Upasana Konidela: మా ప్రపంచంలోకి కొత్తగా ఒకటి వచ్చింది.. గుడ్‌ న్యూస్ చెప్పిన ఉపాసన..

Upasana Konidela: మా ప్రపంచంలోకి కొత్తగా ఒకటి వచ్చింది.. గుడ్‌ న్యూస్ చెప్పిన ఉపాసన..

Anil kumar poka

|

Updated on: Aug 01, 2022 | 6:34 PM

మెగాపవర్‌ స్టార్ రామ్‌చరణ్‌ భార్యగానే కాకుండా తనకంటూ.. ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉపాసన కొణిదెల తాజాగా తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌తో ఓ విషయం షేర్‌ చేసుకున్నారు.


మెగాపవర్‌ స్టార్ రామ్‌చరణ్‌ భార్యగానే కాకుండా తనకంటూ.. ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉపాసన కొణిదెల తాజాగా తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌తో ఓ విషయం షేర్‌ చేసుకున్నారు. తమ ప్రపంచంలోకి ఓ కొత్త వస్తువు వచ్చిందన్నారు. తనో కొత్త ఎలక్ట్రానిక్ కారు కొనగోలు చేసినట్టు.. ఓ వీడియోతో అప్డేట్ ఇచ్చారు. తన డెయిలీ రోటీన్‌ లైఫ్‌కు సరిపోయేలా ఈ కార్ ఉందంటూ.. సంబర పడిపోయారు కూడా.. ! అయితే ఆ కార్ ఏంటో మీకు కూడా తెలుసు కోవాలని ఉందా.. అయితే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ!ప్రాథమిక ఇందనాలైన పెట్రోల్, డీజిల్ తో నడిచే కార్లకు బదులు ఎలక్ట్రిక్ కార్లు.. తాజాగా ఇండియన్ మార్కెట్‌ను ఆక్రమిస్తున్నాయి. కొత్త కొత్త ఫీచర్లను.. టెక్నాలజీని అందరికీ పరిచయం చేస్తున్నాయి. దీంతో వినియోగదారులు కూడా.. అప్‌గ్రేడ్‌ అవుతూ.. ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే చెర్రీ భార్య ఉపాసన కూడా.. ఆడిలో వచ్చిన ఎలక్ట్రిక్ కార్‌.. ఈ- ట్రాన్‌ ను తాజాగా తీసుకున్నారు.సుమారు కోటీ 66 లక్షలు ఉండే ఈ కారును.. తీసుకోవడే కాదు.. తన ఫ్యాన్స్ అండ్‌ ఫాలోవర్స్‌కు త్రూ ఓ వీడియో పరిచయం చేశారు. కారు ఫీచర్స్‌ను దగ్గరుండి మరీ అందరికీ చూపించారు. అందులోనూ.. కారులో ఉన్న వాయిస్ కమాండ్ కంట్రోల్ సూపర్ అంటూ.. సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ ప్రపంచంలో ప్రతీది అప్డేట్ అవుతోంది. అందుకే నేను కూడా అప్డేట్ అయ్యా అంటూ.. వీడియోను ఎండ్ చేశారు ఉపాసన.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Published on: Aug 01, 2022 06:34 PM