మరింత ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తోంది. ప్రముఖ బ్రాండ్ నియో కంపెనీకి రెండో జనరేషన్ ఈఎస్6 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు కూడా ఇదే తరహా అటెన్షన్ ను వినియోగదారులను పొందింది. అలా మార్కెట్లోకి విడుదల అయ్యిందో లేదో పెద్ద ఎత్తున ప్రీ బుకింగ్స్ చేసుకుంటున్నారు. మూడో రోజుల్లో ఏకంగా 30,000 కార్లకు ప్రీ ఆర్డర్లు వచ్చాయని నియో ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పడు చూద్దాం..

చైనాలో టాప్ బ్రాండ్..

చైనాకు చెందిన ప్రముఖ ఈవీ డిజైనర్, తయారీదారు నియో(NIO) తన బ్రాండ్ నేమ్ ను పదిలం చేసుకుంటూ ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులతో ముందుకు సాగుతోంది. దీనిలో భాగంగానే నియో నుంచి రెండో జనరేషన్ ఈఎస్6 ఈఎస్6 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ(ES6 SUV) కారును గత వారం చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. వాస్తవానికి ఈఎస్6 మోడల్ కారు 2018లోనే మార్కెట్లోకి వచ్చింది. ఇది ఆ కంపెని నుంచి వచ్చిన తక్కువ ఖరీదైన మోడల్. పైగా అత్యధికంగా అమ్ముడైన కారు. దీనిని మరింతగా అప్ గ్రేడ్ చేసి రెండో జనరేషన్ ఈఎస్6 కారును ఆవిష్కరించింది.

మూడు రోజులు.. 30వేల ఆర్డర్లు..

ఈ కారును మార్కెట్లో ఆవిష్కరించిన గంటల వ్యవధిలోనే వినియోగదారులకు దీనికోసం ఎగబడ్డారు. ఇది ఒక రకంగా చైనా మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే దాదాపు 30వేల ప్రీ ఆర్డర్లను కంపెనీ అందుకుంది. కొత్త ES6ని ఆవిష్కరించిన మొదటి 72 గంటల్లో (మే 24 నుంచి మే 27 వరకు) నియో స్టోర్లలో వినియోగదారుల రద్దీని చూసి మార్కెట్ వర్గాలు షాక్ కు గురయ్యారట. కార్ న్యూస్ చైనా నివేదికల ప్రకారం మూడు రోజుల్లో 29,700 ప్రీ ఆర్డర్లు రాగా వీటిలో 6,600 ఆర్డర్లు కన్ఫర్మ్ అయ్యాయి. దాదాపు 330 నియో స్టోర్లలో సగటున 90 కార్లకు ప్రీ ఆర్డర్లు వచ్చాయి. వీటిల్లో కనీసం 20 ఆర్డర్లు డౌన్ పేమెంట్ చెల్లించి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకున్నారు. ప్రీ ఆర్డర్ చేసి వారిలో 70శాతం మది పురుషులే ఉన్నారు. అది కూడా 30 నుంచి 40ఏళ్ల మధ్యలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ధర, లభ్యత..

రెండవ తరం ఈఎస్6 ధర 52,100 డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 42.96 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. జూలై నుంచి ఈ కారు డెలివరీలు ప్రారంభం అవుతాయి. దీనిలో 75kWh, 100kWh, 150 kWh సెమీసోలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ లు వస్తాయి. 150 kWh బ్యాటరీ సింగిల్ చార్జ్ పై ఏకంగా 930 కిమీ మైలేజీని ఇస్తుంది. కేవలం 4.5 సెకండ్లలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..