Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPF Claim: మీ పీఎఫ్ క్లయిమ్ రిజక్ట్ అయ్యిందా? కారణమిదే? ఇలా చేస్తే పరిష్కారం..

ఎప్పుడైన అత్యవసర పరిస్థితుల్లో ఈపీఎఫ్ లోని కొంత మొత్తాన్ని విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) దీనిని నిర్వహిస్తుంది. సాధారణంగా ఈపీఎఫ్ విత్ డ్రా కోసం క్లయిమ్ చేసుకున్నప్పుడు గరిష్టంగా 10 రోజుల్లో మన ఖాతాల్లో జమవుతుంది. అయితే కొన్ని సార్లు ఈ క్లయిమ్స్ రిజెక్ట్ అవుతాయి. ఇలా ఎందుకు జరుగుతుంది?

EPF Claim: మీ పీఎఫ్ క్లయిమ్ రిజక్ట్ అయ్యిందా? కారణమిదే? ఇలా చేస్తే పరిష్కారం..
Epfo
Follow us
Madhu

|

Updated on: Sep 28, 2024 | 7:46 PM

ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) అనేది మంచి పదవీవిరమణ పథకం. ఇది ప్రతి ఉద్యోగికి ఉంటుంది. ప్రతి నెల తన జీతం నుంచి కొంత మొత్తం, అలాగే ఉద్యోగి పేరు మీద తన యజమాని కూడా కొంత కంట్రిబ్యూట్ చేస్తారు. ఇవి పదవీవిరమణ సమయానికి పెద్ద మొత్తంలో నగదును అందిస్తుంది. అలాగే పెన్షన్ కూడా కొంత వస్తుంది. అయితే ఎప్పుడైన అత్యవసర పరిస్థితుల్లో ఈపీఎఫ్ లోని కొంత మొత్తాన్ని విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) దీనిని నిర్వహిస్తుంది. సాధారణంగా ఈపీఎఫ్ విత్ డ్రా కోసం క్లయిమ్ చేసుకున్నప్పుడు గరిష్టంగా 10 రోజుల్లో మన ఖాతాల్లో జమవుతుంది. అయితే కొన్ని సార్లు ఈ క్లయిమ్స్ రిజెక్ట్ అవుతాయి. ఇలా ఎందుకు జరుగుతుంది? అందుకు గల కారణాలు ఏంటి? అసలు ఏ సమయంలో మన క్లయిమ్ రిజెక్ట్ అవుతుంది. తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.

ఈపీఎఫ్ క్లయిమ్ రిజెక్షన్..

ఈపీఎఫ్ విత్ డ్రా కోసం క్లయిమ్ చేసుకున్నప్పుడు అది రిజెక్ట్ అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఇందుకు కొన్ని సాధారణ కారణాలు ఉంటాయి. వాటిని నివారించవచ్చు కూడా. అసలు క్లయిమ్ ఎందుకు రిజెక్ట్ అవుతోంది ఈపీఎఫ్ఓ వివరించింది. ఓ యూ ట్యూబ్ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలోని అంశాలను ఓసారి చూద్దాం..

ఈపీఎఫ్ క్లయిమ్ తిరస్కరణకు కారణాలు ఇవి..

కేవైసీ సరిగా లేకపోవడం.. మీ యూనివర్సల్ ఖాతా నంబర్ (యూఏఎన్) మీ ఆధార్ కార్డ్‌కి లింక్ అయ్యిందని, మీ మొబైల్ నంబర్, చిరునామా అప్‌డేట్ అయిందని నిర్ధారించుకోవాలి.

వివరాలలో వ్యత్యాసాలు.. మీ పేరు, పుట్టిన తేదీ, ఇతర వ్యక్తిగత వివరాలు ఈపీఎఫ్ఓతో నమోదు అయిన సమాచారంతో సరిపోలుతున్నాయని ధ్రువీకరించుకోండి.

తప్పు బ్యాంక్ ఖాతా వివరాలు.. మీ బ్యాంక్ ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్, బ్రాంచ్ పేరును ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి.

పత్రాలు సరిగా లేకపోవడం.. మీ క్లెయిమ్ ఫారమ్, గుర్తింపు రుజువు, చిరునామా, బ్యాంక్ ఖాతా వివరాలు వంటి అన్ని అవసరమైన పత్రాలను సమర్పించండి.

అనర్హమైన క్లెయిమ్.. మీరు చేస్తున్న క్లెయిమ్ రకం (ఉదా, పూర్తి, చివరి సెటిల్‌మెంట్, పెన్షన్ ఉపసంహరణ) కోసం మీరు అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నారని నిర్ధారించుకోండి.

అస్పష్టమైన కారణం.. ఉపసంహరణ ప్రయోజనం స్పష్టంగా పేర్కొనకపోవడం లేదా ఈపీఎఫ్ఓ ​​నియమాలు అంటే అది పేర్కొన్న కారణాలలో మీ కారణం లేకపోవడం.

పెండింగ్ బకాయిలు.. మీరు మీ ఈపీఎఫ్ ఖాతాకు సంబంధించి ఏవైనా రుణాలు లేదా అడ్వాన్సులు ఉన్నట్లయితే, మీరు నిధులను ఉపసంహరించుకునే ముందు వాటిని తప్పనిసరిగా పరిష్కరించాలి.

యజమాని-సంబంధిత సమస్యలు.. కొన్ని సందర్భాల్లో, మీ యజమాని ఈపీఎఫ్ నిబంధనలకు అనుగుణంగా ఉన్న సమస్యల కారణంగా క్లెయిమ్ తిరస్కరించవచ్చు. సంస్థ నుంచి రిలీవ్ అయిన తేదీని యజమాని అప్‌డేట్ చేయకపోవడం వంటి సమస్యలు.

మీ యజమాని సహకరించకపోతే..

కొన్ని సందర్భాల్లో మనం పనిచేస్తున్న సంస్థ మన విత్ డ్రా కు ఇబ్బందులు కలుగజేయొచ్చు. మన ఆ కంపెనీ నుంచి రిలీవ్ అయిన తేదీని అప్ డేట్ చేయకపోవడం, లేదా మీరు సరైన విధానంలో కంపెనీ నుంచి బయటకు రాకపోవడం వంటి కారణాల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. అలాంటప్పుడు మీరు పీఎఫ్ క్లయిమ్ ఫైల్ చేసినప్పుడు రిజెక్ట్ అయ్యే అవకాశాలుంటాయి. ఆ సందర్భంలో మీరు ఏం చేయాలంటే..

  • ఈపీఎఫ్ఓ గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ ఫిర్యాదును ఫైల్ చేయండి.
  • ప్రాంతీయ ఈపీఎఫ్ కార్యాలయంలో సంప్రదించండి. మీరు ఈపీఎఫ్ఓ ​​వెబ్‌సైట్‌లో ఈ సమాచారాన్ని కనుగొనవచ్చు.
  • మీ యజమాని సహకరించకుంటే లేబర్ కమిషనర్ కార్యాలయాన్ని ఆశ్రయించొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..