TATA CNG: టాటా సీఎన్‌జీ కార్లు ఎందుకు ప్రత్యేకమైనవి? ఇతర వాటికంటే ఇందులో 3 అద్భుతమైన ఫీచర్స్‌!

మారుతీ సుజుకి భారతీయ సిఎన్‌జి కార్ల మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇందులో డజనుకు పైగా CNG మోడల్స్ ఉన్నాయి. మారుతి తర్వాత టాటా మోటార్స్, హ్యుందాయ్ నుంచి కూడా అనేక CNG మోడల్‌లను అందుబాటులోకి వచ్చాయి. కానీ, వీటిలో టాటా మోటార్స్ సీఎన్‌జీ కార్లు కొద్దిగా భిన్నమైనవి, ప్రత్యేకమైనవి ఉన్నాయి. టాటా మోటార్స్ సీఎన్‌జీ కార్లతో మూడు ప్రత్యేకతలు ఉన్నాయి..

TATA CNG: టాటా సీఎన్‌జీ కార్లు ఎందుకు ప్రత్యేకమైనవి? ఇతర వాటికంటే ఇందులో 3 అద్భుతమైన ఫీచర్స్‌!
Tata Cng
Follow us
Subhash Goud

|

Updated on: Feb 08, 2024 | 1:27 PM

మారుతీ సుజుకి భారతీయ సిఎన్‌జి కార్ల మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇందులో డజనుకు పైగా CNG మోడల్స్ ఉన్నాయి. మారుతి తర్వాత టాటా మోటార్స్, హ్యుందాయ్ నుంచి కూడా అనేక CNG మోడల్‌లను అందుబాటులోకి వచ్చాయి. కానీ, వీటిలో టాటా మోటార్స్ సీఎన్‌జీ కార్లు కొద్దిగా భిన్నమైనవి, ప్రత్యేకమైనవి ఉన్నాయి. టాటా మోటార్స్ సీఎన్‌జీ కార్లతో మూడు ప్రత్యేకతలు ఉన్నాయి. వీటిని మారుతి లేదా హ్యుందాయ్ సీఎన్‌జీ కార్లు అందించవు. అవి ఏంటో తెలుసుకుందాం.

  1. iCNG టెక్నాలజీ: టాటా CNG కార్లలో iCNG సాంకేతికత అందించబడుతుంది. ఇందులో నేరుగా సిఎన్‌జి మోడ్‌లో కారును స్టార్ట్ చేసుకునే సదుపాయం ఉంది. ఇది ఇండస్ట్రీ-ఫస్ట్ ఫీచర్. ఈ ఫీచర్ ఏ ఇతర కంపెనీల సీఎన్‌జీ కార్లలో అందుబాటులో లేదు. ఇతర వాటిలో కారు మొదట పెట్రోల్‌తో ప్రారంభమవుతుంది. తరువాత సీఎన్‌జీ మోడ్‌కు మారుతుంది. దీని కారణంగా పెట్రోల్ కూడా వృధా అవుతుంది. కానీ టాటా సీఎన్‌జీ కార్లలో ఇలాంటి సిస్టమ్‌ లేదు.
  2. ట్విన్-సిలిండర్ టెక్నాలజీ: ఇప్పుడు టాటా సీఎన్‌జీ కార్లలో ట్విన్ సిలిండర్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. కంపెనీ ఈ టెక్నాలజీని ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించింది. ఇప్పుడు దీనిని తన సీఎన్‌జీ కార్లలో అందిస్తోంది. ట్విన్ సిలిండర్ టెక్నాలజీ, బూట్ స్పేస్ అందించడంలో సహాయపడుతుంది. నిజానికి ఒక పెద్ద సీఎన్‌జీ సిలిండర్ స్థానంలో, రెండు చిన్న సీఎన్‌జీ సిలిండర్లు అందించడం జరిగింది.
  3. సీఎన్‌జీతో AMT గేర్‌బాక్స్: ఇటీవల టాటా మోటార్స్ దాని సీఎన్‌జీ మోడల్స్ టియాగో, టిగోర్‌లలో AMT గేర్‌బాక్స్ ఆప్షన్‌ను జోడించింది. దీనితో ఇది భారతదేశంలో ఏఎంటీ గేర్‌బాక్స్‌తో వచ్చిన మొదటి సీఎన్‌జీ కారుగా అవతరించింది. అయితే హ్యుందాయ్, మారుతి సీఎన్‌జీ కార్లు మాన్యువల్ గేర్‌బాక్స్‌ను మాత్రమే అందిస్తాయి. అంటే మీకు సీఎన్‌జీతో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కావాలంటే టాటా మోటార్స్ మాత్రమే ఎంపిక చేసుకోవాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి
మీకు హై-స్పీడ్ ఇంటర్నెట్ కావాలంటే మొబైల్‌లోని సిమ్‌ని ఇలా చేయండి!
మీకు హై-స్పీడ్ ఇంటర్నెట్ కావాలంటే మొబైల్‌లోని సిమ్‌ని ఇలా చేయండి!
ఉక్రెయిన్‌పై రష్యా భారీ ప్రతీకారం సిద్ధమవుతోందా..?
ఉక్రెయిన్‌పై రష్యా భారీ ప్రతీకారం సిద్ధమవుతోందా..?
భారత బౌలర్లకు హెచ్చరిక: ఆస్ట్రేలియా టీనేజర్ సంచలన వ్యాఖ్యలు!
భారత బౌలర్లకు హెచ్చరిక: ఆస్ట్రేలియా టీనేజర్ సంచలన వ్యాఖ్యలు!
టీమిండియాకు షాక్..! బాక్సింగ్ డే టెస్ట్ ముందు కేఎల్ రాహుల్ గాయం..
టీమిండియాకు షాక్..! బాక్సింగ్ డే టెస్ట్ ముందు కేఎల్ రాహుల్ గాయం..
ఎన్టీఆర్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
ఎన్టీఆర్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
ఆదివారం పొరపాటున కూడా వీటిని తినొద్దు.. ఎందుకంటే
ఆదివారం పొరపాటున కూడా వీటిని తినొద్దు.. ఎందుకంటే
కిర్రాకెక్కించే పజిల్.. ఈ ఫోటోలో నెంబర్ గురిస్తే మీరు తోపు బాసూ.
కిర్రాకెక్కించే పజిల్.. ఈ ఫోటోలో నెంబర్ గురిస్తే మీరు తోపు బాసూ.
ఫ్లిప్‌కార్ట్ నుంచి ప్రత్యేక సేల్‌.. వీటిపై భారీ తగ్గింపు!
ఫ్లిప్‌కార్ట్ నుంచి ప్రత్యేక సేల్‌.. వీటిపై భారీ తగ్గింపు!
ఏంటి.. జమిలికి మరో పదేళ్లా?
ఏంటి.. జమిలికి మరో పదేళ్లా?
బోలోరో వాహనంలో ఓ మిస్టరీ అర.. డౌట్ వచ్చి.. పోలీసులు చెక్ చేయగా
బోలోరో వాహనంలో ఓ మిస్టరీ అర.. డౌట్ వచ్చి.. పోలీసులు చెక్ చేయగా