Gold Price: తగ్గేదేలే.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. 77వేల మార్క్ దాటి పరుగులు.. తాజా రేట్లు ఇవే..

దేశంలో బంగారం ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. దసరా నవరాత్రులు, దీపావళి పండుగకు ముందు పసిడి ధరలు భగభగమంటున్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర 70వేల మార్క్ దాటగా.. 24 క్యారెట్ల పుత్తడి ధర 77వేల మార్క్ దాటింది. నిన్న ఒక్కరోజే దాదాపు రూ.700 వరకు ధర ఎగబాకింది. పండగల సమయంలో ఇలా ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులు, మహిళలు షాకవుతున్నారు..

Gold Price: తగ్గేదేలే.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. 77వేల మార్క్ దాటి పరుగులు.. తాజా రేట్లు ఇవే..
Gold And Silver Price
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 26, 2024 | 6:52 AM

దేశంలో బంగారం ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. దసరా నవరాత్రులు, దీపావళి పండుగకు ముందు పసిడి ధరలు భగభగమంటున్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర 70వేల మార్క్ దాటగా.. 24 క్యారెట్ల పుత్తడి ధర 77వేల మార్క్ దాటింది. నిన్న ఒక్కరోజే దాదాపు రూ.700 నుంచి 1000 వరకు ధర ఎగబాకింది. పండగల సమయంలో ఇలా ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులు, మహిళలు షాకవుతున్నారు.. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ ప్రకారం.. సెప్టెంబర్‌ 26 (గురువారం) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.70,610 ఉండగా.. 24క్యారెట్ల ధర రూ.77,030 గా ఉంది. కాగా.. వెండి ధర స్వల్పంగా తగ్గింది.. కిలో వెండిపై రూ.100 మేర రూ.92,700లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాలతోపాటు.. దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.70,610, 24 క్యారెట్ల ధర రూ.77,030 గా ఉంది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.70,610, 24 క్యారెట్ల బంగారం ధర రూ.77,930గా ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.70,610, 24 క్యారెట్ల ధర రూ.77,180, ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.70,610, 24 క్యారెట్లు రూ.77,030, చెన్నైలో 22క్యారెట్ల రేట్ రూ.70,610, 24 క్యారెట్లు రూ.77,030 ఉంది. బెంగళూరులో 22క్యారెట్ల ధర రూ.70,610, 24 క్యారెట్లు రూ.77,030గా ఉంది.

వెండి ధరలు..

హైదరాబాద్‌‌లో కిలో వెండి ధర రూ.1,01,000, విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,01,000లుగా ఉంది. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.95,100, ముంబైలో రూ.92,700, బెంగళూరులో రూ.90,100, చెన్నైలో రూ.1,01,000 లుగా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..