AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: పోహా తయారీ కేంద్రంతో భారీ లాభాలు.. అదిరిపోయే బిజినెస్‌ ఐడియా

ఈ మధ్య కాలంలో ప్రతీ ఇంట్లో ఉదయం తీసుకునే టిఫిన్‌లో పోహాను తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. పోహా వల్ల ఆరోగ్యానికి జరిగే మేలు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఉదయం పోహాను టిఫిన్‌గా తీసుకుంటే రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. బరువు తగ్గాలనుకునే వారికి కూడా పోహా బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు....

Business Idea: పోహా తయారీ కేంద్రంతో భారీ లాభాలు.. అదిరిపోయే బిజినెస్‌ ఐడియా
Buiness Idea
Narender Vaitla
|

Updated on: Feb 08, 2024 | 10:01 PM

Share

ప్రస్తుతం వ్యాపారంపై అందరిలోనూ ఆసక్తి పెరిగిపోతోంది. కెరీర్‌లో ఛాలెంజింగ్‌ కోసం వ్యాపారాన్ని ఎంచుకుంటున్నారు. ఇక తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు ఆర్జించే వ్యాపారంపై ఎక్కువ మంది ఆసక్తిచూపిస్తున్నారు. మార్కెట్లో ఉన్న అవసరాలకు అనుగుణంగా, కస్టమర్ల అవసరాలను క్యాష్‌ చేసుకుంటూ కొంగొత్త వ్యాపార ఐడియాలతో దూసుకుపోతుతున్నారు. ఈరోజు అలాంటి ఓ బెస్ట్‌ బిజినెస్‌ ఐడియాకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ మధ్య కాలంలో ప్రతీ ఇంట్లో ఉదయం తీసుకునే టిఫిన్‌లో పోహాను తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. పోహా వల్ల ఆరోగ్యానికి జరిగే మేలు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఉదయం పోహాను టిఫిన్‌గా తీసుకుంటే రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. బరువు తగ్గాలనుకునే వారికి కూడా పోహా బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. పోహాలోని ఫైబర్‌ కంటెంట్‌ జీర్ణ క్రియ సమస్యలు దరిచేరకుండా ఉండడంలో ఉపయోగపడుతుంది. అలాగే శరీరానికి అవసరమైన ఇన్‌స్టాంట్‌ శక్తిని అందిస్తుంది. అందుకే పోహా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మంచి లాభాలు ఆర్జించవచ్చు. ఇంతకీ పోహా తయారీ యూనిట్‌ను ఎలా ప్రారంభించాలి.? ఇందుకు అవసరమయ్యే ఖర్చు ఎంత.? ఇప్పుడు తెలుసుకుందాం.

పోహా మ్యానుఫాక్చరింగ్‌ యూనిట్‌ను ప్రారంభంలో రూ. 25,000 పెట్టుబడితో ప్రారంభించవచ్చు. పోహా తయారీ యూనిట్‌ను ప్రారంభించడానికి కనీసం 500 గజాల స్థలం అవసరపడుతుంది. అలాగే ముడి సరకుతో పాటు విద్యుత్ సరఫరా, తయారీ కేంద్రం ఏర్పాటు చేయడానికి కావాల్సిన అనుమతులు ఉండాలి. ఇంటి మేడపై కూడా ఈ యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.

ఇక ఈ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం సైతం రుణం అందిస్తుంది. పోహా తయారీ యూనిట్‌ ద్వారా మొదట్లో కనీసం రూ. 30 నుంచి ఆదాయం పొందొచ్చు. మార్కెటింగ్ బాగా చేసుకొని, తయారీ యూనిట్‌ను విస్తరిస్తే నెలకు రూ. 2 లక్షల వరకు కూడా సంపాదించొచ్చు. సొంతంగా ఒక బ్రాండ్‌ను రూపొందించుకొని, నేరుగా దుకాణాల్లోకి వెళ్లి అమ్ముకుంటే అద్భుత లాభాలు పొందొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్