AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock split: స్టాక్ విభజన చేయనున్న ప్రముఖ కంపెనీ.. ఇన్వెస్టర్లకు ఇక పండగే..!

దీర్ఘకాలంలో రాబడి సంపాదించాలనుకునే వారికి షేర్ మార్కెట్లలో పెట్టుబడులు చాలా ఉపయోగంగా ఉంటాయి. ఇవి కొంచె రిస్క్ తో కూడుకున్నప్పటికీ సంపదను కూడా పోగుచేస్తాయి. ప్రస్తుతం వీటిలో డబ్బులను ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మార్కెట్ స్థాయిని అర్థం చేసుకుంటూ, ఆర్థిక క్రమశిక్షణతో వ్యవహరిస్తే, గరిష్ట లాభాలను పొందే అవకాశం కూడా ఉంటుంది.

Stock split: స్టాక్ విభజన చేయనున్న ప్రముఖ కంపెనీ.. ఇన్వెస్టర్లకు ఇక పండగే..!
Stock Market
Nikhil
|

Updated on: Sep 26, 2024 | 4:45 PM

Share

దీర్ఘకాలంలో రాబడి సంపాదించాలనుకునే వారికి షేర్ మార్కెట్లలో పెట్టుబడులు చాలా ఉపయోగంగా ఉంటాయి. ఇవి కొంచె రిస్క్ తో కూడుకున్నప్పటికీ సంపదను కూడా పోగుచేస్తాయి. ప్రస్తుతం వీటిలో డబ్బులను ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మార్కెట్ స్థాయిని అర్థం చేసుకుంటూ, ఆర్థిక క్రమశిక్షణతో వ్యవహరిస్తే, గరిష్ట లాభాలను పొందే అవకాశం కూడా ఉంటుంది. దీనికోసం వివిధ కంపెనీల షేర్లు, ఐపీవోకు వస్తున్న కంపెనీల గురించి ఎప్పటిప్పుడు కప్పుడు తెలుసుకోవాలి. ఈ నేపథ్యంలో సుదర్శన్ ఫార్మా స్టాక్ స్ల్పిట్ చేయడానికి రంగం సిద్ధం చేసింది. దీనివల్ల వాటాదారులకు లాభం కలగడంతో పాటు మరింత మందికి షేర్లు అందుబాటులోకి వస్తాయి. అసలు స్టాక్ స్ల్పిట్ అంటే ఏమిటో తెలుసుకుందాం.

స్టాక్ స్ల్పిట్ అంటే..

ప్రపంచ వ్యాప్తంగా అన్ని కంపెనీలు తన స్టాక్ ల విషయంలో తీసుకునే చర్యనే స్టాక్ స్ల్పిట్ అంటారు. స్టాక్ మార్కెట్ విలువను తగ్గించడానికి, దాన్ని మరింత మందికి అందుబాటులోకి తీసుకురావడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది. ఇలా చేయడం వల్ల స్టాక్ విలువలు తటస్థంగా ఉంటాయి. కంపెనీలపై ఎలాంటి ప్రభావం చూపవు. ఒక కంపెనీ తన స్టాక్ లోని ఒక షేర్ ను మరిన్ని షేర్లుగా విభజించాలనుకున్నప్పుడు స్టాక్ స్ల్పిట్ చేస్తుంది. అంటే లిక్విడీటీని పెంచడానికి షేర్లను విభజన చేస్తుంది. అది 2:1, 3:1 విధానంలో ఉంటాయి. అంటే గతంలో ఒక షేర్ ఉన్న వారు అదనంగా రెండు నుంచి మూడు షేర్లు పొందుతారు.

సుదర్శన్ కంపెనీ

సుదర్శన్ ఫార్మా కంపెనీ లిమిటెడ్ తన స్టాక్ ల విషయంలో కొత్త ప్రకటన చేసింది. స్టాక్ స్ల్పిట్ (షేర్ల విభజన) విధానాన్ని తెరమీదకు తీసుకురానుంది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక అనేక కారణాలున్నాయి. కొద్ది రోజులుగా దీని షేర్ ధర పెరుగుతూ ఉంది. తన వాటాదారులకు మంచి రిటర్న్స్ ఇస్తోంది. ఇప్పుడు స్టాక్ స్ల్పిట్ ప్రకటనతో కూడా దూసుకుపోతోంది.

ఇవి కూడా చదవండి

త్వరలో ప్రకటించే అవకాశం

సుదర్శన్ ఫార్మా కంపెనీ తన షేర్ల విభజనను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు బోర్డు సభ్యులు సెప్టెంబర్ 30వ తేదీన సమావేశం కానున్నారు. ప్రస్తుతం దీని షేర్ రూ.10 ముఖ విలువ కలిగి ఉంది. నిన్న రూ.404.15 ముగిసిన షేర్ తర్వాత రోజు ఆరంభంలోనే దాదాపు 3 శాతం పెరిగి 417.30 వద్ద మొదలైంది. అదే విధంగా పెరుగుతూ 424.35 వద్ద గరిష్ట స్థాయిని నమోదు చేసింది. స్టాక్ కు సంబంధించి 52 వారాలలో గరిష్ట ధర ఇదే కావడం విశేషం. ప్రస్తుతం రూ.417 వద్ద కొనసాగుతోంది.

2023లో ఐపీవోకు

సుదర్శన్ ఫార్మా కంపెనీ 2023 మార్చిలో ఐపీవోకు వచ్చింది. తన షేర్లను ఒక్కొక్కటీ రూ.73 చొప్పున విడుదల చేసింది. నిపుణుల లెక్కల ప్రకారం ఈ స్టాక్ ప్రస్తుతం వైటీడీ ప్రాతిపదికల 400 శాతం కంటే ఎక్కువ ప్రీమియంతో నడుస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..