AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TVS Raider 125: తక్కువ ధరలో టీవీఎస్ రైడర్ 125 రీలాంచ్.. కొత్తగా ఏముందంటే..

ఇప్పటికే ఉన్న టీవీఎస్ రైడర్ 125ను అప్ డేట్ చేస్తూ టీవీఎస్ రైడర్ 125 డ్రమ్ వేరియంట్ గా కొత్త వెర్షన్ ని ఆవిష్కరించింది. దీని ధర రూ. 84,869(ఎక్స్ షోరూం)గా ఉంది. పాత మోడల్ తో పోల్చితే రూ. 11,000 తక్కువగా కొత్తది వచ్చింది. కొత్త వేరింయట్ లాంచ్ కావడానికి ముందు ఈ బైక్ ధర రూ. 95,219(ఎక్స్ షోరూం)గా ఉంది.

TVS Raider 125: తక్కువ ధరలో టీవీఎస్ రైడర్ 125 రీలాంచ్.. కొత్తగా ఏముందంటే..
Tvs Raider 125 Drum Variant
Madhu
|

Updated on: Sep 26, 2024 | 3:54 PM

Share

మన దేశంలో టీవీఎస్ నుంచి అనేక టూ వీలర్స్ అందుబాటులో ఉన్నాయి. అధిక పనితీరు, అధిక మైలేజీ, తక్కువ ధరలో కావాలనుకునే వారికి ఇవి బెస్ట్ ఆప్షన్లుగా ఉన్నాయి. కాగా టీవీఎస్ మోటార్ ఇండియా ఇప్పుడు కొత్త ఎంట్రీ లెవెల్ వేరియంట్ ను లాంచ్ చేసింది. ఇప్పటికే ఉన్న టీవీఎస్ రైడర్ 125ను అప్ డేట్ చేస్తూ టీవీఎస్ రైడర్ 125 డ్రమ్ వేరియంట్ గా కొత్త వెర్షన్ ని ఆవిష్కరించింది. దీని ధర రూ. 84,869(ఎక్స్ షోరూం)గా ఉంది. పాత మోడల్ తో పోల్చితే రూ. 11,000 తక్కువగా కొత్తది వచ్చింది. కొత్త వేరింయట్ లాంచ్ కావడానికి ముందు ఈ బైక్ ధర రూ. 95,219(ఎక్స్ షోరూం)గా ఉంది. దీనిలో టాప్ స్పెక్ వెర్షన్ రూ. 1.04లక్షలు(ఎక్స్ షోరూం)గా ఉంది. పాత వేరియంట్ డిస్క్ బ్రేకును కలిగి ఉంటుంది. ఇప్పుడు వచ్చిన కొత్త వెర్షన్లో డిస్క్ బ్రేక్ లేదు. దీనికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

టీవీఎస్ రైడర్ 125 డ్రమ్ వేరియంట్..

టీవీఎస్ కొత్తగా లాంచ్ చేసిన రైడర్ 125 డ్రమ్ వేరియంట్ లుక్, డిజైన్ ఇప్పటికే ఉన్న వేరియంట్ల మాదిరిగానే ఉంటుంది. కొత్త బైక్ రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అవి ఫ్రైకింగ్ రెడ్, వికెడ్ బ్లాక్. ఇతర వేరియంట్లను పరిగణనలోకి తీసుకున్నప్పుడు పెయింట్ స్కీమ్ ఆప్షన్లు ఎక్కువ ఉంటాయి. బేజింగ్ బ్లూ, ఫైర్ ఎల్లో, ఫోర్జా బ్లూ, అలాగే రెండు ప్రత్యేకమైన కలర్ ఆప్షన్లు బ్లాక్ పాంథర్ ఇన్ స్పైర్డ్ పెయింట్, ఐరన్ మ్యాన్ ఇన్ స్పైర్డ్ పెయింట్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.

టీవీఎస్ రైడర్ 125 డ్రమ్ వేరియంట్ స్పెక్స్..

ఈ బైక్ పేరు సూచిస్తున్నట్లుగా టీవీఎస్ రైడర్ 125 130ఎంఎం డ్రమ్ బ్రేక్ తో వస్తుంది. దీనికి కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ మద్దతు ఉంది. ఈ యూనిట్ బైక్ ఇతర వేరియంట్లలో ఉపయోగించిన 240 ఎంఎం డిస్క్ స్థానాన్ని భర్తీ చేసింది. దీనితో పాటు, బ్రాండ్ ఎల్సీడీ కన్సోల్, రైడర్ మోడ్లు, ఎల్ఈడీ హెడ్ లైట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి.

టీవీఎస్ రైడర్ 125 డ్రమ్ వేరియంట్ ఇంజిన్ సామర్థ్యం..

టీవీఎస్ రైడర్ 125 డ్రమ్ వేరియంట్లో 124.8సీసీ ఎయిర్- కూల్డ్ ఇంజిన్ ఆధారంగా పనిచేస్తుంది. 7,500ఆర్పీఎం వద్ద 11.2బీహెచ్పీ, 6,000ఆర్పీఎం వద్ద 11.2ఎన్ఎం ఉత్పత్తి చేస్తుంది. ఇది ఐదు-స్పీడ్ గేర్బాక్స్ తో అమర్చబడి ఉంటుంది. ఇది బైక్, సస్సెన్షన్ కోసం టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుకవైపు మోనోషాక్ సస్పెన్షన్ ఉంటుంది. ఈ ప్రత్యేక మోడల్ బేస్ వేరియంట్, సింగిల్-పీస్ సీటును కలిగి ఉంటుంది. ఈ కొత్త వేరియంట్ బైక్ హీరో ఎక్స్ ట్రీమ్ 125ఆర్, హెూండా ఎస్పీ125వంటి బైక్ లతో మార్కట్లో పోటీ పడనుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..