AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DeepFake Scam: డీప్‌ఫేక్‌.. రూ.207కోట్లు హాంఫట్‌! నేరగాళ్ల కొత్త పంథా.. తస్మాత్‌ జాగ్రత్త!

ఈ ఏఐ సాయంతో అభివృద్ధి చేసిన డీప్‌ఫేక్‌ టెక్నాలజీ ఇప్పుడు అందరికీ బెంబేలెత్తిస్తోంది. ఇప్పటికే దీని బారిన హీరోయిన్లు రష్మికా మందన, ఆలియాభట్‌, కత్రీనా కైఫ్‌లతో పాటు హీరో అక్షయ్‌ కుమార్‌ కూడా పడ్డారు. ఇది కేవలం వీడియోలకు మాత్రమే పరిమతం కావడం లేదు. ఈ డీప్‌ ఫేక్‌ వీడియోలను వినియోగించి మోసగాళ్లు భారీ మోసాలకు పాల్పడుతున్నారు. ఏకంగా పెద్ద పెద్ద కంపెనీలకే షాక్‌ఇస్తున్నారు.

DeepFake Scam: డీప్‌ఫేక్‌.. రూ.207కోట్లు హాంఫట్‌! నేరగాళ్ల కొత్త పంథా.. తస్మాత్‌ జాగ్రత్త!
Cyber Crime
Madhu
|

Updated on: Feb 08, 2024 | 8:53 AM

Share

అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక సాంకేతికత ఎంత మేర ప్రయోజనకం చేకూరుస్తోందో.. అంతే విధంగా ప్రమాదాలను తెచ్చిపెడుతోంది. నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తున్న సాంకేతికత సామాన్యులతో విద్యావేత్తలు, సెలబ్రిటీలు, పలు సంస్థలకు కూడా కీడు చేస్తోంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ). ఈ ఏఐ సాయంతో అభివృద్ధి చేసిన డీప్‌ఫేక్‌ టెక్నాలజీ ఇప్పుడు అందరికీ బెంబేలెత్తిస్తోంది. ఇప్పటికే దీని బారిన హీరోయిన్లు రష్మికా మందన, ఆలియాభట్‌, కత్రీనా కైఫ్‌లతో పాటు హీరో అక్షయ్‌ కుమార్‌ కూడా పడ్డారు. ఇది కేవలం వీడియోలకు మాత్రమే పరిమతం కావడం లేదు. ఈ డీప్‌ ఫేక్‌ వీడియోలను వినియోగించి మోసగాళ్లు భారీ మోసాలకు పాల్పడుతున్నారు. ఏకంగా పెద్ద పెద్ద కంపెనీలకే షాక్‌ఇస్తున్నారు. ఇటీవల ఈ డీప్‌ఫేక్‌ వీడియోను ఉపయోగించుకొని హాంకాంగ్‌కు చెందిన ఓ మల్టీనేషనల్‌ కంపెనీ నుంచి ఏకంగా రూ. 207కోట్లు కొట్టేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

మోసం ఎలా చేశారంటే..

యూకేకి చెందిన ఓ మల్టీనేషనల్‌ కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా బ్రాంచ్‌లు ఉన్నాయి. హాంకాంగ్‌లో కూడా దీనికి ఓ బ్రాంచ్‌ ఉంది. ఈ క్రమంలో కంపెనీ హెడ్‌ ఆఫీసు నుంచి మొదట ఓ సీక్రెట్‌ ఆపరేషన్‌ చేస్తున్నామని, అందుకోసం డబ్బు పంపాలని అకౌంట్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగులకు మెయిల్‌ ద్వారా ఆదేశాలిచ్చారు. ఆ తర్వాత వీడియోకాల్‌ చేశారు. ఈ వీడియో కాల్‌ చేశారు. ఆ కాల్లో ఆ కంపెనీకి చెందిన చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌(సీఎఫ్‌ఓ)తో పాటు మరికొంతి ఉన్నతాధికారుల ముఖాల్ని డీప్‌ఫేక్‌ టెక్నాలజీ సాయంతో తయారు చేసి, వారు మాట్లాడుతున్నట్లు ఆదేశాలిచ్చారు. దీంతో సిబ్బంది మెయిల్‌తో పాటు వీడియో కూడా తమ ఉన్నతాధికారులు చేయడంతో వెంటనే సిబ్బంది వారు సూచించిన ఖాతాలకు డబ్బును విడతల వారీగా ట్రాన్స్‌ఫర్‌ చేశారు. వారం రోజుల పాటు ఈ తంతు నిర్వహించారు. ఇలా మొత్తం 25.6మిలియన్‌ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ. 207కోట్లను వేరు వేరు ఖాతాల్లోకి బదిలీ చేయించారు. ఈ క్రమంలో హెడ్‌ ఆఫీసుకు వెళ్లిన ఆ బ్రాంచ్‌ అకౌంట్‌ అధికారులు అసలు విషయాన్ని గ్రహించి షాక్‌కు గురయ్యారు. దీంతో కంపెనీ సిబ్బంది పోలీసులకు ఆశ్రయించారు.

పక్కా ప్లాన్‌ ప్రకారమే..

ఈ నేరానికి పాల్పడిన దుండగులు పక్కా ప్లాన్‌ ప్రకారమే ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ముందుగా కంపెనీకి చెందిన హెడ్‌ ఆఫీస్‌ చీఫ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ తో పాటు కీలక సిబ్బంది ముఖాలను డీప్‌ ఫేక్‌ చేశారన్నారు. వాళ్ల మాట తీరును కూడా గ్రహించి ఆ విధంగానే వీడియో కాల్లో మాట్లాడారు. దీంతో అకౌంట్స్‌ చూసే బ్రాంచ్‌లోకి అధికారులు వీడియో కాల్లో మాట్లాడుతున్నది తమ ఉ‍న్నతాధికారులే అని భావించి డబ్బులు పంపించినట్లు నిర్ధారించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..