Recurring deposit: రికరింగ్ డిపాజిట్‌తో అదిరే లాభాలు.. ఆ మూడు బ్యాంకుల్లో ఆర్‌డీలపై షాకింగ్ వడ్డీ రేట్లు
వేతన జీవులు అధికంగా ఉండే ఈ దేశంలో చిన్న మొత్తాల పొదుపు పథకాలు ఎక్కువ ప్రజాదరణ పొందాయి. వీటిల్లో కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ), రికరింగ్ డిపాజిట్ (ఆర్‌డీ)ల్లో ప్రజలు ఎక్కువగా పెట్టుబడి పెడుతూ ఉంటారు. అయితే ఈ పథకాలు పదవీకాలం, వయస్సు ఆధారంగా వడ్డీ రేట్లను అందిస్తుంది. మీరు సీనియర్ సిటిజన్ అయితే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ఎఫ్‌డీ, ఆర్‌డీల వడ్డీ రేట్లు దాదాపు సమానంగా ఉంటుంది. సాధారణంగా రెండూ సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్లు అధిక వడ్డీ రేటును అందిస్తాయి.

ధనం మూలం ఇదం జగత్ అనే సామెత అందరూ వినే ఉంటారు. డబ్బు ఉన్న మనిషికే సమాజంలో విలువ ఉంటుందని అర్థం. ఈ నేపథ్యంలో భారతదేశంలో ప్రజలు కచ్చితంగా భవిష్యత్ అవసరాలకు సొమ్మును పొదుపు చేస్తూ ఉంటారు. ఇందులో కూడా వేతన జీవులు అధికంగా ఉండే ఈ దేశంలో చిన్న మొత్తాల పొదుపు పథకాలు ఎక్కువ ప్రజాదరణ పొందాయి. వీటిల్లో కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ), రికరింగ్ డిపాజిట్ (ఆర్‌డీ)ల్లో ప్రజలు ఎక్కువగా పెట్టుబడి పెడుతూ ఉంటారు. అయితే ఈ పథకాలు పదవీకాలం, వయస్సు ఆధారంగా వడ్డీ రేట్లను అందిస్తుంది. మీరు సీనియర్ సిటిజన్ అయితే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ఎఫ్‌డీ, ఆర్‌డీల వడ్డీ రేట్లు దాదాపు సమానంగా ఉంటుంది. సాధారణంగా రెండూ సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్లు అధిక వడ్డీ రేటును అందిస్తాయి. అయితే ఈ పథకాలు పోస్టాఫీసులతో పాటు బ్యాంకుల్లో కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రముఖ బ్యాంకులు ఆర్‌డీలపై ఎలాంటి వడ్డీ రేట్లను అందిస్తున్నాయో? ఓ సారి తెలుసుకుందాం.
ఎస్‌బీఐ ఆర్‌డీ వడ్డీ రేట్లు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన బ్యాంకుల్లో ఆర్‌డీల్లో పెట్టుబడి పెట్టిన సాధారణ ప్రజలకు 6.50 శాతం నుంచి 7 శాతం వడ్డీ రేట్లను అందిస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు 7.35 శాతం నుంచి 7.50 శాతం వరకూ వడ్డీ రేటునిస్తుంది. అయితే ఈ పథకంలో ప్రతి నెలా రూ.100 కనిష్ట డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ ఆర్‌డీ కాలవ్యవధి 1 సంవత్సరం నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ రేట్లు డిసెంబర్ 27, 2023 నుండి అమలులోకి వచ్చాయి. ఎస్‌బీఐ ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ 6.80 శాతం 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల కంటే తక్కువ 7.00 శాతం, 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల కంటే తక్కువ 6.5 శాతం, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల వరకు 6.50 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఆర్‌డీ వడ్డీ రేట్లు సాధారణం నుంచి సంవత్సరానికి 4.50 శాతం నుంచి 7 శాతం వరకు ఉంటాయి. సీనియర్ సిటిజన్లకు 5 శాతం నుంచి 7.75 శాతం వరకు ఉంటుంది. 6 నెలల నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధితో కనీసం రూ.1,000 డిపాజిట్‌తో హెచ్‌డీఎఫ్‌సీ రికరింగ్ డిపాజిట్ ఖాతాను తెరవవచ్చు. ఈ రేట్లు జనవరి 24, 2023 నుంచి అమల్లోకి వస్తాయి. 6 నెలలకు 4.50 శాతం, 9 నెలలు 5.75 శాతం, 12 నెలలు 6.60 శాతం, 15 నెలలు 7.10 శాతం, 24 నెలల నుంచి 120 నెలలకు 7.0 శాతం వడ్డీను అందిస్తుంది.
ఐసీఐసీఐ బ్యాంక్
ఐసీఐసీఐ రెండు రకాల రికరింగ్ డిపాజిట్‌లను అందిస్తుంది. సాధారణ పౌరులకు ఆర్‌డీ 4.75 శాతం నుంచి 7.10 శాతం వరకు వడ్డీని అందిస్తుంది. సీనియర్ సిటిజన్‌లకు ఆర్‌డీ 5.25 శాతం నుంచి 7.60 శాతం వరకు సీనియర్ సిటిజన్‌లకు అందిస్తుంది. పెట్టుబడి వ్యవధి 6 నెలల నుంచి 10 సంవత్సరాల మధ్య ఉంటుంది,. కనీస డిపాజిట్ మొత్తం రూ.500గా ఉంటుంది. ఈ రేట్లు 24 ఫిబ్రవరి 2023 నుండి అమలులోకి వచ్చాయి. ఐసీఐసీఐ బ్యాంకు 6 నెలల ఎఫ్‌డీపై 4.75 శాతం, 9 నెలలు 6.00 శాతం, 12 నెలలపై 6.70 శాతం, 15 నెలలకు 7.10 శాతం, 18 నెలల నుంచి 24 నెలల వరకూ 7.10 శాతం 27 నెలల నుంచి ఐదేళ్ల ఎఫ్‌డీలపై 7 శాతం, 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు 6.90 శాతం వడ్డీను అందిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..







