Heath Insurance: మరింత చౌకగా ఆరోగ్య బీమా.. జీఎస్టీని తగ్గించాలని సూచించిన పార్లమెంటరీ కమిటీ!
ఆరోగ్య, జీవిత, పంటలు తదితర అంశాలకు సంబంధించి ఇబ్బందులను ఎదుర్కొంటున్న పేద, అల్పాదాయ వర్గాల భద్రత, ఆర్థిక రక్షణ కోసం మరిన్ని కొత్త మైక్రోఇన్సూరెన్స్ ఉత్పత్తులను తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని కమిటీ అభిప్రాయపడింది. ఇందు కోసం సుమారు రూ.100 కోట్ల మూలధన నిల్వల అవసరం కావచ్చని అంచనా వేసింది. అలాగే మోటర్ ఇన్సూరెన్స్‌కు..
ఎంపీ జయంత్ సిన్హా నేతృత్వంలోని పార్లమెంట్ కమిటీ సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమా ఉత్పత్తులు, మైక్రోఇన్సూరెన్స్ ఉత్పత్తులపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ని తగ్గించాలని సూచించింది. దీనిపై జీఎస్టీని 18 శాతం కంటే తక్కువగా ఉంచాలని కమిటీ సిఫార్సు చేసింది. నివేదిక ప్రకారం, ‘బీమా ఉత్పత్తులపై, ముఖ్యంగా ఆరోగ్య, టర్మ్ ఇన్సూరెన్స్‌పై ప్రస్తుతం 18 శాతంగా ఉన్న జీఎస్‌టీ రేటును హేతుబద్ధీకరించాల్సిన అవసరం ఉందని కమిటీ అభిప్రాయపడింది. అధిక GST రేటు కారణంగా, ప్రీమియం భారం పెరుగుతుంది. దీని కారణంగా ప్రజలు బీమా పాలసీ తీసుకోవడం కష్టమవుతుంది. అయితే ప్రస్తుతం వీటిపై 18 శాతం వరకు ట్యాక్స్ వడ్డిస్తోంది.
అధిక జీఎస్టీ రేటుతో అధిక ప్రీమియంల భారాన్ని భరించాల్సిన పరిస్థితి వస్తోందని, దీని కారణంగా ఇన్సూరెన్స్ పాలసీలకు కొంతమంది దూరం అవుతున్నట్లు నివేదికలో పార్లమెంటరీ ప్యానెల్ తెలిపింది. బీమాను మరింత సరసమైనదిగా చేయడానికి, ఆరోగ్య బీమా ఉత్పత్తులపై, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, మైక్రోఇన్సూరెన్స్ పాలసీల విషయంలో GST రేటును తగ్గించాల్సిన అవసరం ఉందని కమిటీ అభిప్రాయపడింది.
ప్రభుత్వ రంగానికి చెందిన నాలుగు జనరల్ బీమా కంపెనీల ఆర్థిక పరిస్థితులు బాగాలేవని, వాటిని మరింతగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఆయా సంస్థలు మూలధన కొరతను ఎదుర్కొంటున్నాయని తెలిపింది. అలాగే దివాలా ముప్పూ పొంచి ఉన్నట్టు వెల్లడించింది. 2016-17 నుంచి 2020-21 వరకు ఐదేళ్ల కాలంలోరూ..26,000 కోట్ల నష్టాలను చూసినట్టు వివరించింది.
మైక్రోఇన్సూరెన్స్‌పై..
ఆరోగ్య, జీవిత, పంటలు తదితర అంశాలకు సంబంధించి ఇబ్బందులను ఎదుర్కొంటున్న పేద, అల్పాదాయ వర్గాల భద్రత, ఆర్థిక రక్షణ కోసం మరిన్ని కొత్త మైక్రోఇన్సూరెన్స్ ఉత్పత్తులను తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని కమిటీ అభిప్రాయపడింది. ఇందు కోసం సుమారు రూ.100 కోట్ల మూలధన నిల్వల అవసరం కావచ్చని అంచనా వేసింది. అలాగే మోటర్ ఇన్సూరెన్స్‌కు ప్రాధాన్యతనిచ్చేలా ఆర్థిక సంస్థలు తమ రుణాల మంజూరు సమయంలో నిర్ణయాలు తీసుకోవాలని కమిటీ సూచించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి