Electric Two Wheelers: మార్కెట్‌కు మాంచి కిక్ ఇచ్చిన ఎలక్ట్రిక్ వాహనాలు.. అక్టోబర్లో రికార్డు స్థాయి సేల్స్..
పర్యావరణ హిత వాహనాలకు మన దేశంలో డిమాండ్ ఎంతలా ఉందో ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. 2023 అక్టోబర్ మాసంలో దేశ వ్యాప్తంగా అన్ని కంపెనీలకు చెందిన ఈ- స్కూటర్లు మొత్తం 74,252 యూనిట్లు అమ్ముడయ్యాయి. అదే సమయంలో సెప్టెంబర్ మాసంలో ఈ లెక్క 63,706 యూనిట్ల వద్ద ఉంది. అంటే దాదాపు 17శాతం అమ్మకాలలో మెరుగదల కనిపిస్తోంది.

మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు తమ ముద్ర వేస్తున్నాయి. ముఖ్యంగా ఈ- స్కూటర్లు రికార్డు స్థాయి అమ్మకాలతో దూసుకెళ్తున్నాయి. ఫెస్టివ్ సీజన్ మొదలైన గత నెలలో అంటే అక్టోబర్ నెలలో సేల్స్ దుమ్మురేపాయి. ఏకంగా 17శాతం పెరుగుదలను చూపాయి. పర్యావరణ హిత వాహనాలకు ఇక్కడ డిమాండ్ ఎంతలా ఉందో ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. 2023 అక్టోబర్ మాసంలో దేశ వ్యాప్తంగా అన్ని కంపెనీలకు చెందిన ఈ- స్కూటర్లు మొత్తం 74,252 యూనిట్లు అమ్ముడయ్యాయి. అదే సమయంలో సెప్టెంబర్ మాసంలో ఈ లెక్క 63,706 యూనిట్ల వద్ద ఉంది. అంటే దాదాపు 17శాతం అమ్మకాలలో మెరుగదల కనిపిస్తోంది. ఇది భవిష్యత్తు కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల తీరు ఏవిధంగా ఉండబోతోందో చెప్పేందుకు ఓ ఉదాహరణగా ఉపయోగపడుతుంది.
సేల్స్‌లో టాప్ లేపిన కంపెనీలు ఇవే..
- అక్టోబర్‌లో దాదాపు అన్ని టాప్ బ్రాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల కంపెనీలు విక్రయాల్లో గణనీయంగా వృద్ధి రేటును నమోదు చేశాయి. వాటిల్లో ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లు దేశీయ మార్కెట్లో అత్యధిక విక్రయాలు చేసి మొదటి మూడు స్థానాలు సాధించాయి.
- ఓలా ఎలక్ట్రిక్ గత నెలలో 23,644 వాహనాలను విక్రయించింది. ఇది సెప్టెంబర్‌లో 18,615 మాత్రమే విక్రయించింది. అంటే దాదాపు 27% పెరుగుదల నమోదు చేసింది.
- టీవీఎస్ మోటార్ గత నెలలో 16,340 వాహనాలను విక్రయించింది. సెప్టెంబర్‌లో 15,576 వాహనాలను మాత్రమే విక్రయించగా.. 5% వృద్ధిని చూపుతోంది.
- బజాజ్ ఆటో విషయానికొస్తే గత నెలలో 8,289 వాహనాలను విక్రయించగా.. సెప్టెంబర్‌లో 7,087 వాహనాలను మాత్రమే అమ్మింది. అంటే వృద్ధి 26%గా నమోదైంది.
- వీటి తర్వాత స్థానంలో ఏథర్, 16శాతం, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ 8శాతం వృద్ధిని సాధించాయి. కాగా ఒకినావా వీటి తర్వాత స్థానంలో ఉండగా.. గత నెలతో పోల్చితే దాని విక్రయాలు ఈనెలలో తగ్గాయి. అంతే వృద్ధి మైనస్ 18శాతానికి పడిపోయింది. దీనికి కారణం ఫెస్టివల్ సీజన్లో సరైన ఆఫర్లు ప్రకటించకపోవడమే అంటున్నారు మార్కెట్ నిపుణులు. మొదటి ఐదు కంపెనీల నెలవారీ వృద్ధిని గణిస్తే, మొత్తం 82% వృద్ధి రేటు నమోదైంది.
రికార్డు సృష్టించిన హీరో మోటర్‌కార్ప్
అక్టోబర్‌లో కొన్ని కంపెనీలు మార్కెట్‌లో మెరిశాయి. గత నెలతో పోలిస్తే హీరో మోటోకార్ప్ అత్యధిక వృద్ధితో ముందంజలో ఉంది. పండుగల సీజన్ ను బాగా ఉపయోగించుకుందని చెప్పాలి. ఈ కంపెనీ విడా వీ1 ప్రో స్కూటర్ పై ఏకంగా రూ. 40,000 తగ్గింపును అందించింది. ఫలితంగా మంచి సేల్స్ అందుకుంది. ఈ కంపెనీ నుంచి హీరో విడా సెప్టెంబర్ 530 స్కూటర్లను విక్రయించగా.. అక్టోబర్లో ఏకంగా 1914 యూనిట్లను విక్రయించింది. అంటే ఏకంగా 261శాతం వృద్ధి రేటును నమోదు చేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..