AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutual Funds: రిస్క్ ఉన్నా ఫలితం ఉంటుంది.. మంచి రాబడి కావాలంటే వీటిల్లో పెట్టుబడులు పెట్టండి..

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం చాలా ప్రయోజనం కలిగిస్తుంది. దీర్ఘకాలంలో ఆదాయం సంపాదించుకునేందుకు మంచి అవకాశం ఉంటుంది. అందుబాటులో ఉన్న వాటిలో మంచి దానిని ఎంపిక చేసుకుని, మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడి పెట్టాలి. స్టాక్ మార్కెట్ తాజాగా గరిష్ట స్థాయి లాభాలను ఆర్జించింది. ఈ నేపథ్యంలో జూన్ లో పెట్టుబడి పెట్టడానికి టాప్ 5 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వివరాలను నిపుణులు తెలియజేశారు.

Mutual Funds: రిస్క్ ఉన్నా ఫలితం ఉంటుంది.. మంచి రాబడి కావాలంటే వీటిల్లో పెట్టుబడులు పెట్టండి..
Mutual Fund
Madhu
|

Updated on: Jun 20, 2024 | 1:05 PM

Share

మ్యూచువల్ ఫండ్స్ కు ప్రజల ఆదరణ పెరుగుతోంది. గతంలో పట్టణాలు, నగర వాసులు మాత్రమే వీటిపై ఆసక్తి చూపేవారు. ఇప్పడు గ్రామీణ ప్రాంతాల వారికీ ఇవి పరిచయమయ్యాయి. వీటిలో పెట్టుబడులు పెట్టడానికి అందరూ ఆసక్తి చూపుతున్నారు. అయితే మ్యూచువల్ ఫండ్స్ వల్ల రాబడితో పాటు రిస్క్ కూడా ఉంటుంది. కాబట్టి ముందుగా పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. స్టాక్ మార్కెట్ పైనే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆధారపడి ఉంటుంది. మిగిలిన వాటితో పోల్చితే వీటికి రిస్క్ కొంచెం ఎక్కువేనని చెప్పవచ్చు. స్వల్ప కాలంలో అస్థిరంగా ఉన్నా దీర్ఘకాలంలో మంచి రాబడిని అందిస్తాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం చాలా ప్రయోజనం కలిగిస్తుంది. దీర్ఘకాలంలో ఆదాయం సంపాదించుకునేందుకు మంచి అవకాశం ఉంటుంది. అందుబాటులో ఉన్న వాటిలో మంచి దానిని ఎంపిక చేసుకుని, మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడి పెట్టాలి. స్టాక్ మార్కెట్ తాజాగా గరిష్ట స్థాయి లాభాలను ఆర్జించింది. ఈ నేపథ్యంలో జూన్ లో పెట్టుబడి పెట్టడానికి టాప్ 5 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వివరాలను నిపుణులు తెలియజేశారు.

నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్..

స్టాక్ మార్కెట్ లోకి పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఈ ఫండ్ తెలివైన ఎంపిక అని చెప్పవచ్చు. దీని ఫోర్ట్ పోలియో అనేక రంగాలకు విస్తరించి ఉంది. దీంతో ఇది స్థిరమైన ఆదాయాన్ని ఇస్తుంది. ఈ ఫండ్ మేనేజర్లు అధిక అభివృద్ధి కలిగిన కంపెనీలపై దృష్టి కేంద్రీకరిస్తారు. మీ పెట్టుబడిని తెలివిగా ఇన్వెస్ట్ చేస్తారు.

క్వాంట్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్..

స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టి, పన్నులను ఆదా చేయాలనుకునే వారికి క్వాంట్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ ఎంతో ఉపయోగపడుతుంది. దీనిలోని ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్)కు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీ ప్రకారం మినహాయింపు లభిస్తుంది. అలాగే ఈ స్కీమ్ ద్వారా మెరుగైన రాబడి అందుతుంది. దీర్ఘకాలంలో అధిక రాబడి సాధించాలనుకునే వారికి ఈ ఫండ్ అనుకూలంగా ఉంటుంది.

క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్..

స్మాల్ క్యాప్ కేటగిరీలో ఈ ఫండ్ అత్యంత నమ్మకమైంది. స్మాల్ క్యాప్ సంస్థలలో ఎక్కువగా పెట్టుబడులను పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో ఆర్థిక ప్రయోజనాలను పొందడానికి చర్యలు తీసుకుంటుంది. బాటమ్ అప్ విధానం ద్వారా కంపెనీని ఫండ్ మేనేజర్ ఎంచుకుంటాడు. అభివృద్ధి చెందే అవకాశాలను ఉన్న మంచి కంపెనీలను పరిశీలిస్తాడు. వేగవంతమైన అభివృద్ధి తో పాటు మార్కెట్ ఎత్తుపల్లాలను తట్టుకునే సామర్థ్యం ఉన్న వారు ఈ ఫండ్ లో పెట్టుబడులు పెట్టవచ్చు.

మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్..

స్మాల్ క్యాప్ వృద్ధి సామర్థ్యాన్ని లార్జ్ క్యాప్ స్థిరత్వంలో మిళితం చేేసే వాటినే మిడ్ క్యాప్ ఫండ్స్ అంటారు. వీటిలో మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ నమ్మకమైంది. తెలివైన పెట్టుబడి విధానం, మంచి మేనేజ్మెంట్ నిర్ణయాలు, చక్కని ఫైనాన్సియల్ ప్లానింగ్ తో లాభసాటి మధ్య తరహా కంపెనీలను గుర్తిస్తుంది. స్మాల్ క్యాప్ ఫండ్స్ లో కనిపించే అస్థిరత దీనిలో ఉండదు. అధిక లాభాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ మిడ్ క్యాప్ ఫండ్ మంచి ఎంపిక అని చెప్పవచ్చు.

ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్..

మిడ్ క్యాప్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఈ ఫండ్ కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుంది. మంచి రాబడి, లాభాల అభివృద్ధి, ఉత్తమ నిర్వహణ పద్ధతులు, దీర్థ కాలిక ప్రయోజనాలు కలిగిన కంపెనీలలో ఈ ఫండ్ పెట్టుబడులు పెడుతుంది. దీని పెట్టుబడి వ్యూహాలు, ఆలోచనా విధానాలతో స్థిరమైన రాబడిని పొందే వీలుంటుంది. అలాగే మార్కెట్ అస్థిరతను తట్టుకోగలిగే సామర్థ్యం లభిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..