AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honor X9b 5G: హానర్‌ నుంచి మరో 5జీ ఫోన్‌.. సరికొత్త ఇయర్‌ఫోన్స్‌, వాచ్‌తో పాటు ఒకేసారి మార్కెట్లోకి..

ప్రముఖ సెల్‌ఫోన్‌ తయారీదారు హానర్‌ సరికొత్త ఆవిష్కరణలకు సిద్ధమైంది. హానర్‌ చాయిస్‌ ఎక్స్‌5, హానర్‌ చాయిస్‌ వాచ్‌ తో పాటు హానర్‌ ఎక్స్‌9బీ 5జీ స్మార్ట్‌ ఫోన్‌ ను ఒకేసారి లాంచ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అందుకు ముహూర్తం ఫిబ్రవరి 15న ఫిక్స్‌ చేసింది. ఈ గ్యాడ్జెట్లకు సంబంధించిన వివరాలను పలు టీజర్ల ద్వారా వెల్లడించింది. ఈ నేపథ్యంలో హానర్‌ ఎక్స్‌9బీ 5జీ ఫోన్‌కు సంబంధించిన వివరాలు..

Honor X9b 5G: హానర్‌ నుంచి మరో 5జీ ఫోన్‌.. సరికొత్త ఇయర్‌ఫోన్స్‌, వాచ్‌తో పాటు ఒకేసారి మార్కెట్లోకి..
Honor X9b 5g Smartphone
Madhu
|

Updated on: Feb 08, 2024 | 7:23 AM

Share

ప్రముఖ సెల్‌ఫోన్‌ తయారీదారు హానర్‌ సరికొత్త ఆవిష్కరణలకు సిద్ధమైంది. హానర్‌ చాయిస్‌ ఎక్స్‌5, హానర్‌ చాయిస్‌ వాచ్‌ తో పాటు హానర్‌ ఎక్స్‌9బీ 5జీ స్మార్ట్‌ ఫోన్‌ ను ఒకేసారి లాంచ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అందుకు ముహూర్తం ఫిబ్రవరి 15న ఫిక్స్‌ చేసింది. ఈ గ్యాడ్జెట్లకు సంబంధించిన వివరాలను పలు టీజర్ల ద్వారా వెల్లడించింది. ఈ నేపథ్యంలో హానర్‌ ఎక్స్‌9బీ 5జీ ఫోన్‌కు సంబంధించిన వివరాలు చూస్తే ఇది స్నాప్‌డ్రాగన్‌ 6జెన్‌ 1ఎస్‌ఓసీ ప్రాసెసర్‌, 5,800ఎంఏహెచ్‌ బ్యాటరీతో గ్లోబల్‌ మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమైంది. దీని ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు ఇప్పుడు చూద్దాం..

హానర్‌ ఎక్స్‌9బీ 5జీ స్పెసిఫకేషన్లు..

ఫిబ్రవరి 6న ఓ పత్రికా ప్రకటనను హానర్‌ విడుదల చేసింది. హానర్‌ ఎక్స్‌9బీ 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, లభ్యతకు సంబంధించిన వివరాలను దానిలో వెల్లడించింది. ఈ 5జీ స్మార్ట్‌ ఫోన్‌ 5,800ఎంఏహెచ్‌ బ్యాటరీ బ్యాకప్‌తో 18 గంటల కాలింగ్ సమయం, గరిష్టంగా 12 గంటల గేమింగ్ సమయం, 19 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ సమయాన్ని సింగిల్‌ ఛార్జ్‌పై అందిస్తుందని పేర్కొంది. లేదా మూడు రోజులపాటు నిరంతరాయ ఉపయోగించే అవకాశం ఉందని వివరించింది. ఇది 1,000 ఛార్జ్ సైకిల్స్ తర్వాత కూడా దాని సామర్థ్యంలో 80 శాతం నిలుపుకుంటుంది. దీనికి గోల్డ్ బ్యాటరీ లేబుల్‌ను ఇచ్చింది.

హానర్‌ ఎక్స్‌9బీ 5జీ ఆండ్రాయిడ్ 13-ఆధారిత మ్యాజిక్‌ ఓఎస్‌ 7.2 ఆధారంగా పనిచేస్తుంది. అప్‌గ్రేడ్ చేసిన ఫీచర్‌లను అందిస్తోంది. ఇది క్వాల్కామ్‌ స్నాప్‌డ్రాగన్ 6 జెన్‌ 1 ఎస్‌ఓసీ పాటు 8జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా ఆన్‌బోర్డ్ మెమరీని 20జీబీ వరకు పెంచుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

హానర్‌ ఎక్స్‌9బీ 5జీ భారతదేశంలో మిడ్‌నైట్ బ్లాక్, సన్‌రైజ్ ఆరెంజ్ షేడ్స్‌లో వస్తుంది. ఇది హై-ఎండ్ వాచీల నుంచి ప్రేరణ పొందిన డిజైన్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. కెమెరా మాడ్యూల్ డ్యూయల్-రింగ్ డిజైన్‌ను కలిగి ఉంది.

హానర్‌ ఎక్స్‌9బీ 5జీ ఫిబ్రవరి 15న లాంచ్‌ అవుతోంది. హానర్ ఛాయిస్ ఇయర్‌బడ్స్ ఎక్స్‌5, హానర్ ఛాయిస్ వాచ్‌లు కూడా అదే రోజున మన దేశంలో అందుబాటులోకి వస్తాయి.

హానర్‌ ఎక్స్‌9బీ 5జీ గత సంవత్సరం మలేషియా, యూఏఈతో సహా ఎంపిక చేసిన కొన్ని మార్కెట్లలో ఆవిష్కరించింది. హ్యాండ్‌సెట్ భారతీయ వేరియంట్ గ్లోబల్ వేరియంట్‌లో కనిపించే 6.78-అంగుళాల 1.5కే (1,200 x 2,652 పిక్సెల్‌లు) అమోల్డ్‌ స్క్రీన్, 108-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది 35వాట్ల వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతును అందించే అవకాశం ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శీతాకాలంలో ప్రెగ్నెంట్ మహిళలకు సైంటిస్టుల హెచ్చరిక..!
శీతాకాలంలో ప్రెగ్నెంట్ మహిళలకు సైంటిస్టుల హెచ్చరిక..!
పొన్నగంటి పోషకాల పవర్‌హౌజ్‌.. తరచూ తింటే ఆ సమస్యలన్నీమాయం..!
పొన్నగంటి పోషకాల పవర్‌హౌజ్‌.. తరచూ తింటే ఆ సమస్యలన్నీమాయం..!
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్