AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: ఆ వ్యాపారంతో పెట్టుబడి డబుల్.. యువత ఓ సారి ఆలోచించాల్సిందే..!

భారతదేశంలో యువత ఆలోచనలు మారుతున్నాయి. ముఖ్యంగా ఉన్నత భవిష్యత్ కోసం ఉద్యోగం కంటే వ్యాపారమే మిన్న అని అనుకునే వారు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఎవరూ ట్రై చేయని కొత్త వ్యాపారం కోసం చాలా మంది వెతుకుతూ ఉన్నారు. అయితే ఇటీవల కూరల్లో విరివిగా ఉపయోగిస్తున్న మఖానా బిజినెస్ ఇలాంటి సరిగ్గా సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలోని బీహార్‌లోని కోసి డివిజన్ ప్రస్తుతం మఖానా ఉత్పత్తి కేంద్రంగా ఉంది.ఈ డివిజన్‌లో మఖానా భారీ స్థాయిలో సాగు చేస్తున్నారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే మఖానా దేశంలోని అనేక రాష్ట్రాలతో పాటు విదేశాలకు కూడా సరఫరా అవుతుంది.

Business Idea: ఆ వ్యాపారంతో పెట్టుబడి డబుల్.. యువత ఓ సారి ఆలోచించాల్సిందే..!
Makhana Industry
Nikhil
|

Updated on: Sep 27, 2024 | 1:40 AM

Share

భారతదేశంలో యువత ఆలోచనలు మారుతున్నాయి. ముఖ్యంగా ఉన్నత భవిష్యత్ కోసం ఉద్యోగం కంటే వ్యాపారమే మిన్న అని అనుకునే వారు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఎవరూ ట్రై చేయని కొత్త వ్యాపారం కోసం చాలా మంది వెతుకుతూ ఉన్నారు. అయితే ఇటీవల కూరల్లో విరివిగా ఉపయోగిస్తున్న మఖానా బిజినెస్ ఇలాంటి సరిగ్గా సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలోని బీహార్‌లోని కోసి డివిజన్ ప్రస్తుతం మఖానా ఉత్పత్తి కేంద్రంగా ఉంది.ఈ డివిజన్‌లో మఖానా భారీ స్థాయిలో సాగు చేస్తున్నారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే మఖానా దేశంలోని అనేక రాష్ట్రాలతో పాటు విదేశాలకు కూడా సరఫరా అవుతుంది. నౌహట్టా బ్లాక్‌లో ఉన్న ఈ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా మఖానా ఉత్పత్తిలో కొంతమంది వ్యక్తులు చురుగ్గా పని చేస్తున్నారు. . ఈ బృందం వివిధ ప్రాంతాల నుండి ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేసి సరిగ్గా ఉడికించి ఆపై వ్యాపారులకు విక్రయిస్తుంది. ఈ వ్యాపారంలో వ్యాపారులు మంచి లాభాలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మఖానా వ్యాపారం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

బీహార్‌లో కోసి డివిజన్‌లో చాలా మంది మఖానా వ్యాపారం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ వ్యాపారం కొత్తది కావడంతో యువతకు సరిగ్గా సరిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ వ్యాపారంలో లాభం కూడా బాగానే ఉందని, దూరప్రాంతాల నుంచి కూడా వ్యాపారులు ఈ ఆహారోత్పత్తిని కొనుగోలు చేసేందుకు వస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్యంగా చాలా మంది మఖానా సీజన్ సమయంలో కొన్ని నెలలు అక్కడే ఉండి వాటిని కొనుగోలు చేసి వారి వారి ప్రాంతాలకు తరలించి వ్యాపారం చేస్తారు. కోసి ప్రాంతంలో ప్రభుత్వం మఖానా తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తే, అది స్థానిక రైతులకు ఎంతో మేలు చేస్తుందని కొంత మంది రైతులు చెబుతున్నారు. 

మఖానాకు సంబంధించిన ఉత్పత్తులను కూడా తయారీ యూనిట్‌తో తయారు చేయవచ్చు. దీని వల్ల రైతు ఆదాయం రెండింతలు పెరిగి ఎంతో మేలు జరుగుతుందని స్థానిక రైతులు చెబుతున్నారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ సహా అనేక ఇతర రాష్ట్రాల్లో మఖానాకు చాలా డిమాండ్ ఉంది. పలు నివేదికల ప్రకారం కరోనావైరస్ మహమ్మారి సమయంలో మఖానా వ్యాపార ప్రజాదరణ పెరిగింది. ఆ సమయంలో ఆరోగ్యకరమైన స్నాక్స్ భారతదేశంతో పాటు విదేశాలలో సర్వసాధారణంగా మారాయి. బీహార్ ప్రాంతంలో అవి కిలోకు రూ. 13,000 వరకు కూడా లభిస్తాయి.  ఈ నేపథ్యంలో ఆ ప్రాంతానికి వెళ్లి మఖానా కొనుగోలు చేసి యువత వారి సొంత ప్రాంతంలో అమ్మకాలు సాగిస్తే కళ్లు చెదిరే ఆదాయం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..