Audi SUV Q8: భారతమార్కెట్‌లోకి దూసుకొస్తున్న సరికొత్త ఆడి ఈవీ .. విడుదల ఎప్పుడంటే..?
ఆడి కంపెనీ తన క్యూ8 ఇ-ట్రాన్‌ను ఆగస్టు 18న విడుదల చేయనుందని మార్కెట్ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. ఈ క్యూ8 ఇ-ట్రాన్ ఎస్‌యూవీ, క్యూ8 ఇ-ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్ అనే రెండు వేరియంట్స్‌లో ఈ కార్ అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతం ఉన్న ఇ-ట్రాన్‌తో పోలిస్తే 114 కిలోవాట్ల బ్యాటరీ ద్వారా మరింత శక్తి శ్రేణిని అందిస్తోందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు.
ప్రపంచంలోనే టాప్ కార్ల కంపెనీ అయిన ఆడి 2033 నాటికి ఆల్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీగా అవతరించే ప్రయత్నంలో ఉంది. ఈ వ్యూహంలో భాగంగా పెట్రోల్, ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెడుతుంది. కాబట్టి ప్రస్తుతం క్యూ8 ఈ ట్రాన్ ఈవీని భారతదేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. రాబోయే సంవత్సరాల్లో మరిన్ని ఎలక్ట్రిక్ కార్లు భారతదేశంలో విడుదల చేసే అవకాశం ఉంది. జర్మనీకి చెందిన ఆడి దేశంలో తన ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేసేందుకు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ క్యూ8 ఇ-ట్రాన్‌ను విడుదల చేస్తుంది. ఆడి కంపెనీ తన క్యూ8 ఇ-ట్రాన్‌ను ఆగస్టు 18న విడుదల చేయనుందని మార్కెట్ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. ఈ క్యూ8 ఇ-ట్రాన్ ఎస్‌యూవీ, క్యూ8 ఇ-ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్ అనే రెండు వేరియంట్స్‌లో ఈ కార్ అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతం ఉన్న ఇ-ట్రాన్‌తో పోలిస్తే 114 కిలోవాట్ల బ్యాటరీ ద్వారా మరింత శక్తి శ్రేణిని అందిస్తోందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. 95 కిలో వాట్ల బ్యాటరీతో క్యూ8 ఎస్‌యూవీ వినియోగదారులకు అధిక మైలేజ్‌కు గ్యారెంటీనిస్తుంది. ఈ క్యూ8 ఈ ట్రాన్‌తో సరికొత్త ఆఫర్లతో వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. ఈ కారు ధరతో పాటు మరిన్ని వివరాలను ఓ సారి తెలుసుకుందాం.
క్యూ8 ఈ-ట్రాన్ కారును ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్న ధరల్లోనే భారత్‌లో కూడా అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. భారతదేశంలో ప్రస్తుత ఈవీ పోర్ట్‌ఫోలియోలో ఈ ట్రాన్ 50, ఈ ట్రాన్ 55, ఈ ట్రాన్ స్పోర్ట్ బ్యాక్ 55, ఈ ట్రాన్ జీటీ, ఆర్‌ఎస్ ఈ ట్రాన్ జీటీ కార్లు అందుబాటులో ఉన్నాయి. క్యూ8 ఇ-ట్రాన్ పూర్తిగా నిర్మించిన యూనిట్‌గా దిగుమతి చేస్తామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ కార్ భారతదేశంలో అందుబాటులో ఉన్న ఈవీ పోర్ట్‌ఫోలియోలోని టాప్-ఎండ్ వేరియంట్‌లలో ఒకటిగా ఉంటుందని పేర్కొంటున్నారు. భారతదేశంలో ఈ కార్ల సగటు ధర రూ. 1.5 కోట్లకు విక్రయిస్తున్నారు. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 2023 ప్రథమార్థంలో ఆడి భారతదేశంలో రిటైల్ విక్రయాల్లో 97 శాతం వృద్ధిని నమోదు చేసి 3,474 యూనిట్లకు చేరుకుంది. 2022లో ఆడి ఇండియా 4,187 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది, 2021లో 3,293 యూనిట్లతో పోలిస్తే, 27.14 శాతం వృద్ధిని సాధించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..