AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో స్కూటర్లు, బైక్‌లు.. మునుపెన్నడూ చూడని డిస్కౌంట్స్..

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో భాగంగా ద్విచక్ర వాహనాలపై కూడా భారీ డీల్స్ అందిస్తోంది. దేశంలోని దాదాపు 700 కంటే ఎక్కువ నగరాల్లో 12,000 పిన్ కోడ్ల పరిధిలో ఫ్లిప్ కార్ట్ ఈ డీల్స్ అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆన్ లైన్లో అందుబాటులో ఉన్న ద్విచక్ర వాహనాలు ఏంటి? వాటిపై ఫ్లిప్ కార్ట్ ఆఫర్లు ఏంటి? తెలుసుకుందాం రండి..

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో స్కూటర్లు, బైక్‌లు.. మునుపెన్నడూ చూడని డిస్కౌంట్స్..
Flipkart Big Billion Days Sale
Madhu
|

Updated on: Sep 26, 2024 | 4:22 PM

Share

పండుగల సీజన్ ప్రారంభమైంది. దీంతో పాటు షాపింగ్ ప్రపంచం ఆఫర్ల జాతరకు గేట్లు తెరిచింది. అన్ని ఆన్ లైన్, ఆఫ్ లైన్ ప్లాట్ ఫారంలు దసరా, దీపావళి స్పెషల్ డిస్కౌంట్లతో వినియోగదారులను ఆకర్షించే పనిలో పడ్డాయి. అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు, గృహోపకరణాలు వంటి వాటిపై సాధారణంగా ఈ-కామర్స్ ప్లాట్ ఫారంలు ఆఫర్లు అందిస్తుంటాయి. అయితే ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ మాత్రం కాస్త భిన్నంగా, కొత్తగా ఆలోచించింది. తన వెబ్ సైట్లో టూ వీలర్ వాహనాలపై కూడా భారీ తగ్గింపు ధరలను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో భాగంగా ద్విచక్ర వాహనాలపై కూడా భారీ డీల్స్ అందిస్తోంది. దేశంలోని దాదాపు 700 కంటే ఎక్కువ నగరాల్లో 12,000 పిన్ కోడ్ల పరిధిలో ఫ్లిప్ కార్ట్ ఈ డీల్స్ అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆన్ లైన్లో అందుబాటులో ఉన్న ద్విచక్ర వాహనాలు ఏంటి? వాటిపై ఫ్లిప్ కార్ట్ ఆఫర్లు ఏంటి? తెలుసుకుందాం రండి..

ఫ్లిప్‌కార్ట్‌లో టూ వీలర్లు..

ఫ్లిప్‌కార్ట్‌ ప్రస్తుతం హీరో, బజాజ్, టీవీఎస్, ఓలా, చేతక్, జావా, యెజీ, విడా, ఏథర్ వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన పెట్రోల్, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయిస్తోంది. ఇందులో వినియోగదారులకు పెట్రోల్ ఆధారిత బైక్లు, ప్రీమియం స్పోర్ట్స్ బైక్లు, స్కూటర్లు వంటివి ఉన్నాయి. అదే విధంగా లైసెన్స్ లేదా రిజి స్ట్రేషన్ అవసరం లేని తక్కువ-స్పీడ్ మోడల్స్ నుంచి హై-స్పీడ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఫ్లిప్‌కార్ట్‌ డీల్స్ ఇలా..

పైన పేర్కొన్న పెట్రోల్, ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలపై భారీ తగ్గింపులు అందిస్తోంది. అసలు ధర కన్నా తగ్గింపు రేటుతో ఫ్లిప్‌కార్ట్‌ విక్రయాలు చేస్తోంది. అంతేకాక ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై 5 శాతం అపరిమిత క్యాష్ బ్యాక్, ఇతర బ్యాంకుల నుంచి ప్రత్యేక ఒప్పందాలు, సూపర్ కాయిన్స్ ద్వారా లాయల్టీ ప్రయోజనాలతో సహా ఫైనాన్సింగ్ ఎంపికలు కూడా ఉంటాయని ఫ్లిప్‌కార్ట్‌పేర్కొంది.

గతేడాది సేల్స్ ఇలా..

గత సంవత్సరం బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌ అనేక ద్విచక్ర వాహనాల మోడళ్లపై డిస్కౌంట్లను అందించింది. రూ. 81,005 ధర ట్యాగ్ ఉన్న హీరో సూపర్ స్ప్రెండర్ ఎక్స్ టెక్ ను రూ. 170,005 కి విక్రయించింది. అదేవిధంగా హీరో ఎక్స్ ట్రీమ్ దాని ఎక్స్-షోరూమ్ ధర రూ.1,20,806కాగా ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 1,07,806 కి వినియోగదారులకు అందించింది. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ఒకాయా ఫాస్ట్ ఎఫ్4 రూ. 1,17,990కి అమ్మకాలు చేసింది. దాని అసలు ధర రూ.1,32,900గా ఉండేది. ఆంపియర్ మాగ్నస్ ను రూ. 1,04,900 వద్ద రిటైల్ గా ఉన్న ధరను సేల్ సమయంలో రూ. 90,155గా చేసి విక్రయించింది.

డిమాండ్ పెరుగుతోంది..

సాధారణంగా ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అంటే ఎలక్ట్రానిక్స్, గృహోపరణాలు, పర్సనల్ నీడ్స్ వంటివి ఎక్కువగా విక్రయాలు చేస్తుంటారు. వీటికే వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. అయితే ఇటీవల కాలంలో ద్విచక్ర వాహనాలను ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ద్విచక్ర వాహనాల డిమాండ్ గత ఏడాదితో పోలిస్తే 2024 ఆగస్టులో 6 రెట్లు పెరిగిందని ఫ్లిప్‌కార్ట్‌పేర్కొంది. ప్రయాణికులు, స్కూటర్లు మరియు ప్రీమియం ద్విచక్ర వాహనాలు, ముఖ్యంగా ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో వృద్ధి గణనీయంగా పెరుగుతూనే ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..