TVS Ronin: ఆ టీవీఎస్ బైక్‌పై పండుగ ఆఫర్.. ఏకంగా రూ.15 వేల తగ్గింపు
భారతదేశంలో టీవీఎస్ బైక్స్‌కు యువతలో ఎక్కడలేని క్రేజ్ ఉంది. ముఖ్యంగా సూపర్ బైక్స్ విభాగంలో టీవీఎస్ ఇతర కంపెనీలకు గట్టి పోటీనిస్తుంది. అయితే ఇటీవల కాలంలో యువతను అమితంగా ఆకట్టుకుటున్న టీవీఎస్ రోనిన్ బైక్‌పై పండుగ సీజన్‌లో అదిరే తగ్గింపును ప్రకటించారు. రోన్ వాజ్ ఎస్ఎస్ బైక్‌పై రూ.15 వేల తగ్గింపును ప్రకటించడంతో ఆ వేరియంట్ ప్రారంభ ధర రూ. 1.35 లక్షలకు చేరుకుంది.

భారతదేశంలో టీవీఎస్ బైక్స్‌కు యువతలో ఎక్కడలేని క్రేజ్ ఉంది. ముఖ్యంగా సూపర్ బైక్స్ విభాగంలో టీవీఎస్ ఇతర కంపెనీలకు గట్టి పోటీనిస్తుంది. అయితే ఇటీవల కాలంలో యువతను అమితంగా ఆకట్టుకుటున్న టీవీఎస్ రోనిన్ బైక్‌పై పండుగ సీజన్‌లో అదిరే తగ్గింపును ప్రకటించారు. రోన్ వాజ్ ఎస్ఎస్ బైక్‌పై రూ.15 వేల తగ్గింపును ప్రకటించడంతో ఆ వేరియంట్ ప్రారంభ ధర రూ. 1.35 లక్షలకు చేరుకుంది. అయితే ఈ తగ్గింపు బేస్ వేరియంట్‌కు మాత్రమే వర్తిస్తుందని టీవీఎస్ ప్రతినిధులు చెబుతున్నారు. అలాగే టీవీఎస్ కంపెనీ రోనిన్‌కు సంబంధించిన కొత్త ఫెస్టివల్ ఎడిషన్‌ను రిలీజ్ చేసింది. ఫ్లోరోసెంట్ గ్రీన్ గ్రాఫిక్స్‌తో అద్భుతమైన మిడ్‌నైట్ బ్లూ కలర్‌తో ఈ బైక్ అందరినీ ఆకర్షిస్తుంది. ఈ నేపథ్యంలో టీవీఎస్ రోనిన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
టీవీఎస్ రోనిన్ ఆధునిక-రెట్రో డిజైన్, అధునాతన ఫీచర్లతో బెంచ్ మార్క్‌ను సెట్ చేసింది. ముఖ్యంగా రైడర్లకు అధునాతన రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడంతో పాటు ఈ పండుగ ఎడిషన్ కచ్చితంగా యువతను ఆకట్టుకుంటుందని టీవీఎస్ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రత్యేకమైన డిజైన్, అత్యాధునిక సాంకేతికత, కనెక్టెడ్ ఫీచర్లను కోరుకునే కస్టమర్లకు ఈ బైక్ అనువైనదని పేర్కొంటున్నారు. టీవీఎస్ రోనిన్ ప్రస్తుతం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఎస్ఎస్, టీఎస్, టీడీ, టీడీ స్పెషల్ ఎడిషన్‌లలో కొనుగోలుకు సిద్ధంగా ఉంది. ఈ బైక్ ధరలు వేరియంట్‌ను బట్టి రూ. 1.35 లక్షల నుంచి రూ. 1.73 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. ఈ బైక్ 20 హెచ్‌పీ, 19.93 ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేసే 225.9 సీసీ ఆయిల్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. స్లిప్పర్, అసిస్ట్ క్లచ్‌తో 5 స్పీడ్ గేర్ బాక్స్ ఈ బైక్‌ను రైడర్లకు మరింత దగ్గర చేస్తుంది.
టీవీఎస్ రోనిన్ ముందు భాగంలో యూఎస్‌డీ ఫోర్క్లు, వెనుకవైపు మోనోషాక్ అబ్జార్బర్‌తో వస్తుంది. 17 అంగుళాల చక్రాలు, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ ఫీచర్ ఉన్న డిస్క్ బ్రేక్లు రోనిన్ ప్రత్యేకత. టీవీఎస్ రోనిన్ ఫుల్ ఎల్ఈడీ లైటింగ్, ఆఫ్సెట్ సింగిల్-పాడ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, అడ్జస్టబుల్ లివర్లతో సహా అనేక రకాల ఫీచర్లు ఆకట్టుకుంటాయి. ఈ బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350కు గట్టి పోటీనిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..








