AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Audi electric car: అయ్యారే.. ఇది కారేనా? చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఎక్కితే మరో ప్రపంచంలో ఉన్నట్లే!

ఈ కారులో ఎక్కడా స్క్రీన్ లుగాని, బటన్ లు గానీ ఉండవు. డ్రైవర్ రాగానే కావాల్సినవి ఓపెన్ అవుతాయి. దీనిలో అని ఫంక్షన్లను కంట్రోల్ చేసేందుకు ఆగ్యూమెంటెడ్ రియాలిటీ(ఏఆర్) టెక్నాలజీని ఆడి వాడింది. కారులోకి ఎక్కి వర్చువల్ రియాలిటీ(వీఆర్) గ్లాసెస్ పెట్టుకోగానే సరికొత్త వర్చువల్ ప్రపంచంలోనికి తీసుకెళ్తుంది.

Audi electric car: అయ్యారే.. ఇది కారేనా? చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఎక్కితే మరో ప్రపంచంలో ఉన్నట్లే!
Audi Activesphere
Madhu
|

Updated on: Jan 28, 2023 | 4:00 PM

Share

ఇది కారు కాదు మరో ప్రపంచం.. దీనిలో ఎక్కి కూర్చుంటే ఏదో వింత ప్రపంచంలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ కూడిన ఆగ్యూమెంటెడ్ వర్చువల్ రియాలిటీ ప్రయాణికులకు సరికొత్త అనుభూతినిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక ఇందులో వాడారు. పూర్తి పర్యావరణ హితంగా.. సూపర్ సామర్థ్యంతో.. ఊహకందని సౌకర్యాలతో ఇది వినియోగదారులకు ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆ కారు ఎవరిది? ఎక్కడ ఉంది? చూద్దాం..

ఆడి కంపెనీ..

దిగ్గజ కార్ మేకర్ ఆడి తన స్పియర్ కాన్సెప్ట్ లో తన నాల్గో ఎలక్ట్రిక్ వాహనం యాక్టివ్ స్పియర్ ను ఆవిష్కరించింది. పూర్తి ఫ్యూచరిస్టిక్ డిజైన్ తో ఉన్న ఈ కారు అత్యధిక సామర్థ్యంతో అందుబాటులో రానుంది. స్పియర్ ఈవీ కాన్సెప్ట్ లో ఇదే తన ఆఖరి మోడల్ అని ఆ కంపెనీ ప్రకటించింది. దీనిలో ఎక్కడ బటన్స్ గానీ స్క్రీన్ లు గానీ ఉండవు. పూర్తి కన్సీల్డ్ టైప్ ఇంటీరియర్ ఉంటుంది. కానీ అద్భుతమైన వర్చువల్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. ఈ కారు పూర్తి వివరాలు చూద్దాం..

త్రీడీ కళ్లద్దాలతో..

ఈ కారులో ఎక్కడా స్క్రీన్ లుగాని, బటన్ లు గానీ ఉండవు. డ్రైవర్ రాగానే కావాల్సినవి ఓపెన్ అవుతాయి. దీనిలో అని ఫంక్షన్లను కంట్రోల్ చేసేందుకు ఆగ్యూమెంటెడ్ రియాలిటీ(ఏఆర్) టెక్నాలజీని ఆడి వాడింది. కారులోకి ఎక్కి వర్చువల్ రియాలిటీ(వీఆర్) గ్లాసెస్ పెట్టుకోగానే సరికొత్త వర్చువల్ ప్రపంచంలోనికి తీసుకెళ్తుంది. దీని ద్వారానే నావిగేషన్, కారులో క్లైమెట్ కంట్రోల్, ఎంటర్ టైన్మెంట్ ఫీచర్లను వినియోగించుకునే వీలుంటుంది. ఈ కారులోని మిక్స్ డ్ రియాలిటీ అనే డిజిటల్ ఎకో సిస్టమ్ మొత్తం సమాచారాన్ని త్రీడిలో ప్రొజెక్ట్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మాన్యువల్ మోడ్ కూడా..

ఇది ఫుల్లీ ఆటోమేటెడ్, సెల్ఫ్ డ్రైవింగ్ కారైనా.. డ్రైవర్ కోరుకొన్నప్పుడు మాన్యుల్ మోడ్ లోకి మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇంటీరియర్ ప్యానల్ డ్యాష్ బోర్డ్ లో హిడెన్ గా ఉన్న స్టీరింగ్ వీల్ డ్రైవర్ కమాండ్ తో బయటకు రావడం ద్వారా మాన్యువల్ మోడ్ ఆన్ అవుతుంది.

టాప్ రేంజ్..

ఈ ఆడి కారు ఏకంగా 600 కిలోమీటర్ల రేంజ్ అందిస్తోందని ఆ కంపెనీ పేర్కొంది. అంటే దీనిలోని బ్యాటరీ సింగిల్ చార్జ్ తో 600 కిలోమీటర్ల మైలేజీ వస్తుందన్నమాట. బ్యాటరీ కూడా ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్ తో వస్తోంది. ఇది 5 శాతం నుంచి 80 శాతానికి కేవలం 25 నిమిషాల్లోనే చార్జ్ అవుతుందని ఆడి కంపెనీ ప్రకటించింది. 800 volt సామర్థ్యంతో కూడిన చార్జింగ్ టెక్ 10 నిమిషాల్లోనే 300 కిలోమీటర్ల దూరం వెళ్లడానికి అవసరమైన పవర్ ను స్టోర్ చేస్తుంది.

బయట వైపు 22 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉంటాయి. కారు బాడీలో ఎక్కువ భాగం గ్లాస్ తో ఉంటుంది. ముందు భాగంలో రన్నింగ్ లైట్లు, వెనకాల అల్ట్రా ఫైన్ ఎల్ఈడీ సాంకేతికతతో వస్తున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..