టేకు సాగుతో లక్షల సంపాదన..! కానీ సాగు చేసేటప్పుడు మాత్రం ఈ విషయం మరిచిపోకండి..

Teak Wood Farming: టేకు కలప చాలా ఖరీదైనది అంతేకాదు బలంగా ఉంటుంది. అందుకే వాణిజ్య పరంగా చాలా డిమాండ్ ఉంటుంది. ఈ కలపను ఓడలు,

టేకు సాగుతో లక్షల సంపాదన..! కానీ సాగు చేసేటప్పుడు మాత్రం ఈ విషయం మరిచిపోకండి..
Teak Wood

Teak Wood Farming: టేకు కలప చాలా ఖరీదైనది అంతేకాదు బలంగా ఉంటుంది. అందుకే వాణిజ్య పరంగా చాలా డిమాండ్ ఉంటుంది. ఈ కలపను ఓడలు, రైల్వే కోచ్‌లు, విలువైన ఫర్నిచర్‌లను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అంతేకాదు ఔషధాల తయారీలో కూడా వాడుతారు. టేకు కలపలో ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ఈ కారణంగా మార్కెట్లలో ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. అంతేకాదు టేకు కలపలో చెదపురుగులు ఎప్పుడూ ఉండవు. సమాచారం ప్రకారం ఈ చెట్టు 200 సంవత్సరాలు జీవిస్తుంది.

టేకు మార్కెట్
టేకు మార్కెట్ ఇప్పటికీ 95 శాతం ఖాళీగానే ఉంది. అందుకే టేకు సాగుచేసిన వారు లక్షలు సంపాదించవచ్చు. చాలా మంది రైతులు టేకు సాగు చేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. టేకు మొక్కలు పెరగడానికి ప్రత్యేకమైన నేల అవసరం లేదు. భూమి pH విలువ 6.5 నుంచి 7.5 మధ్య ఉంటే సరిపోతుంది. పొడి, తేమతో కూడిన వాతావరణం అవసరం. టేకు మొక్కలు సాధారణ ఉష్ణోగ్రతలో బాగా పెరుగుతాయి. టేకు నుంచి మంచి ఆదాయాన్ని పొందడానికి మెరుగైన మొక్కల రకాన్ని ఎంచుకోవడం ముఖ్యం. దిగుబడి పరంగా ఈ రకాలన్నీ సాధారణం అయినప్పటికీ వివిధ వాతావరణాలకు అనుగుణంగా పెరుగుతాయి. టేకులోని దక్షిణ, మధ్య అమెరికా టేకు, పశ్చిమ ఆఫ్రికా టేకు, ఆదిలాబాద్ టేక్, నీలాంబర్ (మలబార్) టేకు, గోదావరి టేకు ఇలా రకరకాల టేకులు ఉన్నాయి. అన్ని రకాల చెట్ల పొడవు భిన్నంగా ఉంటుంది.

టేకును ఎలా సాగు చేయాలి
ముందుగా పొలాలను బాగా దున్నాలి. పాత పంట అవశేషాలను తొలగించాలి. తర్వాత, పొలంలో 8 నుంచి10 అడుగుల దూరం రెండు అడుగుల వెడల్పు, ఒకటిన్నర అడుగుల లోతైన గుంతలను సిద్ధం చేయాలి. టేకు మొక్కలకు ఎక్కువ ఎరువులు అవసరం. అందువల్ల మొక్కలను నాటడానికి ఒక నెల ముందు 500 GM NPK ని 15 KG ఆవు పేడతో కలిపి మట్టిలో చల్లాలి. నాటడానికి ఒక నెల ముందు గుంతలను తయారు చేస్తారు. నాటడానికి తీసుకువచ్చిన మొక్కలు సుమారు రెండు సంవత్సరాల వయస్సు ఉండాలి ఎందుకంటే రెండేళ్ల మొక్క బాగా పెరుగుతుంది.

Satyajith: సినీ పరిశ్రమలో పెను విషాదం.. ప్రముఖ నటుడు సత్యజిత్ కన్నుమూత..

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu